పోష్టర్లపై పునర్విమర్శ ( 1 - 25 మొత్తం నుండి: 77 )
ఒక ఉల్లాసవంతమైన దినం
(ఇంగ్లీష్)
2014-08-22
మీ మొదటి పండుగ దినాన్ని ఉత్తమదినంగా చేసే మార్గదర్శిని: నవముస్లింలారా, మీ మొదటి పండుగ దినాన్ని మరిచిపోలేని ఉల్లాసవంతమైన దినంగా, అల్లాహ్ యొక్క దీవెనలు నిండిన దినంగా జరుపుకోండి. ఎలాగైతే అల్లాహ్ యొక్క మెప్పు సంపాదించాలనే లక్ష్యంతో రమదాన్ నెల మొత్తం మీరు మొదటిసారి ఉపవాసం ఉండటమనేది మీరు సాధించిన ఒక గొప్ప విజయం. బాధాకరమైన విషయం ఏమిటంటే అనేక మంది నవ ముస్లింలు పండుగ రోజున నిరాశ, నిస్పృహలో పడి ఉంటారు. పండుగ రోజున ఏమి చేయాలో మరియు పండుగ రోజున వీలయినంత ఎక్కువగా ప్రయోజనం పొందటానికి ఎలా ప్రయత్నించాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. అల్హందులిల్లాహ్ నిజంగా పండుగ రోజు ఒక సంతోషకరమైన రోజు. మీ మొదటి పండుగరోజు ఆనందదాయకంగా, ఉల్లాసవంతంగా జరుపుకోవడానికి మా ఉచిత మార్గదర్శినిని డౌన్లోడు చేసుకోండి.
లైలతుల్ ఖదర్
(ఇంగ్లీష్)
2014-08-08
ఈ పోస్టర్ లో ఖుర్ఆన్ లోని అల్లాహ్ యొక్క వచనం, "లైలతుల్ ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది" గురించి వివరించబడింది.
హజ్ యాత్రికుల మార్గదర్శిని
(ఇంగ్లీష్)
2014-08-08
ఈ పోస్టర్ లో హజ్ యాత్రకు సంబంధించిన ఆరాధనలు, ఆచరణల సంక్షిప్త సారాంశం. దీని ద్వారా హజ్ యాత్రికుడు సులభమైన పద్ధతిలో హజ్ యాత్రలో ఆచరించవలసిన వివిధ అంశాల గురించి తెలుసుకోగలడు.
ఫర్ద్ నమాజుల తర్వాత అల్లాహ్ యొక్క ధ్యానం చేయడం
(ఇంగ్లీష్)
2014-08-08
ఈ పోస్టర్ లో ఫర్ద్ నమాజుల తర్వాత సులభ పద్ధతిలో అల్లాహ్ యొక్క ధ్యానం అంటే దిక్ర్ చేయడంలోని శుభాల గురించి తెలుపబడింది.
వాలెంటీన్ దినం
(ఇంగ్లీష్)
2014-08-08
వాలెంటీన్ దినం గురించి ఇస్లామీయ ధర్మాదేశం ఏమిటి అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ ఇబ్నె సాలెహ్ అల్ ఉతైమీన్ ఇచ్చిన జవాబు.
ఉపవాసం వచనాలు
(ఇంగ్లీష్)
2014-08-08
ఈ పోస్టర్ లో ఉపవాసం గురించి అల్లాహ్ యొక్క ఆదేశం పేర్కొనబడింది, "ఓ విశ్వాసులారా! ఇంతకు పూర్వపు ప్రజల కోసం ఆదేశించబడినట్లుగానే మీ కోసం కూడా ఉపవాసం విధిగావించబడింది. తద్వారా మీరు దైవభక్తిపరాయణులు అవగలరు"
ఖుర్ఆన్ - మీరు విశ్వసించదగిన ఒక అద్భుత దివ్యగ్రంథం
(ఇంగ్లీష్)
2014-06-24
ఈ కరపత్రం ఖుర్ఆన్ మరియు సైంటిఫిక్ మహిమలలో దాని ప్రత్యేకతలను గురించి వివరిస్తున్నది.
ఇస్లాం ధర్మం స్వచ్ఛమైనది, సహజమైనది మరియు పర్యావరణ స్నేహశీలి
(ఇంగ్లీష్)
2014-06-24
ఈ కరపత్రం మొదటి పేజీలో ఇలా ప్రశ్నించబడింది, "ప్రజల, పశుపక్ష్యాదుల, చెట్టుపుట్టల, గ్రహాల, భూమి, నీరు మొదలైన వాటితో పాటు మొత్తం భూమండలం యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడే నియమనిబంధనలు ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అవును - తప్పకుండా ఉండాలి !"
