వీడియోల ప్రదర్శన ( 176 - 200 మొత్తం నుండి: 689 )
ఉపవాస నిర్వచనం
2014-07-09
ఉపవాస నిర్వచనం అనే అంశంపై షేఖ్ హాజెమ్ రాజెబ్ ఇచ్చిన ఒక మంచి ఉపన్యాసం. ఇందులో ఆయన అసలు ఉపవాసం అంటే ఏమిటి, దాని ధర్మాజ్ఞలు మరియు శుభాలను ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించారు. అంతేగాక ఈ పవిత్ర మాసానికి సంబంధించిన అంశాలన్నింటినీ చర్చించారు.
రమదాన్ కోసం తయారీ
2014-07-09
రమదాన్ మాసంలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవటానికి మనం ఎలా తయారు కావాలి అనే అంశంపై అద్నాన్ రాషిద్ ఇచ్చిన ఒక మంచి ఉపన్యాసం.
? ఒకవేళ ఇదే నా చివరి రమదాన్ అయితే
2014-07-09
"ఒకవేళ ఇదే నా చివరి రమదాన్ అయితే నా పరిస్థితి ఏమిటి?" అనే అంశంపై డాక్టర్ తౌఫీఖ్ చౌదరీ ఇచ్చిన మంచి ఉపన్యాసం. ఇందులో ఆయన రమదాన్ ప్రాముఖ్యత గురించి, రమదాన్ మాసంలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవటానికి ఎలా తయారు కావాలి అనే అంశాల గురించి చర్చించారు.
యూద ధర్మం, క్రైస్తవ ధర్మం మరియు ఇస్లాం ధర్మాలలో ముక్తి మార్గం
2014-07-09
అబ్రహామిక్ ధర్మాలైన యూద, క్రైస్తవ మరియు ఇస్లాం ధర్మాలలో ముక్తి మార్గం గురించి ఈ సంక్షిప్త వీడియోలో చర్చించబడింది. ముక్తి మార్గం భావన మీ జీవితంలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించిందా? దైవ మన్నింపు మరియు దయ కురిపించే మార్గం ఏది? దైవం వద్దకు మరియు స్వర్గానికి చేర్చే మార్గం ఏది? యూద ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? క్రైస్తవ ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? ఆదం యొక్క పాపం మానవులందరికీ ఎందుకు సంక్రమిస్తుంది? మన పాపవిమోచన కోసమే జీసస్ మరణించాడా ? ఇస్లాం ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? అసలు వాస్తవం ఏమిటి? ఇస్లాం ధర్మంలో పాశ్చాత్తాపం అనేది ఒక ప్రధాన అంశం? తన ప్రభువు నుండి క్షమాభిక్ష లభిస్తుందనే ఆశతో సన్మార్గం వైపుకు మరలేలా ఇది ప్రతి విశ్వాసిలో ఆశలు కల్పిస్తుంది. ఆది పాపం అంటే ఒరిజినల్ సిన్ లేదా మానవుల పుట్టుకలోనే పాపం ఇమిడి ఉందనే భావనలను ఇస్లాం పూర్తిగా తిరస్కరిస్తున్నది. ప్రతి వ్యక్తి తన కర్మలకు మాత్రమే బాధ్యుడు. ఒరిజినల్ సిన్ అంటే ఆది పాపం అనే బడేదేదీ ఇస్లాం ధర్మంలో లేదు.
రమదాన్ శుభాలు
2014-07-09
రమదాన్ పవిత్ర మాస శుభాలు అనే పేరుతో తయారైన ఈ వీడియో సీరీస్ లో రమదాన్ మాస ప్రాధాన్యత, ఉపవాసాల ప్రయోజనాలు, రమదాన్ మాస కార్యక్రమాలు, రమదాన్ మాస శుభాల గురించి డాక్టర్ అబ్దుల్లాహ్ హాకిమ్ క్విక్ చక్కగా వివరించారు. చాలా ఆసక్తికరమైన సీరీస్. ముస్లింల కొరకు ఎంతో సమాచారం ఉన్నది.
నమాజు ఎలా చేయాలి
2014-07-08
ఈ ఉపన్యాసంలో నమాజు ఎలా చేయాలో చాలా వివరంగా చర్చించబడింది.
దీన్ అనే అరబీ పదం యొక్క అర్థం ఏమిటి
2014-07-08
ఇస్లాం గురించి మరియు ఇస్లాం ధర్మం ఏమి బోధిస్తున్నది అనే విషయం గురించి ప్రచారంలో ఉన్న అపోహలు, అపార్థాలు మరియు భ్రమలను దూరం చేసేందుకు తయారు చేయబడిన కార్యక్రమం ఇది. దీన్ అంటే అర్థం ఏమిటి అనే ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వబడింది. సృష్టికర్త వద్ద అంగీకరించబడే మానవజీవిత విధానం కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే.
