వీడియోల ప్రదర్శన ( 226 - 250 మొత్తం నుండి: 775 )
2014-07-05
ఇస్లామీయ ధర్మాజ్ఞల గురించి మనం ప్రజలకు ప్రాక్టికల్ పద్ధతుల ద్వారా వివరించాలని, కేవలం ధియోరెటికల్ అభిప్రాయాల ద్వారా వివరిస్తే సరిపోదని ఈ వీడియో భాగంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ వివరించారు. వడ్డీ, మధ్యపానం, పొగత్రాగడం, ఆత్మహత్యలు మొదలైన ప్రతి సమస్యకు ఇస్లాం ధర్మంలో పరిష్కారం ఉందనే విషయాన్ని మనం ప్రజలు గ్రహించేలా మనం ప్రయత్నించాలి.
2014-07-05
ఈ దీన్ షో వీడియోలో షేఖ్ కరీమ్ అబు జైద్ కొన్ని మంచి విషయాలు చర్చించారు. సాఫల్యానికి చేర్చే ఫార్ములా, ఇతరులను అసహ్యించుకోవడం మానుకోవాలి, మనస్సు మరియు శరీరానికి మధ్య ఉండే సంబంధం మరియు రెండింటి ఆహారం, నమాజు గురించి కొన్ని అద్భుత పలుకులు, అనేక మంది ప్రజలు బాధ పడుతున్న నిరాశ మరియు నిస్పృహలకు మంచి పరిష్కారం.
2014-07-05
స్త్రీలపై వ్రాయబడే అశ్లీల వ్రాతలు మరియు వివాహ వ్యవస్థ గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నదో ఈ వీడియోలో షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు. హిజాబ్ స్త్రీల గౌరవాన్ని, మానమర్యాదలను పెంచుతుంది. శిక్షల పడకుండా వారి స్థాయిని పెంచుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా వ్యక్తి ప్రాపంచిక హోదాను వదులుకోవటానికి, అతడు లేదా ఆమె కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. హిజాబ్ యొక్క లోతైన అర్థాన్ని ఆయన వివరించారు. అశ్లీలత వలన బాలురకు మరియు బాలికలకు ఎదురయ్యే భయంకరమైన ఫలితాలను ఆయన ప్రస్తావించారు.
2014-07-05
ఈ వీడియోలో, డాక్టర్ లారెన్సు బ్రౌన్ తన కుమార్తె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నపుడు ఏమి జరిగిందో వివరించారు. ఆ క్లిష్ట సమయంలో, అతడు తను నాస్తికుడైనప్పటికీ, సృష్టికర్తను ప్రార్థించాడు.
2014-07-05
ఈ వీడియోలో సోదరుడు హంజా ఆండ్రూస్ ట్జొట్జిస్ ఎలా ఇస్లాం స్వీకరించారో వివరించబడింది. ఆయన తనకు తాను పరిచయం చేసుకుని, తన యవ్వనం గురించి వివరించారు. తర్వాత, మీకు కూడా తప్పకుండా ఏకకాలంలో నవ్వు మరియు ఏడుపు తెప్పించే ఒక కథ చెప్పినారు
2014-07-05
ఈ వీడియోలో సోదరుడు షదీద్ ముహమ్మద్ ఎలా ఇస్లాం స్వీకరించారో, దానికి ముందు దేవుడిని ఎలా అసహ్యించుకునేవారో, కష్టాలు ఎదురైనపుడు దేవుడిని ఎలా దూషించేవారో వివరించినారు. ఆయన ఇప్పుడు అల్లాహ్ ను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు, ట్రినిటీపై నమ్మకం కోల్పోయినట్లు, చర్చీకు వెళ్ళటం ఆపివేసినట్లు తెలిపినారు. తర్వాత అల్లాహ్ ప్రజల కొరకు సహజసిద్ధంగా సృష్టించిన ఇస్లాం స్వీకరించుట వెనుక గల కారణాలను వివరించారు.