ఇస్లామీయ దృక్పథంలో జీసస్
(ఇంగ్లీష్)
2014-06-24
ఈ కరపత్రంలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నదో వివరిస్తున్నది. ప్రవక్త జీసస్ ఒక మానవ ప్రవక్త అనీ మరియు క్రైస్తవులు నమ్ముతున్నట్లుగా ఎలాంటి దైవత్వమూ ఆయనలో లేదనీ రచయిత తగిన సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాడు.
ముహమ్మద్ - నూతన మిలియనియమ్ యొక్క ఆదర్శ పురుషుడు
(ఇంగ్లీష్)
2014-06-24
ఈ కరపత్రంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి కొన్ని ముఖ్యాంశాలు ప్రస్తావించబడినాయి. ఉదాహరణకు - ఇస్లాం ధర్మంలో ప్రవక్తత్వ భావన, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిగత జీవితం, ప్రవక్తత్వం తర్వాత ఆయన జీవితం మొదలైనవి. అసాధారణమైన జీవితం గడిపిన అలాంటి మహోన్నత వ్యక్తి గురించి ఎందుకు సామాన్య యూరోపు దేశ ప్రజలకు మరియు అమెరికన్లకు చాలా తక్కువగా తెలుసు అని ప్రశ్నిస్తున్నది.
ఇస్లాం అంటే ఏమిటి - ఒక సమగ్ర రూపంలో
(ఇంగ్లీష్)
2014-06-24
ఈ కరపత్రంలో ఇస్లాం గురించి ఒక సమగ్ర రూపంలో చర్చించబడింది. ఇస్లాం ధర్మంలోని ధార్మిక విధులు, ఇస్లామీయ జీవిత విధానం, ఈనాటి సమస్యలకు ఇస్లామీయ పరిష్కారం, ఇస్లామీయ భావనాపరంగా ప్రవక్తత్వం, ఇస్లాం ధర్మం తెలుపుతున్న మరణానంతర జీవితం ... మొదలైన విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.
ఇస్లాం ధర్మంలో మహిళలు - తరచుగా వినబడే తప్పుడు ప్రసారాలకు భిన్నంగా
(ఇంగ్లీష్)
2014-06-24
ఈ కరపత్రంలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్థానం గురించి ప్రస్తావించబడింది. మామూలుగా ప్రజలలో వ్యాపింపజేయ బడుతున్న అసత్యాలకు అది చాలా భిన్నంగా ఉంది. ధార్మిక విధులు, వివాహం, సామాజిక పాత్ర మొదలైన దృష్టికోణాలలో ఇస్లాం ఏమంటుంది మరియు ఇస్లాంలో ఆమెకు ఇవ్వబడిన ఉన్నత స్థానం గురించి చక్కగా వివరించబడింది.
ఎందుకు ఇస్లాం ధర్మం - ఇస్లాం ధర్మ సౌందర్యం మరియు ప్రయోజనాలు
(ఇంగ్లీష్)
2014-06-23
మనం ఎందుకు ఇస్లాం ధర్మాన్ని ఎంచుకోవాలి అనే విషయంపై కొన్ని ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. సృష్టికర్త, స్వచ్ఛమైన మరియు స్పష్టమైన దైవభావన, పాపవిమోచన, జవాబుదారీతనం మరియ న్యాయం, సార్వజనిక సందేశం, ప్రాక్టికల్ మరియు సంతులిత జీవన విధానం మొదలైన కొన్ని ముఖ్యాంశాలను వివరిస్తున్నది.
క్రమక్రమంగా జరిగిన ఇంగ్లీషు బైబిలు అభివృద్ధి
(ఇంగ్లీష్)
2014-06-07
ఇంగ్లీషు బైబిల్ ఎలా తయారైంది, కాలక్రమంలో ఎలా అనేక మార్పులు చేర్పులు అందులో చోటు చేసుకున్నాయి అనే విషయాలు ఇక్కడ చర్చించబడినాయి. ఓ మిత్రులారా! మీరు ఒక్కసారైనా ఖుర్ఆన్ ఎందుకు చదవరు ? ఇది 1400 ఏళ్ళ నుండి, అవతరించిన అసలు అరబీ భాషలో సజీవంగా మన మధ్యన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై 23 సంవత్సరాల ప్రవక్తత్వ కాలంలో అవతరించిన స్వచ్ఛమైన రూపంలోనే భద్రంగా ఉన్నది.
