వీడియోల ప్రదర్శన ( 126 - 150 మొత్తం నుండి: 775 )
2014-07-30
సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు మెదడు ఇచ్చినాడు - ఆలోచించడానికి మరియు దీర్ఘాలోచన చేయడానికి. దీని కోసం ఆయన తను సృష్టించిన అనేక గొప్ప సంపూర్ణమైన సృష్టితాల జ్ఞానాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. ఈ వీడియోలో మానవుడి సృష్టి మరియు ఖుర్ఆన్ లో దాని ప్రస్తావన గురించి చర్చించబడింది.
2014-07-30
సృష్టికర్త సవాలు చేసినట్లుగా తన అంతిమ దైవసందేశం అయిన ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి లోపాలకు, తప్పులకు తావు లేని దివ్యగ్రంథం. అనేకమంది ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రజ్ఞులు తాము ఖుర్ఆన్ లో గుర్తించిన అనేక ఆధునిక వైజ్ఞానిక వాస్తవాల గురించి ఇక్కడ ప్రస్తావించారు. నేటి ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో కనుగొన్ని అనేక విషయాలు 1400 సంవత్సరాలకు పూర్వమే ఖుర్ఆన్ లో ఎంతో ఖచ్చితంగా ప్రస్తావించబడటాన్ని వారు ఏక కంఠంతో ధృవీకరిస్తున్నారు.
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ హృదయంపై షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైయిమియహ్ యొక్క వ్యాసం గురించి వివరంగా చర్చించారు.
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ హృదయంపై షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైయిమియహ్ యొక్క వ్యాసం గురించి వివరంగా చర్చించారు.
2014-07-27
ఈ మొదటి ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ హృదయంపై షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైయిమియహ్ యొక్క వ్యాసం గురించి వివరంగా చర్చించారు.
2014-07-27
ఈ సంక్షిప్త ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ సృష్టికర్త స్వయంగా సృష్టిలోని భాగంగా మారినాడా, ఆయన సృష్టితాలే ఆయనలోని భాగంగా మారినాయా అనే అంశాలపై చర్చించినారు. ఇదొక గొప్ప ఉపన్యాసం. వివిధ ధర్మాల ప్రజలకు ఇస్లాం ధర్మం గురించి తెలియజేసే ఒక మంచి ధర్మప్రచార ప్రసంగం.
2014-07-27
ఈ ఖుత్బా ప్రసంగంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ రమదాన్ పవిత్ర మాసానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించారు. ఈ పవిత్ర మాసంలో ప్రోత్సహించబడిన ఆచరణలు, ఉపవాస వ్రతాన్ని భగ్నం చేసే లేదా హాని కలిగించే విషయాల నుండి దూరంగా ఉండటం ...
2014-07-27
ఈ సంక్షిప్త ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన వేడుకలు ఎందుకు జరుపుకో కూడదో చర్చించారు. ఈ అంశం గురించి ఆయన పూర్తి సమాచారం ఇక్కడ ఇస్తున్నారు.
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రతి ఒక్కరికీ సంబంధించిన అతి ముఖ్యమైన విషయం గురించి చర్చించారు. నవముస్లిం కోసం పూర్తి సమాచారంతో నిండిన వివరణాత్మక మార్గదర్శిని. ఇస్లాం ధర్మం మరిుయ దైవవిశ్వాసం యొక్క మూలస్థంభాలు, ఇస్లాం ధర్మంలో వివిధ ధర్మాదేశాల గురించి వివరంగా చర్చించబడింది.
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ షరిఅహ్ అనబడే ఇస్లామీయ ధర్మ శాసనం మరియు దాని యొక్క న్యాయావలోకనము, ధార్మికత, పునరుద్ధరణ, ప్రజాస్వామ్యం మొదలైన విషయాల గురించి చర్చించారు.
2014-07-27
ఈ ఉఫన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ఇస్లాం దృష్టిలో జ్ఞానం సంపాదించుట యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ పంపిన మొట్టమొదటి మార్గదర్శకత్వం నమాజు, హజ్ యాత్ర మొదలైన ఆరాధనల గురించి కాదు, అది ఇఖ్రా అంటే 'చదువు, పఠించు, ప్రకటించు' అనే ఆదేశం.
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఆలోచించే అతి ముఖ్యమైన అంశంపై ప్రసంగించారు. దీనిలోని ప్రతి విషయం గురించి మనమందరమూ సరైన జ్ఞానం కలిగి ఉండటం తప్పనిసరి. వివాహబంధంలోని శుభాలు మరియు ప్రయోజనాలు, దానిని ఆలస్యం చేయడం వలన కలిగే అనర్థాల గురించి ఆయన వివరించారు. చివరిగా ఆయన సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న బాయ్ ఫ్రెండ్ మరియు గర్ల్ ఫ్రెండ్ తప్పుడు సంబంధాల్ని గురించి చర్చించారు.
2014-07-26
నిజమైన, నిజాయితీపరుడైన మరియు స్వచ్ఛమైన ముస్లిం గురించి షేఖ్ బిలాల్ అసద్ వివరిస్తున్న చాలా ముఖ్యమైన ఉపన్యాసం. ప్రతి ముస్లిం తప్పకుండా నిజమైన ముస్లింగా మారాలి. నిజమైన, ప్రామాణిక ఇస్లామీయ బోధనలను మాత్రమే అనుసరించమని ఇస్లాం ధర్మం మనల్ని ఆదేశిస్తున్నది.
