వీడియోల ప్రదర్శన ( 76 - 100 మొత్తం నుండి: 689 )
దైవవిశ్వాసం మరియు వివేకం - 14
2014-08-05
ఇది షేఖ్ మోతశిమ్ అల్ హమీదీ నుండి వెలువడిన ఒక మంచి సీరీస్. దీనిలో ఆయన సర్వలోక సృష్టికర్త మరియు ప్రభువు అయిన అల్లాహ్ ను గురించి మరియు ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలు అర్థం చేసుకోవడం కోసం మన వివేకం, తెలివితేటలను ఉపయోగించ వలసిన ఆవశ్యకతను గురించి ఆయన వివరించారు.
దైవవిశ్వాసం మరియు వివేకం - 15
2014-08-05
ఇది షేఖ్ మోతశిమ్ అల్ హమీదీ నుండి వెలువడిన ఒక మంచి సీరీస్. దీనిలో ఆయన సర్వలోక సృష్టికర్త మరియు ప్రభువు అయిన అల్లాహ్ ను గురించి మరియు ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలు అర్థం చేసుకోవడం కోసం మన వివేకం, తెలివితేటలను ఉపయోగించ వలసిన ఆవశ్యకతను గురించి ఆయన వివరించారు.
నిశ్చయంగా ఆచరణల ప్రతిఫలం సంకల్పంపై ఆధారపడి ఉంటుంది
2014-08-05
ఈ ఉపన్యాసంలో షేఖ్ మోతశిమ్ అల్ హమీదీ "నిశ్చయంగా ఆచరణల ప్రతిఫలం సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తికి తను సంకల్పించిందే లభిస్తుంది. కాబట్టి ఎవరి వలసైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం సంకల్పించుకున్నదో, అతడి వలస అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం పరిగణించబడుతుంది. అలాగే ఎవరి వలసైతే ప్రాపంచిక ప్రయోజనాల కోసం లేదా ఎవరైనా మహిళను వివాహమాడాలని సంకల్పించుకున్నదో, అతడి వలస దాని కోసమే పరిగణించబడుతుంది" అనే హదీథు గురించి వివరించారు. ఈ హదీథుకు సంబంధించిన కొన్ని మంచి ఉదాహరణలు ఆయన పేర్కొన్నారు.
అంతిమ తీర్పుదినం కోసం తయారీ
2014-08-05
ఈ ఉపన్యాసంలో అంతిమ తీర్పుదినం కోసం మనం ఎలా తయారు కావాలి అనే విషయం గురించి షేఖ్ మోతశిమ్ అల్ హమీదీ చర్చించారు. "మా కోసం గట్టిగా శ్రమించిన వారికి మేము తప్పకుండా సన్మార్గం చూపుతాము" అనే అల్లాహ్ పలుకులతో ఆయన ఈ ఉపన్యాసాన్ని ప్రారంభించారు.
నమాజులలోని తీపిదనం
2014-08-05
ఈ ఉపన్యాసంలో షేఖ్ ముతశిమ్ అల్ హమీదీ నమాజులలోని తీపిదనం మరియు ఆ తీపిదనాన్ని, మాధుర్యాన్ని మనం ఎలా పొందగలం, దానికి సంబంధించిన మరికొన్ని విషయాల గురించి చర్చించారు.
చారిత్రక జీసస్
2014-07-30
ఈ ఉపన్యాసంలో ఖాలిద్ యాసిన్ చారిత్రక జీసస్ మరియు నిజమైన జీసస్ అలైహిస్సలాం ల గురించి చక్కగా వివరించారు.
ఎలా మనశ్శాంతి పొందాలి
2014-07-30
మన జీవితం కొరకు మనశ్శాంతి చాలా అవసరం. నిజమైన మనశ్శాంతి కేవలం అల్లాహ్ ను విశ్వసించడంలోనే లభిస్తుంది. యాసిర్ ఖాదీ దీనిని చాలా చక్కగా వివరించారు.
ఇస్లాం ధర్మంలోని ఆణిముత్యాలు - శాంతి
2014-07-30
ఇస్లాం ధర్మ ఆణిముత్యాలలోని ఒక ఆణిముత్యమైన శాంతి గురించి యూసుఫ్ ఎస్టేట్ చక్కగా వివరించారు.