ఫర్జ్ నమాజు తర్వాత చేసే ధ్యానం
(ఇంగ్లీష్)
2014-06-07
నమాజుల తర్వాత చేయవలసిన ధ్యానం ఇక్కడ ప్రస్తావించబడింది. దీనిని ప్రింటు చేసి, మస్జిదులలో ఉంచడం మంచిది.
కాలక్రమంలో ఏర్పడిన క్రైస్తవ వర్గాలు
(ఇంగ్లీష్)
2014-06-07
కాలక్రమంలో ఏర్పడిన క్రైస్తవ వర్గాల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. వేర్వేరు బైబిల్ ప్రచురణ, మూలసిద్ధాంతాలలో మార్పులు చేర్పులు, జీసస్ గురించిన వేర్వేరు అభిప్రాయాలు ....
ప్రవక్తల పరంపర
(ఇంగ్లీష్)
2014-06-07
ఈ పోష్టర్ లో ప్రవక్తల పరంపర, వారి కాలం, వారి వయస్సు మరియు వారి గురించిన ఇతర సమాచారం చాలా చక్కగా ప్రచురించబడింది.
ఉమ్ముహాతుల్ మోమినీన్
(ఇంగ్లీష్)
2014-06-07
ఈ వ్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల గురించి ప్రస్తావించబడింది. వారిని ముస్లింలు ఉమ్ముహాతుల్ మోమినీన్ అంటే విశ్వాసుల తల్లులు అని గౌరవంగా పిలుస్తారు.
వ్యక్తిగత పేర్లను అనువదించే హక్కు మీకు లేదు
(ఇంగ్లీష్)
2014-06-07
బైబిల్ లో ప్రస్తావించబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది. ఇంటర్నెట్ సేవలలో ఒకటైన గూగుల్ ట్రాన్సలేటు ను ఉపయోగిస్తూ, ఈ వ్యాసం ముస్లింలపై వస్తున్న కొన్న నిందలలోని సత్యాసత్యాలను స్పష్టం చేస్తున్నది. గూగుల్ ట్రాన్సలేటులో పనిచేస్తున్నది ముస్లిమేతరులు కాబట్టి, ముస్లింలు పక్షపాతంతో ఈ పదాలను అనువదించారనే నిందలు నిర్వీర్యం అయిపోతున్నాయి.
ఐదు ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు
(ఇంగ్లీష్)
2014-06-07
ఇస్లాం అంటే ఏమిటి, దేవుడు ఎవరు, రక్షకుడు ఎవరు, మోక్షం అంటే ఏమిటి, ఖుర్ఆన్ అంటే ఏమిటి మొదలైన ఐదు ముఖ్య ప్రశ్నలకు ఇక్కడ జవాబులు ఉన్నాయి.
దైవదూతలు మరియు మానవులు
(ఇంగ్లీష్)
2014-06-07
దైవదూతల ప్రపంచం గురించి ఇస్లాం ధర్మం ఏమంటుంది అనే ముఖ్యాంశం గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది. ప్రామాణిక ఖుర్ఆన్ మరియు సున్నతుల సాక్ష్యాధారాలతో వివరిస్తున్నది. వాటి సృష్టి, వారికి సంబంధించిన వివిధ విషయాలు, వాటి ఉనికి, వారి స్వభావం మరియు గుణగణాలు, వారి పనుల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది.
కష్టసుఖాలు
(ఇంగ్లీష్)
2014-06-07
కష్టసుఖాలు - కష్టాలు, నష్టాలు ఎల్లప్పుడూ ఉండవు, వాటి తర్వాత తప్పక సుఖాలు వస్తాయి.
నిషేధాజ్ఞలు
(ఇంగ్లీష్)
2014-06-07
నిషేధాజ్ఞలు - మక్కాలోని ముస్లింలపై జారీ చేయబడిన నిషేధాజ్ఞల గురించి మరియు వాటి తీవ్ర పరిణామాల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది.
ఖుర్ఆన్ మరియు మోడ్రెన్ సైన్సు
(ఇంగ్లీష్)
2014-06-07
ఖుర్ఆన్ మరియు మోడ్రెన్ సైన్సు - ఖుర్ఆన్ లోని కొన్ని వైజ్ఞానిక పరమైన వచనాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది.
అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్య గుణగణాలు
(ఇంగ్లీష్)
2014-06-07
అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్య గుణగణాల గురించి అహ్లె సున్నతుల్ వల్ జమఅహ్ ప్రజల అభిప్రాయాలు మరియు వాటిని వ్యతిరేకించే వారి అభిప్రాయాల ఖండన.
Go to the Top