వీడియోల ప్రదర్శన ( 51 - 75 మొత్తం నుండి: 775 )
రమదాన్ - ఒక జీవన విధానం(ఇంగ్లీష్)
2014-08-10
రమదాన్ నెలలోని జీవన విధానం, సత్ ప్రవర్తన మరియు రమదాన్ నెలలో సంపాదించిన దైవభీతిని మిగిలిన సంవత్సరమంతా ఎలా కొనసాగించాలి అనే విషయాల గురించి ఇక్కడ చర్చించబడింది.
2014-08-10
ఈ ఉపన్యాసంలో షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తున్నారు.
ఇస్లాం ధర్మంలో జీసస్ అలైహిస్సలాం(ఇంగ్లీష్)
2014-08-10
షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ ఒక విశ్వవిద్యాలయంలో ఇస్లామీయ బోధనలలో జీసస్ అలైహిస్సలాం గురించి ఏమని ప్రస్తావించబడినదో చర్చించినారు.
శాంతి అన్వేషణలో(ఇంగ్లీష్)
2014-08-10
షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ ఇస్లాం గురించి అడగబడే తలతిక్క ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలో చర్చించినారు.
2014-08-10
ఒక కేథలిక్ మహిళ యూసుఫ్ ఎస్టేట్ తో "మీరెందుకు ఇస్లాం స్వీకరించారు?" అని ప్రశ్నించింది.
వివిధ ధర్మాల మధ్య బంధాలు నెలకొల్పడం(ఇంగ్లీష్)
2014-08-10
ఈ ఉపన్యాసంలో షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ వివిధ ధర్మాల మధ్య బంధాలు నెలకొల్పడం పై ప్రసంగించారు.
హిజాబ్ - ఒక ధార్మిక చిహ్నం(ఇంగ్లీష్)
2014-08-10
హిజాబ్ అనేది ఒక సాంప్రదాయక ఆచరణ లేద ఫ్యాషన్ పదం కాదు. అది సంరక్షణ మరియు దైవభీతి కొరకు మహిళలపై అల్లాహ్ తరుపున విధించబడిన తప్పనిసరి విధి. కార్యక్రమం చివరిలో ప్రజల ప్రశ్నలకు షేఖ్ జవాబు ఇచ్చినారు.
క్రైస్తవులు మరియు మొదటి కమాండ్మెంటు (ఇంగ్లీష్)
2014-08-10
ఈ వీడియోలో బైబిల్ లో ప్రస్తావించబడిన మొట్టమొదటి నిబంధన గురించి డాక్టర్ సరీహాన్ అష్షమరీ వివరించారు. ప్రస్తుత క్రైస్తవుల విశ్వాసంతో ఈ కమాండ్మెంటు విభేదిస్తున్న గంభీర విషయాన్ని ఆయన ధృవీకరించారు.
? ఏసు క్రీస్తు అసలు ఎప్పుడు జన్మించారు(ఇంగ్లీష్)
2014-08-10
ఏసు క్రీస్తు అసలు ఎప్పుడు జన్మించారు ? క్రిస్ట్ మస్ దినమైన డిసెంబరు 25వ తేదీనే జీసస్ జన్మించినారా ?
2014-08-10
మొత్తం మానవజాతి మార్గదర్శకత్వం కొరకు ఈ భూమిపై పంపబడిన అంతిమ సందేశం ఖుర్ఆన్ సత్యమైనది మరియు వాస్తవమైనదీను. ఖుర్ఆన్ అల్లాహ్ తరుఫు నుండి పంపబడిన ఒక అద్భుతం. కొందరు ప్రజలు లేవనెత్తుతున్న ఇస్లాం మరియు సైన్సుల మధ్య వ్యతిరేకత ఉందనే అపార్థాలను, అపనిందలను ఇది సరైన సాక్ష్యాధారాలతో ఖండిస్తున్నది.
అందుకనే నేను నాస్తికుడిని కాను (ఇంగ్లీష్)
2014-08-10
సర్వలోక సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు అయిన అల్లాహ్ యొక్క ఉనికిని ఈ వీడియో క్లిప్ నిరూపిస్తున్నది. నాస్తికులు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది.