2014-07-05
ఒక రసాయన ఇంజనీరు నుండి ఇస్లామీయ పండితుడిగా మారిన స్వీయ జీవిత ప్రయాణంపై షేఖ్ డాక్టర్ యాసిర్ ఖాదీతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. సృష్టికర్తతో గట్టి సంబంధం కలిగి ఉండే దిశలో నడుస్తున్న ఆయన జీవితం నుండి మరియు జీవితంపై ఆయనకున్న పాజిటివ్ దృక్పథం నుండి మీరు కూడా కొన్ని పాఠాలు నేర్చుకోండి. ఈ ఇంటర్వ్యూను ఇంగ్లండులోని ఇస్లాం ఛానెల్ కోసం సాజిద్ వర్దా నిర్వహించారు.
2014-07-05
జుమా ఖుత్బాలోని దీవెనలు మరియు శుభాల గురించి ఈ ఖుత్బా ప్రసంగంలో వివరించబడింది. ఎలా అల్లాహ్ మనకు ఇంతటి గొప్ప దినాన్ని ప్రసాదించాడు. ఈ రోజు జరిగే గొప్ప ఘటనలు మరియు శుక్రవారం వారంలోని మొత్తం దినాలన్నింటిలో ఉత్తమమైన దినం.
2014-07-05
చాలా అరుదుగా చర్చించబడే ఈ ముఖ్యాంశంపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం ఇది. మీ హృదయ కోరికలకు ప్రశాంతత చేకూరింది. మీ హృదయం పరిశుద్ధమైంది మరియు సృష్టికర్తకు సమర్పించుకోవడంలోని మాధుర్యాన్ని చవి చూసింది. మీ హృదయానికి అవసరమైన ఆరోగ్య పరీక్ష చేయండి. స్వర్గ ప్రయాణానికి మీ హృదయం తయారుగా ఉందా లేదా అనేది పరీక్షించండి. ఆ రోజు మీ సంపద మరియు మీ సంతానం ఎందుకూ పనికి రాదు. పరిశుద్థమైన హృదయం మాత్రమే ఆ రోజున మీకు సహాయపడుతుంది. ఖుర్ఆన్ 26:88-89
2014-07-05
బలమైన ఈమాన్ యొక్క చిహ్నాలలో ఒకటి ఏమిటంటే అతడు మెత్తటి మరియు పరిశుద్ధమైన మనస్సు కలిగి ఉంటాడు. అలాగే బలహీనమైన ఈమాన్ యొక్క చిహ్నాలలో ఒకటి ఏమిటంటే అతడు కఠిన మనస్సు కలిగి ఉంటాడు. హృదయం అనేది మన అధ్యాత్మికత మరియు అల్లాహ్ తో కలిగి ఉండవలసిన గట్టి సంబంధంలో ఒక ముఖ్యమైన అవయవం. కఠిన హృదయం యొక్క చిహ్నాలు ఏమిటి, మన హృదయాన్ని కఠినంగా మార్చే కారణాలు ఏవి, కఠిన హృదయాలకు మనం ఎలా చికిత్స చేయగలం మరియు వాటిని మెత్తటి హృదయాలుగా ఎలా మార్చగలం. .. మొదలైన ముఖ్యాంశాలపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం.
2014-07-05
డాక్టర్ షేఖ్ యాసిర్ ఖాదీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహాయంతో జుమా ఖుత్బహ్ లో సూరహ్ హుజురాత్ ఆధారంగా ఖుత్బా ఇచ్చినారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాుహు అలైహి వసల్లం యొక్క ఉత్తమ నడవడిక మరియు ఉత్తమ లక్షణాలను ఈ సూరహ్ వివరిస్తున్నది.
2014-07-05
ఖుర్ఆన్ లోని అతి చిన్న అధ్యాయం - సూరహ్ అల్ కౌథర్. కానీ దీనిలో ఎంత శక్తివంతమైన దీవెనలు ఉన్నాయంటే, దీనిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మొత్తం విశ్వం మరియు అందులోని ప్రతిదాని కంటే ఎక్కువగా ఇష్టపడే వారు.
