వీడియోల ప్రదర్శన ( 1 - 25 మొత్తం నుండి: 689 )
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వివేకవంతుల ధృవీకరణ
2015-04-16
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ది గ్లోబల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ది ప్రాఫెట్ ఆప్ మెర్సీ అందజేసిన ఒక మంచి పుస్తకం. ఇందులో సుప్రసిద్ధ వ్యక్తులు ఆయన గురించి ధృవీకరించిన అనేక అంశాలు ప్రస్తావించబడినాయి. ఉదాహరణకు మైకెల్ హార్ట్, జార్జ్ బెర్నార్డ్ షా, మహాత్మా గాంధీ, గుస్తవ్ లి బోన్, లియో టాల్ స్టాయ్, వోల్ఫ్ గాంగ్ గోయిథ్...
ఇస్లాం ధర్మం - నాలుగు రోడ్ల కూడలిలో
2014-10-05
ఇస్లాం ధర్మం - నాలుగు రోడ్ల కూడలిలో అనే ఈ అంశంలో షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ మంచి వ్యక్తులకు ఎందుకు చెడు జరుగుతుందనే విషయాన్ని గురించి చర్చించారు.
ఇస్లాం పదం యొక్క అర్థం
2014-10-05
అసలు స్వేచ్ఛ, స్వతంత్రం అంటే ఏమిటి, మనం బానిసలుగా మారిపోయామా, ఇస్లాం అంటే ఏమిటి, ఆధునిక కాలపు సవాళ్ళు వాటి ఇస్లాం ధర్మ పరిష్కారాలు - ఇంకా ఎన్నో విషయాలు షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ తో
? అసలు ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏమిటి
2014-10-05
దీనిలో షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ అసలు ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే ముఖ్యాంశాన్ని అల్లాహ్ కు సమర్పించుకున్న మానవ జీవిత విధానం ద్వారా వివరించారు.
హుదాను అడగండి - 6 ఫిబ్రవరీ 2012
2014-08-23
ఈ భాగంలో డాక్టర్ హాతిమ్ అల్ హజ్ శ్రోతల ప్రశ్నలకు జవాబిచ్చారు.
ఫిఖ్ పరిణామ క్రమం
2014-08-23
ఇది ఒక ముఖ్యమైన సిరీస్. చరిత్రలో ఫిఖ్ అంటే ఇస్లామీయ చట్టం ఎలా క్రమ క్రమంగా అభివృద్ధి చెందిందో తెలుపుతున్నది. దీనిలో క్రింది విషయాలు చర్చించబడినాయి. ఫిఖ్ యొక్క ప్రాధాన్యత మరియు దాని మూలాలు, వివిధ ఫిఖ్ పాఠశాలలు, ఇమాములు మరియు వారి గురువులు, నలుగురు ఇమాముల జీవిత చరిత్ర, వారి ప్రసిద్ధ శిష్యులు, మద్హబ్ విషయంలో మా అభిప్రాయం, మధ్యమార్గంలో ఎలా ఉండాలి, ఇస్లామీయ చట్టం యొక్క ప్రాథమిక నియమ నిబంధనలు, ధర్మాదేశాల వర్గీకరణ, ఫిఖ్ లోని వివిధ ధర్మాదేశాల మూలాలు, సున్నతు యొక్క వర్గీకరణ, సున్నతు సంరక్షణ, సున్నతు మరియు మోడరనిజం, సున్నతుల మరియు బిదఅ (నూతన కత్పితాలు), మద్హబుల మధ్య భేదాభిప్రాయాలు, మద్హబుల మధ్య భేదాభిప్రాయాలకు కారణాలు, మద్హబుల మధ్య భేదాభిప్రాయాలపై మా అభిప్రాయం మరియు చివరిగా ఈ సిరీస్ ముగింపు పలుకులు.
5 నిమిషాల కంటే తక్కువ సమయం - 1వ భాగం - ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అవమానించడం
2014-08-23
ఈ సంక్షిప్త వీడియో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అవమానించకూడదని ముస్లిమేతరులకు తెలుపుతున్నది. ఒకవేళ అలా అవమానిస్తే, వారు ఎదుర్కోబోయే అంతిమ ఫలితం ఎలా ఉంటుందో వారికి వివరిస్తున్నది.
నెపోలియన్ (టోపాక్ ఔట్లేజ్) ఇస్లాం ధర్మాన్ని స్వీకరించుట
2014-08-23
ఈ సంక్షిప్త ప్రసంగంలో, సోదరుడు ముతహ్ బయిలె (నెపోలియన్) ఇస్లాం ధర్మంలో ప్రవేశించక ముందు తన జీవితం ఎలా ఉండేదో మరియు ఇస్లాం ధర్మం స్వీకరించేందుకు ప్రోత్సహించిన విషయమేమిటో వివరించారు. ఎవరైనా ఇస్లాం స్వీకరించేందుకు ఆవశ్యకమైన సమాచారం ఇందులో ఉన్నది.
ప్రవక్త జీసస్ పై విశ్వాసం
2014-08-23
ఈ సంక్షిప్త వీడియోలో, డాక్టర్ సెరెహాన్ అష్షమరీ ఇస్లాం ధర్మంలో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం యొక్క గౌరవస్థానం గురించి చర్చించారు.
మన జీవితంలోని సత్యం
2014-08-23
ఈ సంక్షిప్త వీడియోలో, సోదరుడు జైన్ అద్దీన్ జాన్సన్ మన జీవితంలోని సత్యం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితచరిత్రలో నుండి మరియు ఆయన పలుకుల నుండి సత్యం యొక్క గౌరవస్థానాన్ని ఆయన చూపుతున్నారు.