రమదాన్ జ్ఞాపికలు
2014-07-08
రమదాన్ రిమైండర్స్ అంటే రమదాన్ జ్ఞాపికలు అనే ఈ సీరీస్ రమదాన్ నెల యొక్క శుభాలు మరియు దానిలోని ఆచరణలు వివరించే ఒక సంక్షిప్త జ్ఞాపిక. అసలు రమదాన్ అంటే ఏమిటి, ఈ నెలలో మనం ఆచరణాత్మకంగా ఎలా జీవించాలి, ఈ నెల తర్వాత కూడా ఇంత మంచి జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనే అంశాలు ప్రస్తావించబడినాయి. ముస్లింల కొరకు ఇది ఒక ఆసక్తికరమైన సీరీస్.
రమదాన్ నెల జ్ఞాపిక
2014-07-08
రమదాన్ రిమైండర్స్ అనే ఈ ఆసక్తికరమైన సీరీస్ లో షేఖ్ యాసిర్ ఖాదీ రమదాన్ నెల ప్రాధాన్యత, ఉపవాసాల ప్రయోజనాలు, రమదాన్ నెలలోని ఇతర కార్యక్రమాలు మరియు శుభాల గురించి చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరి కోసం చాలా ఆసక్తికరమైన మరియు ప్రయోజనకరమైన సీరీస్.
డాక్టర్ జాకిర్ నాయక్ తో ఒక రమదాన్ నెల చర్చ
2014-07-08
రమదాన్ నెలలో డాక్టర్ జాకిర్ నాయక్ తో కొంత సమయం అనే టీవీ సీరీస్ లో, రమదాన్ నెల ప్రాధాన్యం, దానిలో వీలయినన్ని పుణ్యాలు సంపాదించుకోవటం కోసం మనం ఎలాంటి తయారీలు చేసుకోవాలి, ఈ నెలలో ఒక ముస్లిం ఏమి చేయాలి, ఈ పూర్తి నెల యొక్క శుభాలు మొదలైన విషయాలు ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్నాయి. ప్రతి ముస్లిం కోసం ఇది ఒక అద్భుతమైన సీరీస్.
లైలతుల్ ఖద్ర్
2014-07-08
ఈ జుమా ఖుద్బాలో లైలతుల్ ఖద్ర్ అనబడే దివ్యమైన రాత్రి గురించి షేఖ్ యాసిర్ ఖాదీ వివరించారు. ఆ రాత్రి యొక్క ప్రాధాన్యత, దాని సూచనలు, రమదాన్ నెల చివరి పది రాత్రుల మహాశక్తి మరియు దీవెనలు. ఇంకా లైలతుల్ ఖదర్ యొక్క అర్థం, దాని ప్రతిఫలం మరియు దాని శుభాల గురించి కూడా వివరంగా చర్చించారు.
రమదాన్ నెలను ఉత్తమరీతిలో సాగనంపే మరియు ఈద్ పండుగ ఉత్తమంగా చేసుకునే 10 కిటుకులు
2014-07-08
కొత్త నెలవంక కనబడినప్పటి నుండి, రమదాన్ నెలను ఉత్తమరీతిలో సాగనంపే మరియు రమదాన్ నెల తర్వాత కూడా రమదాన్ నెలలోని ఉత్తమ జీవితాన్ని కొనసాగించే బాటలో సహాయపడే 10 ప్రాక్టికల్ కిటుకులను షేఖ్ యాసిర్ ఖాదీ ఇక్కడ ఇచ్చినారు. ఈ జుమా ఖుత్బలో 10 ఆచరణాత్మక కిటుకులు, జ్ఞాపికలు, ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకునే విధానం గురించి వివరంగా చర్చించారు.
రమదాన్ తర్వాత షవ్వాల్ నెలలో ఆరు రోజులు ఉపవాసం ఉండుట వలన లభించే ప్రతిఫలం
2014-07-08
ఈ వీడియో భాగంలో షవ్వాల్ మాసపు ఆరు దినాల ఉపవాసం యొక్క ప్రాధాన్యత, దాని ఇస్లామీయ ధర్మాజ్ఞలు మరియు ప్రతిఫలం గురించి షేఖ్ యాసిర్ ఖాదీ వివరించారు.
