వీడియోల ప్రదర్శన ( 551 - 575 మొత్తం నుండి: 689 )
2014-06-23
మాంఛేష్టర్ యూనివర్శిటీలో అంతిమ దినంనాటి భయంకర అగ్ని గురించి, మన జీవిత ముఖ్యోద్దేశం గురించి, ఈ భూలోకంపై మనం ఎందుకు నివసిస్తున్నాము అనే విషయం గురించి, ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపింపజేయబడిన అపార్థాల గురించి మరియు సత్యమైన, సూటీయైన ఇస్లాం ధర్మం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చక్కగా వివరించారు.
ఇస్లాం పరిచయం(ఇంగ్లీష్)
2014-06-23
దైవవిశ్వాస మూలసిద్ధాంతాలు మరియు ఇస్లాం ధర్మం యొక్క మూలసిద్ధాంతాల గురించి ఇక్కడ చర్చించబడింది. ఇస్లామీయ మూలసిధ్దాంతమైన అఖీదహ్ యొక్క లక్ష్యాలను వివరిస్తున్నది. ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి అనేక ఉపమానాలతో నిష్కళంకమైన చిత్తశుద్ధితో అల్లాహ్ ఆరాధించేలా ప్రోత్సహిస్తున్నది.
పర్పస్ ఆఫ్ లైఫ్(ఇంగ్లీష్)
2014-06-23
ఈ ప్రసంగంలో షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ అసలు తమ జీవిత ముఖ్యోద్దేశాన్నే మరిచిపోయిన ప్రజల గురించి చర్చించారు. ఈ భూలోకంపై తాము ఎందుకు జీవిస్తున్నామనే ముఖ్యాంశం గురించి తెలియని ప్రజలను సంబోధిస్తున్నారు. ఒకవేళ వారు దాని గురించి తెలుసుకోవాలనుకున్నా, వారు షైతాను కుతంత్రాల వలన మరియు అంధ విశ్వాసాల వలన మార్గభ్రష్టులవుతున్నారు. ఈ ప్రసంగం అలాంటి వారి సత్యాన్వేషణలో సహాయ పడుతున్నది మరియు ప్రామాణిక సాక్ష్యాధారాలతో సన్మార్గాన్ని చూపుతున్నది.
ఇస్లాం ధర్మంపై వ్యాపింపజేయబడిన అపార్థాలు(ఇంగ్లీష్)
2014-06-23
ఈ ప్రసంగంలో షేఖ్ అబ్రుర్రహీమ్ గ్రీన్ సత్యధర్మమైన మరియు ఋజుమార్గమైన ఇస్లాం పై ప్రజలలో వ్యాపింపజేయబడిన కొన్ని అపార్థాల గురించి చర్చించారు.
దైవవిశ్వాసంలో ఏకత్వం(ఇంగ్లీష్)
2014-06-23
దైవవిశ్వాసంలో ఏకత్వం అనే ఈ ప్రసంగాన్ని షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఇచ్చారు. దీనిలో ఆయన ఆరు బిలియన్ల ప్రపంచ జనాభాలో అధికశాతం ప్రజలు అల్లాహ్ ను ఆరాధింపబడే అర్హతలు కలిగిన ఏకైక దైవంగా విశ్వసించటం లేదనే వాస్తవం పై చర్చించారు. నిజానికి వారిలో చాలా మంది అల్లాహ్ కు భాగస్వాములను చేరుస్తారు లేదా అసలు ఆయన ఉనికినే తిరస్కరిస్తున్నారు.
కన్సూమర్ సొసైటీపై శాపం(ఇంగ్లీష్)
2014-06-23
షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఇచ్చిన ప్రసంగాలలో ఒక గొప్ప ప్రసంగం - వినియోగదారుల సమాజంపై శాపం.
2014-06-23
ఈ భాగంలో ఫిరౌన్ భార్య అయిన ఆసియా యొక్క గాథను షేఖ్ ఉమర్ సులైమాన్ వివరించారు. ఆమె యొక్క ఉత్తమ గుణాలను ఆయన ప్రస్తావించారు.
పశ్చాత్తాపం(ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో చేసిన పాపానికి, తప్పులకు ఎలా పశ్చాత్తాప పడాలి, అసలు మనం ఎందుకు అల్లాహ్ వద్ద పశ్చాత్తాప పడటం లేదు వంటి మరికొన్ని విషయాల గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చర్చించారు.
అల్లాహ్ ఎవరు (ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో అల్లాహ్ ఎవరు అనే అత్యంత ముఖ్య విషయం వివరించబడింది. అల్లాహ్ ను గురించి తెలుసుకోవడమంటే మనం ఎవరిని ఆరాధించాలో ఆయన గురించి తెలుసుకోవడమన్న మాట. యూదులు మరియు క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడినే ముస్లింలు కూడా ఆరాధిస్తున్నారా ? అల్లాహ్ అనే పదానికి అసలు అర్థం ఏమిటి? అల్లాహ్ చంద్ర దేవుడా ?
ఇస్లాం ధర్మంలోని జనాజా నమాజు పద్ధతి(ఇంగ్లీష్)
2014-06-23
క్లుప్తంగా, ఇస్లాం ధర్మంలో జనాజా నమాజు పద్ధతిని వివరిస్తున్న లాభదాయకమైన మార్గదర్శిని. జనాజా నమాజు చరిత్ర, దాని ప్రాధాన్యత, దాని ప్రయోజనం మరియు దాని ప్రాక్టీసు గురించి ఇక్కడ చర్చించబడింది.