2014-07-26
తమ కోరికల నుండి ఉపవాసం పాటించడం అనే ఈ ఉపన్యాసం చాలా ఆసక్తికరమైనది. ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఉపవాసం యొక్క ప్రయోజనాలు, ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో కోరికలు మరియు ఉపవాసాల మధ్య సంబంధం
2014-07-26
తల్లిదండ్రుల హక్కులు మరియు బాధ్యత గురించి వివరించే ఒక గొప్చప మరియు ముఖ్యమైన ఉపన్యాసం. వయసు మళ్ళిన వారితో మనం ఎంత ఉత్తమంగా ప్రవర్తించాలో ఇది తెలుపుతున్నది. మన తల్లిదండ్రులకు విధేయత చూపటం మరియు స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నించడం ప్రతి ముస్లిం తప్పనిసరిగా చేయవలసిన పనులు. ఈ బంధుత్వాలు పరస్పరం ప్రేమానురాగాలు ఇచ్చిపుచ్చుకునే అన్యోన్య బంధుత్వాలు. ఒకవైపు వారి బాధ్యతలే మరో వైపు వారి హక్కులవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు - సంతానం సంబంధంలో తల్లిదండ్రుల హక్కులు పిల్లల బాధ్యత, కర్తవ్యాలుగా మారతాయి అలాగే పిల్లల హక్కులు తల్లిదండ్రుల కర్తవ్యాలుగా మారతాయి.
2014-07-26
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దయాగుణాన్ని వివరించే గొప్ప చర్చ. ఆయన దయాగుణంలో మానవులందరినీ అధిగమించారు. అదే సమయంలో ఆయన ధైర్యం మరియు సాహసం చూపడంలో కూడా. ఆయన అత్యంత దయార్ద్రహృదయుడు మరియు మానవుల ఏ కొద్ది అమానషత్వం ఆయన దృష్టిలో పడినా, వెంటనే ఆయన కళ్ళు నీళ్ళతో నిండిపోయేవి.
2014-07-26
షేఖ్ బిలాల్ అసద్ ఇచ్చిన ఒక గొప్ప ప్రసంగం. సహనం యొక్క ప్రాధాన్యత మరియు దాని వాస్తవికత, వేర్వేరు రకాలు మరియు స్థాయిల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చక్కగా వివరించారు. చాలా ఆసక్తికరమైన చర్చ.
2014-07-26
ఈ ఉపన్యాసంలో ప్రాణాలు తీసే దైవదూత మలకుల్ మౌత్ గురించి షేఖ్ ఉమర్ చర్చించారు. ఇది మరణాన్ని గుర్తుకు తెస్తుంది మరియు దాని కోసం మనం ఎలా తయారు కావాలో తెలుపుతున్నది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.
2014-07-26
ఈ ఉపన్యాసంలో అంతిమ సందేశం యొక్క ప్రాధాన్యత, మన జీవితంలో మనం విధిగా, తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏమిటి, ఈ సందేశాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టగలం మరియు దీనిని ఇతరులకు ఎలా అందజేయగలం అనే ముఖ్య విషయాల గురించి షేఖ్ బిలాల్ అసద్ చర్చించారు.
2014-07-26
ఈ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన కొన్ని మహిమల గురించి షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ చర్చించారు. ఉదాహరణకు - ఖుర్ఆన్, చంద్రుడు రెండుగా చీలిపోవటం, మక్కా నుండి జెరుసలెంకు మరియు జెరుసలెం నుండి స్వర్గాలకు సాగిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దివ్యప్రయాణం మరియు ఇతర మహిమలు.
2014-07-26
ఈ ఉపన్యాసంలో షేఖ్ ఉమర్ స్వర్గానికి దారి అనే అంశంపై చర్చించారు. ఇది స్వర్గానికి చేర్చే మార్గాన్ని మనకు గుర్తు చేస్తున్నది. ఒకవేళ ప్రజలు ఈ మార్గాన్ని అనుసరిస్తే అల్లాహ్ అనుజ్ఞతో వారు విజయవంతంగా స్వర్గానికి చేరుకోగలరు.
2014-07-26
పశ్చాత్తాపం పై ఇదొక ముఖ్యమైన చర్చ. దీనిలో షేఖ్ ఉమర్ పశ్చాత్తాపం యొక్క ప్రాధాన్యత, దాని షరతులు, ప్రాక్టికల్ పద్ధతులు మరియు దానికి సంబంధించిన వివిధ నియమనిబంధనలు. తప్పకుండా చూడవలసిన చర్చ.
2014-07-19
అంతిమ తీర్పుదినం నాడు ఏమి జరగబోతున్నది అనే ముఖ్యఅంశాన్ని షేఖ్ ఉమర్ సులైమాన్ చక్కగా వివరించారు.
2014-07-19
ఈ వీడియోలో ఇస్లాం అనే పదం యొక్క అర్థాన్ని షేక్ యూసుఫ్ ఎస్టేట్ చక్కగా వివరించారు.
2014-07-19
ఈ వీడియోలో మొత్తం ధర్మాలు, మతాలన్నీ ఒక్కటే అని వాదించడం ఎందుకు సబబు కాదు అనే ముఖ్యవిషయం గురించి డాక్టర్ జాకిర్ నాయక్ వివరించారు.
Go to the Top