మీరు కృతజ్ఞత చూపుతున్నారా
2014-07-30
మనం ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలో ఒమర్ సులైమాన్ ఇక్కడ వివరిస్తున్నారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సూర్యగ్రహణం
2014-07-30
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుమారుడు ఇబ్రాహీమ్ రదియల్లాహు అన్హు చనిపోయిన రోజున సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఇది చూసి ప్రజలు ఆ పసిబాలుడి మరణమే దానికి కారణమని చెప్పుకోసాగారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం "సూర్యూడు, చంద్రుడు అల్లాహ్ యొక్క సూచనలలోని కొన్ని సూచనలనీ, ఒకరి చావుబ్రతుకులు వాటిని ప్రభావితం చేయవనీ, ఒకవేళ ఎవరైనా సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణం చూస్తే, వెంటనే నమాజు చేసి, అల్లాహ్ వద్ద శరణు వేడుకోవాలని" బోధించారు.
సంతోషాన్ని  ఎలా పొందాలి
2014-07-30
సంతోషాన్ని ఎలా పొందాలి అనే అంశాన్ని అబ్దుర్ రహీమ్ గ్రీన్ చాలా చక్కగా వివరించారు.
ధర్మప్రచారంలో ఎలాంటి ఎదురు దాడినైనా ఎదుర్కొనే 50 టిప్స్
2014-07-30
ధర్మప్రచారంలో మనకు వేర్వేరు మనస్తత్వాల ప్రజలు ఎదురు అవుతారనే విషయం మనం గుర్తించాలి. అయినా వారిని ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానించేందుకు మనం తప్పక ఆసక్తి చూపాలి.
ఇస్లాం ధర్మంలోని శాంతి సామరస్యాలు
2014-07-30
సామాజిక శాంతి సామరస్యాలు సాంఘిక అరాచకాలు, హింసలను అరికడతాయి. అలాగే మనశ్శాంతి మనలో చెలరేగే అలజడి, ఒత్తిళ్ళ నుండి మనల్ని కాపాడుతుంది. ఇస్లాం ధర్మంలో సామాజిక మరియు వ్యక్తిగత శాంతి సామరస్యాలు ఎలా స్థాపించాలో స్పష్టంగా వివరించబడింది. ఈ వీడియోలో యాసిర్ ఖాదీ ఇస్లాం ధర్మంలో శాంతి సామరస్యాల భావనను చక్కగా వివరించారు.
ఖుర్ఆన్ లోని వైజ్ఞానిక మహిమలు - పిండోత్పత్తి
2014-07-30
సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు మెదడు ఇచ్చినాడు - ఆలోచించడానికి మరియు దీర్ఘాలోచన చేయడానికి. దీని కోసం ఆయన తను సృష్టించిన అనేక గొప్ప సంపూర్ణమైన సృష్టితాల జ్ఞానాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. ఈ వీడియోలో మానవుడి సృష్టి మరియు ఖుర్ఆన్ లో దాని ప్రస్తావన గురించి చర్చించబడింది.
ఖుర్ఆన్ మరియు సైన్సు
2014-07-30
సృష్టికర్త సవాలు చేసినట్లుగా తన అంతిమ దైవసందేశం అయిన ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి లోపాలకు, తప్పులకు తావు లేని దివ్యగ్రంథం. అనేకమంది ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రజ్ఞులు తాము ఖుర్ఆన్ లో గుర్తించిన అనేక ఆధునిక వైజ్ఞానిక వాస్తవాల గురించి ఇక్కడ ప్రస్తావించారు. నేటి ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో కనుగొన్ని అనేక విషయాలు 1400 సంవత్సరాలకు పూర్వమే ఖుర్ఆన్ లో ఎంతో ఖచ్చితంగా ప్రస్తావించబడటాన్ని వారు ఏక కంఠంతో ధృవీకరిస్తున్నారు.
హృదయం పై షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైయిమియహ్ యొక్క వ్యాసం - 3వ భాగం
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ హృదయంపై షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైయిమియహ్ యొక్క వ్యాసం గురించి వివరంగా చర్చించారు.
