వీడియోల ప్రదర్శన ( 101 - 125 మొత్తం నుండి: 689 )
ఒక స్వచ్ఛమైన ముస్లిం
2014-07-26
నిజమైన, నిజాయితీపరుడైన మరియు స్వచ్ఛమైన ముస్లిం గురించి షేఖ్ బిలాల్ అసద్ వివరిస్తున్న చాలా ముఖ్యమైన ఉపన్యాసం. ప్రతి ముస్లిం తప్పకుండా నిజమైన ముస్లింగా మారాలి. నిజమైన, ప్రామాణిక ఇస్లామీయ బోధనలను మాత్రమే అనుసరించమని ఇస్లాం ధర్మం మనల్ని ఆదేశిస్తున్నది.
కోరికల నుండి ఉపవాసం పాటించుట
2014-07-26
తమ కోరికల నుండి ఉపవాసం పాటించడం అనే ఈ ఉపన్యాసం చాలా ఆసక్తికరమైనది. ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఉపవాసం యొక్క ప్రయోజనాలు, ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో కోరికలు మరియు ఉపవాసాల మధ్య సంబంధం
మన తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ మనపై చూపిన అనుగ్రహం
2014-07-26
తల్లిదండ్రుల హక్కులు మరియు బాధ్యత గురించి వివరించే ఒక గొప్చప మరియు ముఖ్యమైన ఉపన్యాసం. వయసు మళ్ళిన వారితో మనం ఎంత ఉత్తమంగా ప్రవర్తించాలో ఇది తెలుపుతున్నది. మన తల్లిదండ్రులకు విధేయత చూపటం మరియు స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నించడం ప్రతి ముస్లిం తప్పనిసరిగా చేయవలసిన పనులు. ఈ బంధుత్వాలు పరస్పరం ప్రేమానురాగాలు ఇచ్చిపుచ్చుకునే అన్యోన్య బంధుత్వాలు. ఒకవైపు వారి బాధ్యతలే మరో వైపు వారి హక్కులవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు - సంతానం సంబంధంలో తల్లిదండ్రుల హక్కులు పిల్లల బాధ్యత, కర్తవ్యాలుగా మారతాయి అలాగే పిల్లల హక్కులు తల్లిదండ్రుల కర్తవ్యాలుగా మారతాయి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దయాగుణం
2014-07-26
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దయాగుణాన్ని వివరించే గొప్ప చర్చ. ఆయన దయాగుణంలో మానవులందరినీ అధిగమించారు. అదే సమయంలో ఆయన ధైర్యం మరియు సాహసం చూపడంలో కూడా. ఆయన అత్యంత దయార్ద్రహృదయుడు మరియు మానవుల ఏ కొద్ది అమానషత్వం ఆయన దృష్టిలో పడినా, వెంటనే ఆయన కళ్ళు నీళ్ళతో నిండిపోయేవి.
సహనం
2014-07-26
షేఖ్ బిలాల్ అసద్ ఇచ్చిన ఒక గొప్ప ప్రసంగం. సహనం యొక్క ప్రాధాన్యత మరియు దాని వాస్తవికత, వేర్వేరు రకాలు మరియు స్థాయిల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చక్కగా వివరించారు. చాలా ఆసక్తికరమైన చర్చ.
ప్రాణాలు తీసే దైవదూత
2014-07-26
ఈ ఉపన్యాసంలో ప్రాణాలు తీసే దైవదూత మలకుల్ మౌత్ గురించి షేఖ్ ఉమర్ చర్చించారు. ఇది మరణాన్ని గుర్తుకు తెస్తుంది మరియు దాని కోసం మనం ఎలా తయారు కావాలో తెలుపుతున్నది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.