మరియు ఆయన చెడ్డవాడని వారన్నారు (ఇంగ్లీష్)
2014-08-10
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రపై విశ్లేషాత్మకమైన మరియు హేతుబద్ధమైన ఒక చూపు.
ఇది కేవలం ఒక ధర్మం మాత్రమే కాదు(ఇంగ్లీష్)
2014-08-10
ఇస్లాం ధర్మం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబడింది. ఇతర ధర్మాల, సిద్ధాంతాల ప్రజలు ఇస్లాం ధర్మం గురించి తరుచుగా అడిగే అనేక ప్రశ్నలకు ఇది సమాధానం ఇస్తున్నది.
హుదాను అడగండి - 11 అక్టోబర్ 2011(ఇంగ్లీష్)
2014-08-09
ఈ భాగంలో డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ దర్శకుల వివిధ ప్రశ్నలకు జవాబులు ఇచ్చినారు.
హుదాను అడగండి - 15 జులై 2012(ఇంగ్లీష్)
2014-08-09
ఈ భాగంలో డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ దర్శకుల వివిధ ప్రశ్నలకు జవాబులు ఇచ్చినారు.
రమదాన్ మాసం - అతి గొప్ప అవకాశం(ఇంగ్లీష్)
2014-08-08
షేఖ్ మహ్మద్ మురాద్ ఇచ్చిన ఈ ఉపన్యాసం చాలా ఆసక్తికరమైనది. దీనిలో ఆయన రమదాన్ మాసం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించారు. రమదాన్ మాసంలోని సమయపాలన, అన్నపానీయాలలో హద్దుమీరి పోవటం, ఉపవాస సంకల్పం, ఉపవాస సమయంలో మరిచిపోయి ఏదైనా తినటం లేదా త్రాగటం, పగటి పూటంతా నిద్రపోతూ గడపడం మరియు పిల్లలను రమదాన్ మాస ఉపవాసాలు ఉండేట్లు శిక్షణ ఇవ్వడం. మొదలైన విషయాలు ఇందులో ఆయన చర్చించారు.
మాటల కంటే బిగ్గరగా ఆచరణలు పలుకుతాయి(ఇంగ్లీష్)
2014-08-08
ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ - మాటల కంటే బిగ్గరగా ఆచరణలు పలుకుతాయి - అనే అంశంపై చర్చిస్తూ, ఏదైనా మాట్లాడే ముందు మంచిగా ఆలోచించాలని సలహా ఇస్తున్నారు. .. తప్పకుండా దీనిని చూడండి.
నేటి ముస్లిం సమాజ దయనీయ స్థితి(ఇంగ్లీష్)
2014-08-08
ఈనాడు ముస్లిం సమాజం చాలా బలహీనంగా ఉన్నది. ఐకమత్యం లేదు. అన్ని వైపుల నుండి దాడులకు గురవుతున్నది. ఒకప్పుడు ఎంతో గొప్ప స్థితిలో ఉండి, ప్రపంచాన్ని శాసించిన ముస్లిం సమాజం, ఈనాడు ఇలాంటి దయనీయ పరిస్థితిలోనికి ఎందుకు దిగజారిపోయింది ? ఈ పరిస్థితిని మనం ఎలా సరిదిద్దగలం ? ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఈ విషయాలపై చర్చించినారు.
