వీడియోల ప్రదర్శన ( 576 - 600 మొత్తం నుండి: 775 )
2014-06-24
ఈ గొప్ప ప్రసంగంలో ఇస్లాం ధర్మం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించారు. దీనిలో ఆయన దేవుడి అసలు ధర్మం, ఇస్లాం ధర్మమే దేవుడి అసలు ధర్మమని మనకు ఎలా తెలుస్తుంది, ఇస్లాం ధర్మం సత్యమైనదని మనకు ఎలా తెలుస్తుంది, మీరు ఇస్లాం ధర్మాన్ని మరియు దాని సాక్ష్యాధారాలను విశ్లేషించడానికి తయారుగా ఉన్నారా అనే ముఖ్య విషయాలను చాలా బాగా వివరించారు.
2014-06-24
ఈ గొప్ప ప్రసంగంలో అల్లాహ్ వైపు తీసుకుపోయే మార్గం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించారు. ఆయన దీనిలో మానవుడి ప్రాపంచిక జీవితం ఒక ప్రయాణం, ఒకరోజున ఇది అంతమై పోతుంది మరియు ఆ తర్వాత అతడికి ఏమి జరగబోతున్నది అనే చాలా ముఖ్యమైన విషయాలను వివరించారు.
2014-06-24
ఈ గొప్ప ప్రసంగంలో ఖుర్ఆన్ మరియు ఆధునిక ప్రపంచం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించారు. ఆయన దీనిలో ఖుర్ఆన్ మరియు ఆధునిక ప్రపంచం మొదలైన పదాలను చాలా స్పష్టంగా వివరించినారు.
2014-06-24
ఈ గొప్ప ప్రజంటేషన్ లో ప్రళయదిన సూచనల గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించారు. అంతిమదినం పై విశ్వాసం మరియు ఆనాడు ప్రసాదించబోయే ప్రతిఫలం మరియు శిక్షలను విశ్వసించడం ఇస్లాం ధర్మంలోని మూలసిద్ధాంతాలలోనిది. అంతిమదినం కంటే ముందు సంభవించే కొన్ని ముఖ్య సంఘటనలను మనకోసం సూచనలుగా అల్లాహ్ ముందే తెలిపినాడు. అంతిమదిన విషయానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. దాని గురించి ప్రస్తావించినపుడల్లా ఆయన స్వరం గంభీరంగా మారిపోయేది మరియు ఆయనకు ఆగ్రహం వచ్చేది.
2014-06-24
ఈ ఉపన్యాసంలో సృష్టికర్త ఉనికి మరియు మన జీవిత ధ్యేయం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించినారు. అసలు దేవుడు అంటే ఎవరు అనే నిర్వచనంపై చర్చతో ఈ ఉపన్యాసం ప్రారంభమైంది. సృష్టకర్తను విశ్వసించడం ఎందుకు వివేకమైందో పరిశీలించబడింది.
2014-06-24
ఈ ఉపన్యాసంలో ఈ భూలోకంలో షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్
2014-06-24
31 ఏకదైవత్వ వివరణ పుస్తకం - వారిని అల్లాహ్ ను ప్రేమించినట్లుగా వారు ప్రేమిస్తారు: షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-24
ఈ వీడియోలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించి ముస్లింల విశ్వాసం మరియు ఇస్లాం ధర్మంలోని ఆయన ఉన్నత స్థానం గురించి యూషా ఇవాన్స్ చర్చించారు.
2014-06-24
ఈ వీడియోలో ఇస్లామీయ బోధనల ప్రకారం ప్రవక్త జీసస్ అంటే ఈసా అహిస్సలాం గురించి ముస్లింల విశ్వాసం, ఇస్లాంలో ఆయన యొక్క ఉన్నత స్థానం గురించి యూషా ఇవాన్స్ చర్చించారు.
2014-06-24
ఈ వీడియోలో ఇస్లామీయ దృక్పథంలో ఒరిజినల్ పాప భావన గురించి మరియు తమ పాపాల నుండి విముక్తి కావడానికి ఇస్లాం ధర్మం బోధిస్తున్న పది మార్గాల గురించి యూషా ఇవాన్స్ చర్చించారు.
2014-06-24
ఈ ఆసక్తికరమైన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం ప్రజల దృష్టిలో నుండి ఎలా తప్పిపోతున్నది అనే ముఖ్యాంశం గురించి చర్చించబడింది. ఈ ప్రపంచంలో తమ జీవితం యొక్క ముఖ్యోద్దేశం తెలియని ప్రజలను సంభోదిస్తున్నది. ఒకవేళ వారికి అది తెలిసినా, షైతాను కుతంత్రాల వలన మరియు అంధ విశ్వాసాల వలన మార్గభ్రష్టులవుతున్నారు. అలాంటి ప్రజల సత్యాన్వేషణలో ఇది సహాయ పడుతున్నది.
2014-06-23
ఈ వీడియోలో ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం నుండి ఇస్లాం ధర్మ మూలాల గురించి చర్చించారు. దర్శకుల కోసం ఆయన దీనిని ఇస్లాం అంటే ఏమిటి, దివ్యమార్గదర్శకం ద్వారా మాత్రమే మనశ్శాంతి లభిస్తుందని, ప్రాపంచిక ధనసంపదల ద్వారా కాదని ప్రామాణిక ఆధారాలతో వివరించారు.