అంతిమ సందేశం
2014-07-26
ఈ ఉపన్యాసంలో అంతిమ సందేశం యొక్క ప్రాధాన్యత, మన జీవితంలో మనం విధిగా, తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏమిటి, ఈ సందేశాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టగలం మరియు దీనిని ఇతరులకు ఎలా అందజేయగలం అనే ముఖ్య విషయాల గురించి షేఖ్ బిలాల్ అసద్ చర్చించారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు
2014-07-26
ఈ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన కొన్ని మహిమల గురించి షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ చర్చించారు. ఉదాహరణకు - ఖుర్ఆన్, చంద్రుడు రెండుగా చీలిపోవటం, మక్కా నుండి జెరుసలెంకు మరియు జెరుసలెం నుండి స్వర్గాలకు సాగిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దివ్యప్రయాణం మరియు ఇతర మహిమలు.
స్వర్గానికి దారి
2014-07-26
ఈ ఉపన్యాసంలో షేఖ్ ఉమర్ స్వర్గానికి దారి అనే అంశంపై చర్చించారు. ఇది స్వర్గానికి చేర్చే మార్గాన్ని మనకు గుర్తు చేస్తున్నది. ఒకవేళ ప్రజలు ఈ మార్గాన్ని అనుసరిస్తే అల్లాహ్ అనుజ్ఞతో వారు విజయవంతంగా స్వర్గానికి చేరుకోగలరు.
పశ్చాత్తాపం
2014-07-26
పశ్చాత్తాపం పై ఇదొక ముఖ్యమైన చర్చ. దీనిలో షేఖ్ ఉమర్ పశ్చాత్తాపం యొక్క ప్రాధాన్యత, దాని షరతులు, ప్రాక్టికల్ పద్ధతులు మరియు దానికి సంబంధించిన వివిధ నియమనిబంధనలు. తప్పకుండా చూడవలసిన చర్చ.
అంతిమ తీర్పుదినం నాడు ఏమి జరగబోతున్నది
2014-07-19
అంతిమ తీర్పుదినం నాడు ఏమి జరగబోతున్నది అనే ముఖ్యఅంశాన్ని షేఖ్ ఉమర్ సులైమాన్ చక్కగా వివరించారు.
ఇస్లాం అంటే ఏమిటి
2014-07-19
ఈ వీడియోలో ఇస్లాం అనే పదం యొక్క అర్థాన్ని షేక్ యూసుఫ్ ఎస్టేట్ చక్కగా వివరించారు.
ధర్మాలు, మతాలన్నీ ఒకటేనా
2014-07-19
ఈ వీడియోలో మొత్తం ధర్మాలు, మతాలన్నీ ఒక్కటే అని వాదించడం ఎందుకు సబబు కాదు అనే ముఖ్యవిషయం గురించి డాక్టర్ జాకిర్ నాయక్ వివరించారు.
ఇస్లాం ధర్మం మరియు ఉగ్రవాదం
2014-07-19
ఈ వీడియోలో ఇస్లాం ధర్మం మరియు ఉగ్రవాదాల మధ్య పోలిక ఉందా లేదా అనే విషయాన్ని యూసుఫ్ ఎస్టేట్ చర్చించారు.
నాస్తికత్వం మరియు అజ్ఞేయతావాదం
2014-07-19
ఈ భాగంలో నాస్తికత్వం మరియు దేవుడు ఉన్నాడో లేడో నిర్ధారించని అజ్ఞేయతావాద విశ్వాసంలోని వాస్తవాల గురించి డాక్టర్ బ్రౌన్ చర్చించారు.
పెద్ద ప్రశ్నలు
2014-07-19
ఈ వీడియోలో డాక్టర్ లారెన్స్ బ్రౌన్ మానవుల మెదడులో మెలిగే కొన్ని పెద్ద ప్రశ్నల గురించి చర్చించారు - నన్ను పుట్టించింది ఎవరు, నేనెందుకు ఇక్కడ ఉన్నాను, మంచి వ్యక్తిగా జీవిస్తే సరిపోతుందా, మనకు తోచిన విధంగా మనం దేవుడిని ఎందుకు ఆరాధించకూడదు...