? సృష్టికర్త ఎవరు
2014-08-22
సృష్టికర్త మరియు విశ్వప్రపంచ విషయాలను చక్కగా ఏర్పాటు చేయడంలోని ఆయన గొప్పదనం గురించి మానవుడి దృక్పథం మనిషి మనిషికీ వేర్వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అనుదినం ఆయన యొక్క లెక్కలేనన్ని అనుగ్రహాల నుండి ప్రయోజనం పొందుతూ ఉంటారు. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉన్నాడనే విషయం అనేక మంది ప్రజలకు తెలుసు. వారిలో కొందరు ఆయనను విశ్వసిస్తారు మరియు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇతరులు ఆయనను విశ్వసించరు మరియు ఆయన ఆనుగ్రహాలను తిరస్కరిస్తారు. మరి మీరు ఈ రెండింటిలో ఏ కోవకు చెందుతారు ?
రమదాన్ పవిత్ర మాస శుభాలు
2014-08-10
ఒకరి దైవ విశ్వాసాన్ని ఈ పవిత్ర మాసంలో ఎలా పెంచుకోవచ్చో ఇక్కడ చర్చించబడింది.
రమదాన్ పవిత్ర మాసంలో ముస్లింలు
2014-08-10
రమదాన్ పవిత్ర మాసం కొందరు ముస్లింల కొరకు ఎలా సీజనల్ ఆరాధనల మాసంగా మారిందో షేఖ్ ఇక్కడ చర్చించారు.
రమదాన్ - ఒక జీవన విధానం
2014-08-10
రమదాన్ నెలలోని జీవన విధానం, సత్ ప్రవర్తన మరియు రమదాన్ నెలలో సంపాదించిన దైవభీతిని మిగిలిన సంవత్సరమంతా ఎలా కొనసాగించాలి అనే విషయాల గురించి ఇక్కడ చర్చించబడింది.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పూర్తి సమాచారం
2014-08-10
ఈ ఉపన్యాసంలో షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తున్నారు.
ఇస్లాం ధర్మంలో జీసస్ అలైహిస్సలాం
2014-08-10
షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ ఒక విశ్వవిద్యాలయంలో ఇస్లామీయ బోధనలలో జీసస్ అలైహిస్సలాం గురించి ఏమని ప్రస్తావించబడినదో చర్చించినారు.
శాంతి అన్వేషణలో
2014-08-10
షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ ఇస్లాం గురించి అడగబడే తలతిక్క ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలో చర్చించినారు.
మీరెందుకు ఇస్లాం స్వీకరించారని ఒక కేథలిక్ మహిళ యూసుఫ్ ఎస్టేట్ ను ప్రశ్నించింది
2014-08-10
ఒక కేథలిక్ మహిళ యూసుఫ్ ఎస్టేట్ తో "మీరెందుకు ఇస్లాం స్వీకరించారు?" అని ప్రశ్నించింది.
వివిధ ధర్మాల మధ్య బంధాలు నెలకొల్పడం
2014-08-10
ఈ ఉపన్యాసంలో షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ వివిధ ధర్మాల మధ్య బంధాలు నెలకొల్పడం పై ప్రసంగించారు.
హిజాబ్ - ఒక ధార్మిక చిహ్నం
2014-08-10
హిజాబ్ అనేది ఒక సాంప్రదాయక ఆచరణ లేద ఫ్యాషన్ పదం కాదు. అది సంరక్షణ మరియు దైవభీతి కొరకు మహిళలపై అల్లాహ్ తరుపున విధించబడిన తప్పనిసరి విధి. కార్యక్రమం చివరిలో ప్రజల ప్రశ్నలకు షేఖ్ జవాబు ఇచ్చినారు.
క్రైస్తవులు మరియు మొదటి కమాండ్మెంటు
2014-08-10
ఈ వీడియోలో బైబిల్ లో ప్రస్తావించబడిన మొట్టమొదటి నిబంధన గురించి డాక్టర్ సరీహాన్ అష్షమరీ వివరించారు. ప్రస్తుత క్రైస్తవుల విశ్వాసంతో ఈ కమాండ్మెంటు విభేదిస్తున్న గంభీర విషయాన్ని ఆయన ధృవీకరించారు.
? ఏసు క్రీస్తు అసలు ఎప్పుడు జన్మించారు
2014-08-10
ఏసు క్రీస్తు అసలు ఎప్పుడు జన్మించారు ? క్రిస్ట్ మస్ దినమైన డిసెంబరు 25వ తేదీనే జీసస్ జన్మించినారా ?
? మీరు ఇలాంటి  ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని ఇంతకు ముందెన్నడైనా చూసినారా
2014-08-10
మొత్తం మానవజాతి మార్గదర్శకత్వం కొరకు ఈ భూమిపై పంపబడిన అంతిమ సందేశం ఖుర్ఆన్ సత్యమైనది మరియు వాస్తవమైనదీను. ఖుర్ఆన్ అల్లాహ్ తరుఫు నుండి పంపబడిన ఒక అద్భుతం. కొందరు ప్రజలు లేవనెత్తుతున్న ఇస్లాం మరియు సైన్సుల మధ్య వ్యతిరేకత ఉందనే అపార్థాలను, అపనిందలను ఇది సరైన సాక్ష్యాధారాలతో ఖండిస్తున్నది.
అందుకనే నేను నాస్తికుడిని కాను
2014-08-10
సర్వలోక సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు అయిన అల్లాహ్ యొక్క ఉనికిని ఈ వీడియో క్లిప్ నిరూపిస్తున్నది. నాస్తికులు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది.
మరియు ఆయన చెడ్డవాడని వారన్నారు
2014-08-10
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రపై విశ్లేషాత్మకమైన మరియు హేతుబద్ధమైన ఒక చూపు.
Go to the Top