ఇస్లాంలో ముస్లింలు మరియు ఆరాధనలు
2014-07-05
ఇస్లామీయ ధర్మాజ్ఞల గురించి మనం ప్రజలకు ప్రాక్టికల్ పద్ధతుల ద్వారా వివరించాలని, కేవలం ధియోరెటికల్ అభిప్రాయాల ద్వారా వివరిస్తే సరిపోదని ఈ వీడియో భాగంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ వివరించారు. వడ్డీ, మధ్యపానం, పొగత్రాగడం, ఆత్మహత్యలు మొదలైన ప్రతి సమస్యకు ఇస్లాం ధర్మంలో పరిష్కారం ఉందనే విషయాన్ని మనం ప్రజలు గ్రహించేలా మనం ప్రయత్నించాలి.
ముస్లిములారా, మీరు ఇస్లాం ధర్మలో ఉండి కూడా ఎందుకు నమాజు చేయడం లేదు
2014-07-05
ఈ దీన్ షో వీడియోలో షేఖ్ కరీమ్ అబు జైద్ కొన్ని మంచి విషయాలు చర్చించారు. సాఫల్యానికి చేర్చే ఫార్ములా, ఇతరులను అసహ్యించుకోవడం మానుకోవాలి, మనస్సు మరియు శరీరానికి మధ్య ఉండే సంబంధం మరియు రెండింటి ఆహారం, నమాజు గురించి కొన్ని అద్భుత పలుకులు, అనేక మంది ప్రజలు బాధ పడుతున్న నిరాశ మరియు నిస్పృహలకు మంచి పరిష్కారం.
స్త్రీలు, వివాహం, ఇస్లాం మరియు అశ్లీల వ్రాతలపై చర్చ
2014-07-05
స్త్రీలపై వ్రాయబడే అశ్లీల వ్రాతలు మరియు వివాహ వ్యవస్థ గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నదో ఈ వీడియోలో షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు. హిజాబ్ స్త్రీల గౌరవాన్ని, మానమర్యాదలను పెంచుతుంది. శిక్షల పడకుండా వారి స్థాయిని పెంచుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా వ్యక్తి ప్రాపంచిక హోదాను వదులుకోవటానికి, అతడు లేదా ఆమె కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. హిజాబ్ యొక్క లోతైన అర్థాన్ని ఆయన వివరించారు. అశ్లీలత వలన బాలురకు మరియు బాలికలకు ఎదురయ్యే భయంకరమైన ఫలితాలను ఆయన ప్రస్తావించారు.
సృష్టికర్తను వేడుకున్న ఆ నాస్తికుడికి ఏమయ్యింది
2014-07-05
ఈ వీడియోలో, డాక్టర్ లారెన్సు బ్రౌన్ తన కుమార్తె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నపుడు ఏమి జరిగిందో వివరించారు. ఆ క్లిష్ట సమయంలో, అతడు తను నాస్తికుడైనప్పటికీ, సృష్టికర్తను ప్రార్థించాడు.
ఎలా గ్రీకు దేశస్థుడైన హంజా ఆండ్రూస్ ట్జొట్జిస్ ఇస్లాం స్వీకరించారు
2014-07-05
ఈ వీడియోలో సోదరుడు హంజా ఆండ్రూస్ ట్జొట్జిస్ ఎలా ఇస్లాం స్వీకరించారో వివరించబడింది. ఆయన తనకు తాను పరిచయం చేసుకుని, తన యవ్వనం గురించి వివరించారు. తర్వాత, మీకు కూడా తప్పకుండా ఏకకాలంలో నవ్వు మరియు ఏడుపు తెప్పించే ఒక కథ చెప్పినారు
అతడు ఎందుకు దేవుడిని అసహ్యించుకున్నాడు మరియు ఇప్పుడు ఇస్లాం ధర్మాన్ని మరియు జీసస్ ను ప్రేమిస్తున్నాడు
2014-07-05
ఈ వీడియోలో సోదరుడు షదీద్ ముహమ్మద్ ఎలా ఇస్లాం స్వీకరించారో, దానికి ముందు దేవుడిని ఎలా అసహ్యించుకునేవారో, కష్టాలు ఎదురైనపుడు దేవుడిని ఎలా దూషించేవారో వివరించినారు. ఆయన ఇప్పుడు అల్లాహ్ ను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు, ట్రినిటీపై నమ్మకం కోల్పోయినట్లు, చర్చీకు వెళ్ళటం ఆపివేసినట్లు తెలిపినారు. తర్వాత అల్లాహ్ ప్రజల కొరకు సహజసిద్ధంగా సృష్టించిన ఇస్లాం స్వీకరించుట వెనుక గల కారణాలను వివరించారు.
