వీడియోల ప్రదర్శన ( 201 - 225 మొత్తం నుండి: 775 )
2014-07-09
చివరి దినాలలో నిగర్వంతో కూడిన చక్కటి హృదయం కలిగి ఉండుట అనే ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశంపై షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇచ్చిన ఒక మంచి ఉపన్యాసం.
2014-07-09
ఈ వీడియోలో మన బంగారు గతం మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తు అనే ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశంపై షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ చర్చించినారు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన వీడియో.
2014-07-09
ఈ మిలియనియమ్ లో ముస్లిం యువకులు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఆసక్తికరమైన ఉపన్యాసం ఇచ్చినారు.
2014-07-09
ముస్లింల ఐకమత్యం యొక్క బేసిస్ మరియు ప్రాముఖ్యత అనే అంశంపై షేఖ్ యాసిర్ ఖాదీ చక్కగా ప్రసంగించారు.
2014-07-09
సాఫల్యవంతమైన వివాహబంధం యొక్క తాళపుచెవులు అనే ఈ ఆసక్తికరమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబూ హంజా ఇచ్చినారు.
2014-07-09
గ్రహించే మార్గాలు తెరువు అనే ఈ వీడియోలో చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన విషయాలపై షేఖ్ యాసిర్ ఖాదీ మాట్లాడినారు.
2014-07-09
నీ కోసం నమాజు చేయబడక ముందే నీవు నమాజు చేయి అనే చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన అంశంపై షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఈ వీడియోలో మాట్లాడినారు.
2014-07-09
ఈ ఉపన్యాసంలో అబ్దుర్ రహీమ్ గ్రీన్ చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన కోకో కోలా ముస్లిం తరం అనే అంశంపై మాట్లాడినారు.
2014-07-09
ఈ వీడియోలో ఈ తాత్కాలిక విశ్వసృష్టికి కారణమైన ఎటర్నల్ కాస్ యొక్క లక్షణాల గురించి డాక్టర్ జాఫర్ ఇద్రీస్ చర్చించారు.
2014-07-09
ఈ వీడియోలో ఇస్లాం ధర్మంలో మహిళల స్థానం గురించి షేక్ యూసుప్ ఎస్టేట్ చక్కటి నిదర్శనాలతో వివరించారు.
2014-07-09
అసలు రమదాన్ అంటే ఏమిటి అనే అంశంపై మమ్ దూహ్ ముహమ్మద్ చేసిన ఒక మంచి ప్రసంగం. దీనిలో ఆయన రమదాన్ నెల ప్రాముఖ్యత, ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునేందుకు ఎలాంటి తయారీలు చేసుకోవాలి, ఈ నెలలో ఒక ముస్లిం ఏమి చేయాలి, మరియు రమదాన్ నెలకు సంబంధించిన అనేక అంశాలను ఆయన చర్చించారు.
2014-07-09
రమదాన్ పవిత్ర మాస ప్రాధాన్యత, ఖుర్ఆన్ ను ప్రేమించుట, రమదాన్ మాసంలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునేందుకు చేయవలసిన తయారీల గురించి ఉస్తాద్ నౌమాన్ అలీ ఖాన్ చక్కగా వివరించారు.
2014-07-09
ఉపవాస నిర్వచనం అనే అంశంపై షేఖ్ హాజెమ్ రాజెబ్ ఇచ్చిన ఒక మంచి ఉపన్యాసం. ఇందులో ఆయన అసలు ఉపవాసం అంటే ఏమిటి, దాని ధర్మాజ్ఞలు మరియు శుభాలను ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించారు. అంతేగాక ఈ పవిత్ర మాసానికి సంబంధించిన అంశాలన్నింటినీ చర్చించారు.
2014-07-09
రమదాన్ మాసంలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవటానికి మనం ఎలా తయారు కావాలి అనే అంశంపై అద్నాన్ రాషిద్ ఇచ్చిన ఒక మంచి ఉపన్యాసం.
2014-07-09
"ఒకవేళ ఇదే నా చివరి రమదాన్ అయితే నా పరిస్థితి ఏమిటి?" అనే అంశంపై డాక్టర్ తౌఫీఖ్ చౌదరీ ఇచ్చిన మంచి ఉపన్యాసం. ఇందులో ఆయన రమదాన్ ప్రాముఖ్యత గురించి, రమదాన్ మాసంలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవటానికి ఎలా తయారు కావాలి అనే అంశాల గురించి చర్చించారు.
2014-07-09
అబ్రహామిక్ ధర్మాలైన యూద, క్రైస్తవ మరియు ఇస్లాం ధర్మాలలో ముక్తి మార్గం గురించి ఈ సంక్షిప్త వీడియోలో చర్చించబడింది. ముక్తి మార్గం భావన మీ జీవితంలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించిందా? దైవ మన్నింపు మరియు దయ కురిపించే మార్గం ఏది? దైవం వద్దకు మరియు స్వర్గానికి చేర్చే మార్గం ఏది? యూద ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? క్రైస్తవ ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? ఆదం యొక్క పాపం మానవులందరికీ ఎందుకు సంక్రమిస్తుంది? మన పాపవిమోచన కోసమే జీసస్ మరణించాడా ? ఇస్లాం ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? అసలు వాస్తవం ఏమిటి? ఇస్లాం ధర్మంలో పాశ్చాత్తాపం అనేది ఒక ప్రధాన అంశం? తన ప్రభువు నుండి క్షమాభిక్ష లభిస్తుందనే ఆశతో సన్మార్గం వైపుకు మరలేలా ఇది ప్రతి విశ్వాసిలో ఆశలు కల్పిస్తుంది. ఆది పాపం అంటే ఒరిజినల్ సిన్ లేదా మానవుల పుట్టుకలోనే పాపం ఇమిడి ఉందనే భావనలను ఇస్లాం పూర్తిగా తిరస్కరిస్తున్నది. ప్రతి వ్యక్తి తన కర్మలకు మాత్రమే బాధ్యుడు. ఒరిజినల్ సిన్ అంటే ఆది పాపం అనే బడేదేదీ ఇస్లాం ధర్మంలో లేదు.