డాక్టర్ లారెన్స్ బ్రౌన్ - ఇస్లాం వృత్తాంతం
2014-07-19
ఈ వీడియోలో తను ఎందుకు క్రైస్తవ ధర్మాన్ని తిరస్కరించాడు మరియు ఇస్లాం ధర్మాన్ని ఎందుకు స్వీకరించాడు అనే ప్రశ్నలకు డాక్టర్ లాహెన్స్ బ్రౌన్ ఇచ్చిన వివరణ ఉన్నది.
రమదాన్ శుభాలు
2014-07-17
రమదనాన్ నెల ఆరాధనల నెల. ఇస్లాం ధర్మం యొక్క మూల స్థంభాలలోని ఒక మూలస్థంభమైన రమదాన్ నెల ఉపవాసాన్ని పాటించుటంలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ దగ్గరవుతారు. ఈ ఉపవాసం పాటించకుండా ఒక వ్యక్తి యొక్క ఇస్లాం ధర్మం పరిపూర్ణం కాజాలదు. ఈ ఉపన్యాసంలో యాసిర్ ఖాదీ రమదాన్ శుభాల గురించి వివరించారు.
దివ్యఖుర్ఆన్ - చదవండి, దహనం చేయకండి
2014-07-17
ఈ వీడియోలో ముస్లింలకు ఖుర్ఆన్ ఎందుకు అంత ఇష్టమైనదో అబ్దుర్ రహీమ్ గ్రీన్ వివరించారు.
ఖుుర్ఆన్ సంకలనం
2014-07-17
ఈ వీడియోలో ఖుర్ఆన్ సంకలనం గురించి షేఖ్ యాసిర్ ఖాదీ వివరించారు
? ముస్లింల దృష్టిలో మరణం
2014-07-17
ముస్లింల దృష్టిలో మరణం గురించి ఉమర్ సులైమాన్ గారి క్లుప్తమైన వివరణ.
? మీకు స్వర్గం కావాలా
2014-07-17
మీకు నిజంగా స్వర్గం కావాలా ? ఉమర్ సులైమాన్ గారి చర్చ
డాక్టర్ లారెన్స్ బ్రౌన్ - నేనెలా ఇస్లాం ధర్మం స్వీకరించాను
2014-07-17
ఈ వీడియోలో డాక్టర్ బ్రౌన్ తను ఎలా ఇస్లాం ధర్మం స్వీకరించారో మరియు తనకు ఇస్లాం ధర్మం గురించి ఎలా తెలిసిందో చర్చించినారు. సత్యాన్వేషణలో ఆయన అనేక ధర్మాలను పరిశోధించారు మరియు ఇస్లాం ధర్మంపై ప్రచారంలో ఉన్న అనేక అపనిందలను పరిశీలించారు. తుదకు సత్యధర్మమైన ఇస్లాంను ఎంచుకున్నారు.
ఇస్లాం ధర్మంలోని ఆణిముత్యాలు - చిత్తశుద్ధి
2014-07-17
అమూల్యమైన ఆభరణాలలోని ఆణిముత్యాల వలే ఇస్లాం ధర్మంలో కూడా అనేక అందమైన ఆణిముత్యాలు ఉన్నాయి. వాటిలోని ఒక ఆణిముత్యం గురించి ఇక్కడ తెలుసుకుందాము. ఈ వీడియోలో షేఖ్ యూసుప్ ఎస్టేట్ చిత్తశుద్ధి గురించి చర్చించినారు.
ఇస్లాం ధర్మంలోని ఆణిముత్యాలు - హక్కులు
2014-07-17
అమూల్యమైన ఆభరణాలలోని ఆణిముత్యాల వలే ఇస్లాం ధర్మంలో కూడా అనేక అందమైన ఆణిముత్యాలు ఉన్నాయి. వాటిలోని ఒక ఆణిముత్యం గురించి ఇక్కడ తెలుసుకుందాము. ఈ వీడియోలో షేఖ్ యూసుప్ ఎస్టేట్ హక్కుల గురించి చర్చించినారు.
Go to the Top