2014-07-05
ఖుర్ఆన్ లోని 68వ అధ్యాయమైన సూరహ్ అల్ ఖలమ్ లోని పాఠాలు ఈ జుమా ఖుత్బహ్ లో చర్చించబడినాయి. ఖుర్ఆన్ లో అవతరించిన మొట్ట మొదట గాథ ఇది. తోటలోని సహచరుల గాథపై దృష్టి సారిస్తే, సంపదను ఎలా మంచి పద్ధతిలో ఖర్చు పెట్టాలో మనం అర్థం చేసుకోవచ్చు.
2014-07-05
మూసా మరియు ఖిద్ర అలైహిస్సలాంల వృత్తాంతంలోని వివేకం మరియు ప్రయోజనం గురించి షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఒక ముఖ్యమైన ఖుత్బా ప్రసంగం ఇది.
2014-07-05
ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవిత పాఠాలపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా - హజ్ యాత్ర ఒక ప్రవక్త నుండి వారసత్వంగా సంక్రమించిన అమూల్యమైన ఆస్తి. మిలియన్ల కొద్దీ ప్రజలు మొత్తం భూమండలంపై నున్న అత్యుత్తమ ప్రాంతంలో జమ అయి, ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహి స్సలాం ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ, ఆయన బోధించిన ఆచరణలు చేస్తారు. ఈ మొత్తం భూమండంలో దాదాపు ప్రజలందరూ గౌరవించే ఏకైక మహాపురుషుడు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం. ఆయనను ఆదర్శవంతుడిగా చేసుకోమని అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదేశించినాడు. ఆయన ఒంటరిగా ఒక సమాజంతో సమానమని ఖుర్ఆన్ లో అల్లాహ్ చే పేర్కొనబడిన ఏకైక వ్యక్తి. ఆయన యొక్క ఒంటరి ఈమాన్, మొత్తం 1.6 బిలియన్ల ప్రజల ఈమాన్ కు సరిసమానం అయ్యేటంతటి ఉన్నత స్థానానికి చేర్చిన ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క ఆ గొప్ప పని ఏమిటి
2014-07-05
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క "ఐదింటి నుండి లాభం పొందండి - ఐదింటి కంటే ముందే" అనే హదీథుపై షేఖ్ యాసిర్ ఖాదీ చక్కటి లోతైన వివరణ. ప్రతి ఒక్కరి కోసం ఒక మంచి సూచన.
2014-07-05
దుర్ఘటనలు మరియు ప్రకృతి వైపరీత్యాలు మన నిత్యజీవితంలోని ఒక భాగం. మనలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి బాధలు, కష్టనష్టాలకు గురి కాని వారం, నెల లేదా సంవత్సరం అంటూ ఏది ఉండదు. ఇలాంట గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడు, మనలోని ఈమాన్ అంటే దైవవిశ్వాసం కంపిస్తుంది. దుర్ఘటనలకు మరియు ఆపదలకు ఒక విశ్వాసి ఎలా స్పందించాలి ? దుర్ఘటనలను మరియు ఆపదలను ఎలా అర్థం చేసుకోవాలి అనే ముఖ్యాంశంపై షేఖ్ డాక్టర్ యాసిర్ ఖాదీ ఇటీవల ఇచ్చిన ఖుత్బా ప్రసంగం.
2014-07-05
అల్లాహ్ యొక్క ప్రతి ప్రవక్త (అలైహిస్సలాం)కు కొన్ని మహిమలు ఇవ్వబడినాయి. దీనికి కారణం ఆ యా ప్రవక్తల ప్రజలకు వారిలో నమ్మకం కలగాలని. అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ మహిమ. ఖుర్ఆన్ మహిమ ఎంత శక్తివంతమైనదంటే, అది మిగిలిన అన్ని మహిమలను ఆవరించేసింది. షేఖ్ డాక్టర్ యాసిర్ ఖాదీ తన ఖుత్బా ప్రసంగంలో ఖుర్ఆన్ మహిమల గురించి వివరించారు. తప్పకుండా వినవలసిన మంచి ఉపన్యాసం.