షేఖ్ డాక్టర్ యాసిర్ ఖాదీతో ఇంటర్వ్యూ
2014-07-05
ఒక రసాయన ఇంజనీరు నుండి ఇస్లామీయ పండితుడిగా మారిన స్వీయ జీవిత ప్రయాణంపై షేఖ్ డాక్టర్ యాసిర్ ఖాదీతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. సృష్టికర్తతో గట్టి సంబంధం కలిగి ఉండే దిశలో నడుస్తున్న ఆయన జీవితం నుండి మరియు జీవితంపై ఆయనకున్న పాజిటివ్ దృక్పథం నుండి మీరు కూడా కొన్ని పాఠాలు నేర్చుకోండి. ఈ ఇంటర్వ్యూను ఇంగ్లండులోని ఇస్లాం ఛానెల్ కోసం సాజిద్ వర్దా నిర్వహించారు.
జుమా ఖుత్బాలోని దీవెనలు మరియు శుభాలు
2014-07-05
జుమా ఖుత్బాలోని దీవెనలు మరియు శుభాల గురించి ఈ ఖుత్బా ప్రసంగంలో వివరించబడింది. ఎలా అల్లాహ్ మనకు ఇంతటి గొప్ప దినాన్ని ప్రసాదించాడు. ఈ రోజు జరిగే గొప్ప ఘటనలు మరియు శుక్రవారం వారంలోని మొత్తం దినాలన్నింటిలో ఉత్తమమైన దినం.
నిర్మలమైన ప్రశాంత హృదయం - చిహ్నాలు, కారణాలు మరియు కఠిన హృదయ చికిత్సలు
2014-07-05
చాలా అరుదుగా చర్చించబడే ఈ ముఖ్యాంశంపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం ఇది. మీ హృదయ కోరికలకు ప్రశాంతత చేకూరింది. మీ హృదయం పరిశుద్ధమైంది మరియు సృష్టికర్తకు సమర్పించుకోవడంలోని మాధుర్యాన్ని చవి చూసింది. మీ హృదయానికి అవసరమైన ఆరోగ్య పరీక్ష చేయండి. స్వర్గ ప్రయాణానికి మీ హృదయం తయారుగా ఉందా లేదా అనేది పరీక్షించండి. ఆ రోజు మీ సంపద మరియు మీ సంతానం ఎందుకూ పనికి రాదు. పరిశుద్థమైన హృదయం మాత్రమే ఆ రోజున మీకు సహాయపడుతుంది. ఖుర్ఆన్ 26:88-89
కఠిన కసాయి మనస్సు - దాని చిహ్నాలు, కారణాలు మరియు వైద్యం
2014-07-05
బలమైన ఈమాన్ యొక్క చిహ్నాలలో ఒకటి ఏమిటంటే అతడు మెత్తటి మరియు పరిశుద్ధమైన మనస్సు కలిగి ఉంటాడు. అలాగే బలహీనమైన ఈమాన్ యొక్క చిహ్నాలలో ఒకటి ఏమిటంటే అతడు కఠిన మనస్సు కలిగి ఉంటాడు. హృదయం అనేది మన అధ్యాత్మికత మరియు అల్లాహ్ తో కలిగి ఉండవలసిన గట్టి సంబంధంలో ఒక ముఖ్యమైన అవయవం. కఠిన హృదయం యొక్క చిహ్నాలు ఏమిటి, మన హృదయాన్ని కఠినంగా మార్చే కారణాలు ఏవి, కఠిన హృదయాలకు మనం ఎలా చికిత్స చేయగలం మరియు వాటిని మెత్తటి హృదయాలుగా ఎలా మార్చగలం. .. మొదలైన ముఖ్యాంశాలపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సూరహ్ హుజురాత్ పై వివరణాత్మక ఖుత్బా
2014-07-05
డాక్టర్ షేఖ్ యాసిర్ ఖాదీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహాయంతో జుమా ఖుత్బహ్ లో సూరహ్ హుజురాత్ ఆధారంగా ఖుత్బా ఇచ్చినారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాుహు అలైహి వసల్లం యొక్క ఉత్తమ నడవడిక మరియు ఉత్తమ లక్షణాలను ఈ సూరహ్ వివరిస్తున్నది.
ఖుర్ఆన్ లోని అతి చిన్న అధ్యాయమైన సూరతుల్ కౌథర్ యొక్క సంక్షిప్త సారాంశం
2014-07-05
ఖుర్ఆన్ లోని అతి చిన్న అధ్యాయం - సూరహ్ అల్ కౌథర్. కానీ దీనిలో ఎంత శక్తివంతమైన దీవెనలు ఉన్నాయంటే, దీనిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మొత్తం విశ్వం మరియు అందులోని ప్రతిదాని కంటే ఎక్కువగా ఇష్టపడే వారు.
Go to the Top