2014-07-09
రమదాన్ పవిత్ర మాస శుభాలు అనే పేరుతో తయారైన ఈ వీడియో సీరీస్ లో రమదాన్ మాస ప్రాధాన్యత, ఉపవాసాల ప్రయోజనాలు, రమదాన్ మాస కార్యక్రమాలు, రమదాన్ మాస శుభాల గురించి డాక్టర్ అబ్దుల్లాహ్ హాకిమ్ క్విక్ చక్కగా వివరించారు. చాలా ఆసక్తికరమైన సీరీస్. ముస్లింల కొరకు ఎంతో సమాచారం ఉన్నది.
2014-07-08
ఈ ఉపన్యాసంలో నమాజు ఎలా చేయాలో చాలా వివరంగా చర్చించబడింది.
2014-07-08
ఇస్లాం గురించి మరియు ఇస్లాం ధర్మం ఏమి బోధిస్తున్నది అనే విషయం గురించి ప్రచారంలో ఉన్న అపోహలు, అపార్థాలు మరియు భ్రమలను దూరం చేసేందుకు తయారు చేయబడిన కార్యక్రమం ఇది. దీన్ అంటే అర్థం ఏమిటి అనే ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వబడింది. సృష్టికర్త వద్ద అంగీకరించబడే మానవజీవిత విధానం కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే.
2014-07-08
రమదాన్ రిమైండర్స్ అంటే రమదాన్ జ్ఞాపికలు అనే ఈ సీరీస్ రమదాన్ నెల యొక్క శుభాలు మరియు దానిలోని ఆచరణలు వివరించే ఒక సంక్షిప్త జ్ఞాపిక. అసలు రమదాన్ అంటే ఏమిటి, ఈ నెలలో మనం ఆచరణాత్మకంగా ఎలా జీవించాలి, ఈ నెల తర్వాత కూడా ఇంత మంచి జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనే అంశాలు ప్రస్తావించబడినాయి. ముస్లింల కొరకు ఇది ఒక ఆసక్తికరమైన సీరీస్.
2014-07-08
రమదాన్ రిమైండర్స్ అనే ఈ ఆసక్తికరమైన సీరీస్ లో షేఖ్ యాసిర్ ఖాదీ రమదాన్ నెల ప్రాధాన్యత, ఉపవాసాల ప్రయోజనాలు, రమదాన్ నెలలోని ఇతర కార్యక్రమాలు మరియు శుభాల గురించి చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరి కోసం చాలా ఆసక్తికరమైన మరియు ప్రయోజనకరమైన సీరీస్.
2014-07-08
రమదాన్ నెలలో డాక్టర్ జాకిర్ నాయక్ తో కొంత సమయం అనే టీవీ సీరీస్ లో, రమదాన్ నెల ప్రాధాన్యం, దానిలో వీలయినన్ని పుణ్యాలు సంపాదించుకోవటం కోసం మనం ఎలాంటి తయారీలు చేసుకోవాలి, ఈ నెలలో ఒక ముస్లిం ఏమి చేయాలి, ఈ పూర్తి నెల యొక్క శుభాలు మొదలైన విషయాలు ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్నాయి. ప్రతి ముస్లిం కోసం ఇది ఒక అద్భుతమైన సీరీస్.
2014-07-08
ఈ జుమా ఖుద్బాలో లైలతుల్ ఖద్ర్ అనబడే దివ్యమైన రాత్రి గురించి షేఖ్ యాసిర్ ఖాదీ వివరించారు. ఆ రాత్రి యొక్క ప్రాధాన్యత, దాని సూచనలు, రమదాన్ నెల చివరి పది రాత్రుల మహాశక్తి మరియు దీవెనలు. ఇంకా లైలతుల్ ఖదర్ యొక్క అర్థం, దాని ప్రతిఫలం మరియు దాని శుభాల గురించి కూడా వివరంగా చర్చించారు.
2014-07-08
కొత్త నెలవంక కనబడినప్పటి నుండి, రమదాన్ నెలను ఉత్తమరీతిలో సాగనంపే మరియు రమదాన్ నెల తర్వాత కూడా రమదాన్ నెలలోని ఉత్తమ జీవితాన్ని కొనసాగించే బాటలో సహాయపడే 10 ప్రాక్టికల్ కిటుకులను షేఖ్ యాసిర్ ఖాదీ ఇక్కడ ఇచ్చినారు. ఈ జుమా ఖుత్బలో 10 ఆచరణాత్మక కిటుకులు, జ్ఞాపికలు, ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకునే విధానం గురించి వివరంగా చర్చించారు.
2014-07-08
ఈ వీడియో భాగంలో షవ్వాల్ మాసపు ఆరు దినాల ఉపవాసం యొక్క ప్రాధాన్యత, దాని ఇస్లామీయ ధర్మాజ్ఞలు మరియు ప్రతిఫలం గురించి షేఖ్ యాసిర్ ఖాదీ వివరించారు.
Go to the Top