2014-07-05
అల్లాహ్ ఒకరిపై చూపే ప్రేమానురాగాలకు ఒక చిహ్నం ఏమిటంటే, ఆయన వారిని ఈ ప్రపంచంలో పరీక్షలకు మరియు ఆపదలకు గురి చేస్తాడు. ఈ కష్టనష్టాల వెనుక ఉన్న అసలు వివేకం ఏమిటి మరియు అలాంటి కఠిన పరిస్థితులకు మరియు కష్టనష్టాలకు ఒక విశ్వాసి ఎలా స్పందించాలి ? నార్త్ అమెరికాలో నిర్మించబడిన మొట్టమొదటి మస్జిదులో సూరహ్ అష్ షర్హ్ పై క్లుప్తంగా తఫ్సీర్ చెబుతూ, షేఖ్ యాసిర్ ఖాదీ ఈ ఖుత్బా ఇచ్చారు.
2014-07-05
అనేక మంది ప్రజలు దిష్టి తగలటమనేది ఒక మూఢవిశ్వాసంగా మరియు పూర్వకాలపు కల్పిత గాథలుగా పరిగణిస్తారు. మరికొంతమంది తమ జీవితాలలో జరిగే ప్రతి తప్పుకు దిష్టితగలటమే కారణమంటూ ఒక సాకుగా చూపుతారు. అయితే, అసలు దిష్టితగలటం అంటే ఏమటి ? ... ఇదొక కల్పితమా, అంధవిశ్వాసమా లేక వాస్తవమా ? ఇతరులకు నష్టం కలిగించేంతగా ప్రభావం చూపే ప్రజల హృదయాలలో రగులుతున్న అసూయాగ్ని గురించి షేఖ్ యాసిర్ ఖాదీ ఇక్కడ చర్చించారు. ఇది చాలా ముఖ్యమైన అంశం.
2014-07-05
అల్లాహ్ కొరకు చేసే ఆరాధనలలో అత్యున్నతమైనది నమాజులో చేసే సాష్టాంగం. ఆలాంటి సజ్దా స్థితిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నప్పుడు ఆయన మనవడైన హసన్ రదియల్లాహు అన్హు ఆయన వీపుపై దూకి, అక్కడే కూర్చున్నారు. సజ్దా నుండి లేస్తే ఆ బాలుడు క్రింద పడి, దెబ్బలు తగిలే అవకాశం ఉన్నందున, చాలా సేపు వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే సజ్దాలోనే ఉండిపోయారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలను ఎంతో ప్రేమించేవారు. తరుచుగా ఆయన తన మనవళ్ళైన హసన్ మరియు హుసైన్ రదియల్లాహు అన్హులను ముద్దాడేవారు మరియు వారితో ఆడుకునే వారు. అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలలో మరొక అనుగ్రహం సంతానం. అయితే ఆ అనుగ్రహంతో పాటు బాధ్యత కూడా ఇవ్వబడింది. మన మరియు పిల్లల మధ్య సంబంధాన్ని మనమెలా దృఢపరచుకోగలం? ఉత్తమ కుటుంబాలుగా మారేందుకు మనం మన పిల్లలను ఎంత ఉత్తమంగా పెంచాలి?