2014-06-23
మాంఛేష్టర్ యూనివర్శిటీలో అంతిమ దినంనాటి భయంకర అగ్ని గురించి, మన జీవిత ముఖ్యోద్దేశం గురించి, ఈ భూలోకంపై మనం ఎందుకు నివసిస్తున్నాము అనే విషయం గురించి, ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపింపజేయబడిన అపార్థాల గురించి మరియు సత్యమైన, సూటీయైన ఇస్లాం ధర్మం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చక్కగా వివరించారు.
2014-06-23
దైవవిశ్వాస మూలసిద్ధాంతాలు మరియు ఇస్లాం ధర్మం యొక్క మూలసిద్ధాంతాల గురించి ఇక్కడ చర్చించబడింది. ఇస్లామీయ మూలసిధ్దాంతమైన అఖీదహ్ యొక్క లక్ష్యాలను వివరిస్తున్నది. ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి అనేక ఉపమానాలతో నిష్కళంకమైన చిత్తశుద్ధితో అల్లాహ్ ఆరాధించేలా ప్రోత్సహిస్తున్నది.
2014-06-23
ఈ ప్రసంగంలో షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ అసలు తమ జీవిత ముఖ్యోద్దేశాన్నే మరిచిపోయిన ప్రజల గురించి చర్చించారు. ఈ భూలోకంపై తాము ఎందుకు జీవిస్తున్నామనే ముఖ్యాంశం గురించి తెలియని ప్రజలను సంబోధిస్తున్నారు. ఒకవేళ వారు దాని గురించి తెలుసుకోవాలనుకున్నా, వారు షైతాను కుతంత్రాల వలన మరియు అంధ విశ్వాసాల వలన మార్గభ్రష్టులవుతున్నారు. ఈ ప్రసంగం అలాంటి వారి సత్యాన్వేషణలో సహాయ పడుతున్నది మరియు ప్రామాణిక సాక్ష్యాధారాలతో సన్మార్గాన్ని చూపుతున్నది.
2014-06-23
ఈ ప్రసంగంలో షేఖ్ అబ్రుర్రహీమ్ గ్రీన్ సత్యధర్మమైన మరియు ఋజుమార్గమైన ఇస్లాం పై ప్రజలలో వ్యాపింపజేయబడిన కొన్ని అపార్థాల గురించి చర్చించారు.
2014-06-23
దైవవిశ్వాసంలో ఏకత్వం అనే ఈ ప్రసంగాన్ని షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఇచ్చారు. దీనిలో ఆయన ఆరు బిలియన్ల ప్రపంచ జనాభాలో అధికశాతం ప్రజలు అల్లాహ్ ను ఆరాధింపబడే అర్హతలు కలిగిన ఏకైక దైవంగా విశ్వసించటం లేదనే వాస్తవం పై చర్చించారు. నిజానికి వారిలో చాలా మంది అల్లాహ్ కు భాగస్వాములను చేరుస్తారు లేదా అసలు ఆయన ఉనికినే తిరస్కరిస్తున్నారు.
2014-06-23
షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఇచ్చిన ప్రసంగాలలో ఒక గొప్ప ప్రసంగం - వినియోగదారుల సమాజంపై శాపం.
2014-06-23
ఈ భాగంలో ఫిరౌన్ భార్య అయిన ఆసియా యొక్క గాథను షేఖ్ ఉమర్ సులైమాన్ వివరించారు. ఆమె యొక్క ఉత్తమ గుణాలను ఆయన ప్రస్తావించారు.
2014-06-23
ఈ భాగంలో చేసిన పాపానికి, తప్పులకు ఎలా పశ్చాత్తాప పడాలి, అసలు మనం ఎందుకు అల్లాహ్ వద్ద పశ్చాత్తాప పడటం లేదు వంటి మరికొన్ని విషయాల గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చర్చించారు.
2014-06-23
ఈ భాగంలో అల్లాహ్ ఎవరు అనే అత్యంత ముఖ్య విషయం వివరించబడింది. అల్లాహ్ ను గురించి తెలుసుకోవడమంటే మనం ఎవరిని ఆరాధించాలో ఆయన గురించి తెలుసుకోవడమన్న మాట. యూదులు మరియు క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడినే ముస్లింలు కూడా ఆరాధిస్తున్నారా ? అల్లాహ్ అనే పదానికి అసలు అర్థం ఏమిటి? అల్లాహ్ చంద్ర దేవుడా ?
2014-06-23
క్లుప్తంగా, ఇస్లాం ధర్మంలో జనాజా నమాజు పద్ధతిని వివరిస్తున్న లాభదాయకమైన మార్గదర్శిని. జనాజా నమాజు చరిత్ర, దాని ప్రాధాన్యత, దాని ప్రయోజనం మరియు దాని ప్రాక్టీసు గురించి ఇక్కడ చర్చించబడింది.
2014-06-23
ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో స్వర్గం ఎలా ఉంటుంది అనే ముఖ్యాంశంపై ఒక చర్చ.
2014-06-23
ఈ భాగంలో ఉపవాస స్థితిలో చేయకూడని అయిష్టకరమైన పనుల గురించి మరియు వాటికి పడే శిక్ష గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-23
ఈ భాగంలో ఉపవాసాల శ్రేష్ఠత గురించి మరియు వాటికి సంబంధించిన నియమనిబంధనల గురించి, వాటి శుభాల గురించి మరియు వాటికి లభించే పుణ్యాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
Go to the Top