ముగ్గురు ప్రవక్తలు - సందేశం ఒక్కటే(ఇంగ్లీష్)
2014-08-08
ప్రపంచం వైపు పంపబడిన చివరి ముగ్గురు ప్రవక్తల గురించి ఈ ఉపన్యాసంలో చర్చించబడింది. వారు ముగ్గురు ఎవరు? వారి ముగ్గురు వేర్వేరు సందేశాలు ఇచ్చారా లేక ఒకే సందేశం ఇచ్చారా ? వారు ముగ్గురూ ఒకే ధర్మాన్ని బోధించారా లేక వేర్వేరు ధర్మాలనా ? ఈనాడు ప్రపంచంలో మూడు ప్రధాన ఏకదైవారాధన ధర్మాలున్నాయి - అవి ఇస్లాం, క్రైస్తవ మతం మరియు యూద మతం. ఇవి మూడూ తమ తమ ప్రవక్తలను, సందేశహరులను నమ్ముతాయి - వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త ఈసా అలైహిస్సలాం మరియు ప్రవక్త మూసా అలైహిస్సలాం. ఈ ఉపన్యాసంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా మనం దృష్టి సారిస్తున్నాము.
? ఇస్లాం ధర్మం స్త్రీలను అణిచి వేస్తున్నదా (ఇంగ్లీష్)
2014-08-07
అనేక మంది ప్రజల మనస్సులలో మరియు పలుకులలో మాటిమాటికీ వచ్చే "ఇస్లాం ధర్మం మహిళలను అణచి వేస్తున్నది" ఒక ముఖ్యమైన ప్రశ్నగురించి షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇక్కడ చర్చించినారు. వాస్తవానికి ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేయబడుతున్న ఒక అపనింద, ఒక అసత్య వాదన మరియు ఒక అభాండము. ఇది ఒక పచ్చి అబద్ధం మరియు అభాండమని గట్టిగా చెప్పడమే కాకుండా అసలు స్త్రీలను అణచి వేస్తున్న ప్రజలు, దేశాలు మరియు సిద్ధాంతాల గురించి ఆయన చక్కటి నిదర్శనాలతో చూపినారు. అసలు అణచివేత అంటే ఏమిటి, ఇస్లాం దాని గురించి ఏమి చెబుతున్నది అనేది కూడా వివరించారు. అభాండాలు వేయడంపై ఒక మంచి శిక్షణా వీడియో ఇది. దీనిని విన్న తర్వాత ఇతరులు అణచివేతగా భావిస్తున్న విషయాలలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్వేచ్ఛ గురించి ఆయన తెలిపినారు.
అపరిచితునికి శుభాకాంక్షలు తెలుపండి(ఇంగ్లీష్)
2014-08-07
ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ అపరిచితునికి శుభాకాంక్షలు తెలుపండి అనే హదీథు గురించి చక్కగా వివరించారు. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, "ఇస్లాం ధర్మం అపరిచితునిగా మొదలైంది మరియు చివరిలో అపరిచితునిగా మరిలి పోతుంది. కాబట్టి అపరిచితునికి శుభాకాంక్షలు తెలుపండి".
2014-08-07
ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ప్రజలలో అనేక మంది అపార్థం చేసుకుంటున్న ఇస్లాం ధర్మం గురించి చర్చించారు - అసలు అల్లాహ్ ఎవరు, ఇస్లాం ధర్మం అంటే ఏమిటి, ముహమ్మద్ ఎవరు ... మొదలైన విషయాలను ఆయన చాలా చక్కగా వివరించారు. ముగింపులో ఆయన శ్రోతల ప్రశ్నలకు జవాబు ఇచ్చినారు.
ఇస్లాం మరియు ప్రస్తుత సంక్షభం(ఇంగ్లీష్)
2014-08-07
ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు ఉన్న సంక్షోభ పరిస్థితి గురించి షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఈ ఉపన్యాసంలో చర్చించారు.
పాశ్చాత్య దేశాలలో జీవించడం(ఇంగ్లీష్)
2014-08-07
ఈ ఉపన్యాసంలో అబ్దుల్ రహీం గ్రీన్ పాశ్చాత్య దేశాలలో ఎలా జీవించాలనే అంశంపై చర్చించారు.
2014-08-07
మీ ధర్మప్రచార అమ్ముల పొదిలో చేరగలిగే అర్హత గల మరో మంచి బాణం. ముస్లిమేతరుల సమావేశంలో అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇస్లాం ధర్మంలోని సౌందర్యం మరియు అద్భుతాల గురించి చాలా చక్కగా వివరించారు.