2014-07-05
కుటుంబ వ్యవస్థ అనేది మానవజాతిపై సర్వలోక సృష్టికర్త, ప్రభువు అయిన అల్లాహ్ యొక్క అనేక అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం. ఒకవేళ అల్లాహ్ తలిస్తే, మనల్ని కామేచ్ఛలు లేకుండానే సృష్టించి ఉండేవాడు. కానీ ఆయన మనల్ని స్త్రీపురుష జంటలలో సృష్టించాడు. తద్వారా మనం ఒకరిలో మరొకరు సుఖాన్ని మరియు ప్రశాంతతను పొందుగలము. కుటుంబ వ్యవస్థ సమాజ నిర్మాణంలో ముఖ్యమైన ఇటుక రాయి వంటిది. అయితే ప్రతి అనుగ్రహంతో పాటు కొన్ని బాధ్యతలు, పరీక్షలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి జంట తమ వివాహ బంధాన్ని అత్యుత్తమంగా కొనసాగించేందుకు చిత్తశుద్ధితో శాయశక్తులా ప్రయత్నించాలి. ఈ ఖుత్బహ్ ప్రసంగాన్ని షేఖ్ యాసిర్ ఖాదీ ముస్లిం దంపతుల పరస్పర హక్కులు మరియు బాధ్యతల కొరకు అంకితం చేసారు.
2014-07-05
యువకులకు పీస్ టీవీ పై ప్రసారమయ్యే "ఇన్ ద కంపెనీ ఆఫ్ స్కాలర్స్" అనే కార్యక్రమంలో షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన దావహ్ సలహాలు. ఈ కార్యక్రమాన్ని షేఖ్ యూసుఫ్ ఇద్రీస్ నిర్వహించారు. ఇందులో షేఖ్ యాసిర్ ఫజాగా, డాక్టర్ జొగ్లౌల్ అల్ నగ్గార్ మొదలైన వారు కూడా పాల్గొన్నారు. ముస్లింలకు మరియు ముస్లిమేతరులకు దావహ్ ఇవ్వవలసిన ఆవశ్యకతపై తయారైన ఒక సంక్షిప్త కార్యక్రమం ఇది.
2014-07-05
ఒక మానవుడి జీవిత కాలపు పవిత్ర యాత్ర అయిన హజ్ యాత్ర గురించి షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం. ఆత్మను శుద్ధి చేసే ఈ పవిత్ర యాత్ర చేయాలని మీ మనస్సు తపిస్తున్నది. తమ తమ కాలంలో ప్రవక్తలందరూ చేసిన యాత్ర ఇది. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇచ్చిన పిలుపుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం విన్నది మరియు స్పందించింది. దీనికి స్పందించవలసిన మరియు అల్లాహ్ యొక్క కాబాగృహాన్ని సందర్శించవలసిన బాధ్యత మనలోని ప్రతి ఒక్కరిపై ఉన్నది. మీ మనస్సు తపిస్తున్న యాత్ర ప్రారంభించేందుకు చివరికి మీరు ముందుకు వచ్చారు. ఇక మీరు బయలు దేర బోతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, "ఆయన యొక్క కాబాగృహానికి ఎవరైతే తరలి వస్తారో, వారు ఎలాంటి అసభ్యకరమైన పనులు మరియు పాపకార్యాలు చేయరో, అలాంటి పురుషుడు లేదా స్త్రీ, ఆ యాత్ర నుండి అప్పుడే పుట్టిన పసిబిడ్డ అంతటి పవిత్రంగా మరలి వస్తారు." హదీథు.
2014-07-05
నిర్ణీత సమయాలను, నిర్ణీత దినాలను మరియు నిర్ణీత ప్రాంతాలను మిగిలిన వాటిపై ఉత్తమమైనవిగా అల్లాహ్ ఎంచుకున్నాడు. నిస్సందేహంగా రమదాన్ మాసపు చివరి పది రాత్రులు అత్యంత ఉత్తమమైన రాత్రులు. కానీ, ఆ పది దినాల కంటే ఉత్తమమైనవి దుల్ హజ్ మాసపు మొదటి పది దినాలు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, "మంచి పనులు ఆచరించబడే దుల్ హజ్ మాసపు మొదటి పది దినాల కంటే ఎక్కువగా అల్లాహ్ కు ఇష్టమైన వేరే దినాలు లేవు!" షేఖ్ యాసిర్ ఖాదీ ఈ పది దినాల ఔన్నత్యం గురించి మరియు వాటిలో చేసే మంచి పనులకు లభించే అనేక రెట్ల పుణ్యాల గురించి చాలా చక్కగా వివరించారు.
Go to the Top