మనం విశ్వసించే స్వర్గం(ఇంగ్లీష్)
2014-06-23
ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో స్వర్గం ఎలా ఉంటుంది అనే ముఖ్యాంశంపై ఒక చర్చ.
ఉపవాసంలో అయిష్టకరమైన పనులు(ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో ఉపవాస స్థితిలో చేయకూడని అయిష్టకరమైన పనుల గురించి మరియు వాటికి పడే శిక్ష గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-23
ఈ భాగంలో ఉపవాసాల శ్రేష్ఠత గురించి మరియు వాటికి సంబంధించిన నియమనిబంధనల గురించి, వాటి శుభాల గురించి మరియు వాటికి లభించే పుణ్యాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
సున్నతు ఉపవాసాలు(ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో సున్నతు ఉపవాసాలకు సంబంధించిన నియమాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
విజయవంతంగా ఉత్తమ పిల్లలను పెంచే 7 అలవాట్లు (ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ "పిల్లల హక్కులు" అనే చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశంపై చర్చిస్తూ, విజయవంతంగా మంచి బాలలను ఎలా పెంచగలమనే విషయాన్ని వివరించారు.
నిస్వార్థ సేవ మరియు ఇతరులకు సహాయపడటం (ఇంగ్లీష్)
2014-06-23
నిస్వార్థసేవ యొక్క అర్థం, దాని పద్దతి, దాని గుణాలు మరియు ఇస్లాం ధర్మం నొక్కి వక్కాణిస్తున్న దాని ప్రాధాన్యత గురించి ఈ సంక్షిప్త వీడియోలో చర్చించబడింది. ముందు తరం ముస్లిం సమాజం యొక్క అసలు నిస్వార్థ సేవ రాబోయే తరాల కోసం సాటి లేని ఉపమానం.
చీకటి నుండి వెలుగులోనికి(ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో చాలా ముఖ్యమైన "నేను ఎలా చీకటి నుండి వెలుగులోని వస్తూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను" అనే అంశంపై డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరించారు. ఈ గొప్ప ప్రసంగంలో ఆయన ఇస్లాం ధర్మాన్ని ఎలా స్వీకరించారనే ఆసక్తికరమైన గాథ వినండి.
మన జీవిత ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడం(ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో "మన జీవిత ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడం" అనే చాలా ముఖ్యమైన అంశాన్ని వివరిస్తూ, ఏకైక ప్రభువుని ఆరాధించడం, ఇస్లాం ధర్మాన్ని మన ఆదర్శ ధర్మంగా అనుసరించడం, ఖుర్ఆన్ మరియు సున్నతులను అనుసరించడంలోని ప్రాముఖ్యతను గురించి వివరించారు.
ఒక ఆదర్శ ముస్లిం విద్యార్థి(ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో చాలా చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన "ఒక ఆదర్శ ముస్లిం విద్యార్థి" అనే అంశం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరంగా చర్చించారు.
యాంటీ క్రైష్టు (దజ్జాల్) అసలు కథ(ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో యాంటీ క్రైష్టు అంటే దజ్జాల్ అసలు స్టోరీ అనే ముఖ్యాంశాన్ని డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరంగా చర్చించారు.
జిన్నాతుల ప్రపంచం(ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో దైవదూతల మరియు జిన్నాతుల ప్రపంచంపై విశ్వాసం అనే ముఖ్యవిషయాన్ని డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరంగా చర్చించారు. మానవజాతి, పశుపక్ష్యాదులు మాత్రమే మన కంటికి కనబడతాయి. అయితే మానవ కంటికి కనబడని దైవదూతలు మరియు జిన్నాతులను కూడా సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సృష్టించినాడు. ఇవి కూడా ఆయననే ఆరాధిస్తాయి. మన కంటికి కనబడే మరియు కనబడని ఇతర సృష్టితాలు కూడా ఉనికిలో ఉన్నాయనే సత్యాన్ని అంగీకరించడమనేది ముస్లింల విశ్వాసంలోని ఒక భాగం.
దైవవిశ్వాసం యొక్క రెండు రెక్కలు(ఇంగ్లీష్)
2014-06-23
ఈ భాగంలో ఒక ముస్లిం ఎలా తన దైవవిశ్వాసాన్ని గట్టిపరుచుకుంటూ, నిలకడగా సన్మార్గంపై ఉంటాడనే ముఖ్య విషయాన్ని డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరంగా చర్చించారు.
లైలతుల్ ఖదర్(ఇంగ్లీష్)
2014-06-21
లైలతుల్ ఖదర్ అనే రమదాన్ మాసంలో వచ్చే ఒక ఘనమైన రాత్రి యొక్క ప్రాధాన్యత మరియు దాని వలన లభించే పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇక్కడ చర్చించబడింది.
అల్ ఎత్తెకాఫ్(ఇంగ్లీష్)
2014-06-21
అల్ ఎత్తెకాఫ్ అంటే ఇస్లామీయ పద్ధతిలో ఏకాంతవాసం యొక్క ప్రాధాన్యత, దాని శుభాలు మరియు దాని ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో జరిగిన చర్చ.
2014-06-21
రమదాన్ మాస ఉపవాసాన్ని భంగం చేసేందుకు అనుమతించబడిన కారణాల గురించి మరియు వాటిని తర్వాత ఎలా పూర్తి చేయాలనే విషయం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇక్కడ చర్చించబడింది.