హృదయం పై షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైయిమియహ్ యొక్క వ్యాసం - 2వ భాగం
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ హృదయంపై షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైయిమియహ్ యొక్క వ్యాసం గురించి వివరంగా చర్చించారు.
హృదయం పై షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైయిమియహ్ యొక్క వ్యాసం - 1వ భాగం
2014-07-27
ఈ మొదటి ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ హృదయంపై షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైయిమియహ్ యొక్క వ్యాసం గురించి వివరంగా చర్చించారు.
? దేవుడే మానవుడిగా మారినాడా
2014-07-27
ఈ సంక్షిప్త ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ సృష్టికర్త స్వయంగా సృష్టిలోని భాగంగా మారినాడా, ఆయన సృష్టితాలే ఆయనలోని భాగంగా మారినాయా అనే అంశాలపై చర్చించినారు. ఇదొక గొప్ప ఉపన్యాసం. వివిధ ధర్మాల ప్రజలకు ఇస్లాం ధర్మం గురించి తెలియజేసే ఒక మంచి ధర్మప్రచార ప్రసంగం.
రమదాన్ పవిత్ర మాసం యొక్క ఆత్మ
2014-07-27
ఈ ఖుత్బా ప్రసంగంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ రమదాన్ పవిత్ర మాసానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించారు. ఈ పవిత్ర మాసంలో ప్రోత్సహించబడిన ఆచరణలు, ఉపవాస వ్రతాన్ని భగ్నం చేసే లేదా హాని కలిగించే విషయాల నుండి దూరంగా ఉండటం ...
మీలాదున్నబీ వేడుకలు చేయవద్దు
2014-07-27
ఈ సంక్షిప్త ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన వేడుకలు ఎందుకు జరుపుకో కూడదో చర్చించారు. ఈ అంశం గురించి ఆయన పూర్తి సమాచారం ఇక్కడ ఇస్తున్నారు.
మంచి ముస్లింగా ఎలా మారాలి
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రతి ఒక్కరికీ సంబంధించిన అతి ముఖ్యమైన విషయం గురించి చర్చించారు. నవముస్లిం కోసం పూర్తి సమాచారంతో నిండిన వివరణాత్మక మార్గదర్శిని. ఇస్లాం ధర్మం మరిుయ దైవవిశ్వాసం యొక్క మూలస్థంభాలు, ఇస్లాం ధర్మంలో వివిధ ధర్మాదేశాల గురించి వివరంగా చర్చించబడింది.
ఇస్లామీయ ధర్మశాసనం మరియు దాని న్యాయావలోకనం
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ షరిఅహ్ అనబడే ఇస్లామీయ ధర్మ శాసనం మరియు దాని యొక్క న్యాయావలోకనము, ధార్మికత, పునరుద్ధరణ, ప్రజాస్వామ్యం మొదలైన విషయాల గురించి చర్చించారు.
జ్ఞానం సంపాదించుట
2014-07-27
ఈ ఉఫన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ఇస్లాం దృష్టిలో జ్ఞానం సంపాదించుట యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ పంపిన మొట్టమొదటి మార్గదర్శకత్వం నమాజు, హజ్ యాత్ర మొదలైన ఆరాధనల గురించి కాదు, అది ఇఖ్రా అంటే 'చదువు, పఠించు, ప్రకటించు' అనే ఆదేశం.
ఇస్లాం ధర్మంలో వివాహబంధం
2014-07-27
ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఆలోచించే అతి ముఖ్యమైన అంశంపై ప్రసంగించారు. దీనిలోని ప్రతి విషయం గురించి మనమందరమూ సరైన జ్ఞానం కలిగి ఉండటం తప్పనిసరి. వివాహబంధంలోని శుభాలు మరియు ప్రయోజనాలు, దానిని ఆలస్యం చేయడం వలన కలిగే అనర్థాల గురించి ఆయన వివరించారు. చివరిగా ఆయన సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న బాయ్ ఫ్రెండ్ మరియు గర్ల్ ఫ్రెండ్ తప్పుడు సంబంధాల్ని గురించి చర్చించారు.
Go to the Top