వీడియోల ప్రదర్శన ( 26 - 50 మొత్తం నుండి: 689 )
ఇది కేవలం ఒక ధర్మం మాత్రమే కాదు
2014-08-10
ఇస్లాం ధర్మం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబడింది. ఇతర ధర్మాల, సిద్ధాంతాల ప్రజలు ఇస్లాం ధర్మం గురించి తరుచుగా అడిగే అనేక ప్రశ్నలకు ఇది సమాధానం ఇస్తున్నది.
హుదాను అడగండి - 11 అక్టోబర్ 2011
2014-08-09
ఈ భాగంలో డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ దర్శకుల వివిధ ప్రశ్నలకు జవాబులు ఇచ్చినారు.
హుదాను అడగండి - 15 జులై 2012
2014-08-09
ఈ భాగంలో డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ దర్శకుల వివిధ ప్రశ్నలకు జవాబులు ఇచ్చినారు.
రమదాన్ మాసం - అతి గొప్ప అవకాశం
2014-08-08
షేఖ్ మహ్మద్ మురాద్ ఇచ్చిన ఈ ఉపన్యాసం చాలా ఆసక్తికరమైనది. దీనిలో ఆయన రమదాన్ మాసం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించారు. రమదాన్ మాసంలోని సమయపాలన, అన్నపానీయాలలో హద్దుమీరి పోవటం, ఉపవాస సంకల్పం, ఉపవాస సమయంలో మరిచిపోయి ఏదైనా తినటం లేదా త్రాగటం, పగటి పూటంతా నిద్రపోతూ గడపడం మరియు పిల్లలను రమదాన్ మాస ఉపవాసాలు ఉండేట్లు శిక్షణ ఇవ్వడం. మొదలైన విషయాలు ఇందులో ఆయన చర్చించారు.
మాటల కంటే బిగ్గరగా ఆచరణలు పలుకుతాయి
2014-08-08
ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ - మాటల కంటే బిగ్గరగా ఆచరణలు పలుకుతాయి - అనే అంశంపై చర్చిస్తూ, ఏదైనా మాట్లాడే ముందు మంచిగా ఆలోచించాలని సలహా ఇస్తున్నారు. .. తప్పకుండా దీనిని చూడండి.
నేటి ముస్లిం సమాజ దయనీయ స్థితి
2014-08-08
ఈనాడు ముస్లిం సమాజం చాలా బలహీనంగా ఉన్నది. ఐకమత్యం లేదు. అన్ని వైపుల నుండి దాడులకు గురవుతున్నది. ఒకప్పుడు ఎంతో గొప్ప స్థితిలో ఉండి, ప్రపంచాన్ని శాసించిన ముస్లిం సమాజం, ఈనాడు ఇలాంటి దయనీయ పరిస్థితిలోనికి ఎందుకు దిగజారిపోయింది ? ఈ పరిస్థితిని మనం ఎలా సరిదిద్దగలం ? ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఈ విషయాలపై చర్చించినారు.
ముగ్గురు ప్రవక్తలు - సందేశం ఒక్కటే
2014-08-08
ప్రపంచం వైపు పంపబడిన చివరి ముగ్గురు ప్రవక్తల గురించి ఈ ఉపన్యాసంలో చర్చించబడింది. వారు ముగ్గురు ఎవరు? వారి ముగ్గురు వేర్వేరు సందేశాలు ఇచ్చారా లేక ఒకే సందేశం ఇచ్చారా ? వారు ముగ్గురూ ఒకే ధర్మాన్ని బోధించారా లేక వేర్వేరు ధర్మాలనా ? ఈనాడు ప్రపంచంలో మూడు ప్రధాన ఏకదైవారాధన ధర్మాలున్నాయి - అవి ఇస్లాం, క్రైస్తవ మతం మరియు యూద మతం. ఇవి మూడూ తమ తమ ప్రవక్తలను, సందేశహరులను నమ్ముతాయి - వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త ఈసా అలైహిస్సలాం మరియు ప్రవక్త మూసా అలైహిస్సలాం. ఈ ఉపన్యాసంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా మనం దృష్టి సారిస్తున్నాము.
? ఇస్లాం ధర్మం స్త్రీలను అణిచి వేస్తున్నదా
2014-08-07
అనేక మంది ప్రజల మనస్సులలో మరియు పలుకులలో మాటిమాటికీ వచ్చే "ఇస్లాం ధర్మం మహిళలను అణచి వేస్తున్నది" ఒక ముఖ్యమైన ప్రశ్నగురించి షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇక్కడ చర్చించినారు. వాస్తవానికి ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేయబడుతున్న ఒక అపనింద, ఒక అసత్య వాదన మరియు ఒక అభాండము. ఇది ఒక పచ్చి అబద్ధం మరియు అభాండమని గట్టిగా చెప్పడమే కాకుండా అసలు స్త్రీలను అణచి వేస్తున్న ప్రజలు, దేశాలు మరియు సిద్ధాంతాల గురించి ఆయన చక్కటి నిదర్శనాలతో చూపినారు. అసలు అణచివేత అంటే ఏమిటి, ఇస్లాం దాని గురించి ఏమి చెబుతున్నది అనేది కూడా వివరించారు. అభాండాలు వేయడంపై ఒక మంచి శిక్షణా వీడియో ఇది. దీనిని విన్న తర్వాత ఇతరులు అణచివేతగా భావిస్తున్న విషయాలలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్వేచ్ఛ గురించి ఆయన తెలిపినారు.
అపరిచితునికి శుభాకాంక్షలు తెలుపండి
2014-08-07
ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ అపరిచితునికి శుభాకాంక్షలు తెలుపండి అనే హదీథు గురించి చక్కగా వివరించారు. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, "ఇస్లాం ధర్మం అపరిచితునిగా మొదలైంది మరియు చివరిలో అపరిచితునిగా మరిలి పోతుంది. కాబట్టి అపరిచితునికి శుభాకాంక్షలు తెలుపండి".
ఇస్లాం ధర్మం - అపార్థాలకు, అపనిందలకు గురైన ధర్మం
2014-08-07
ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ప్రజలలో అనేక మంది అపార్థం చేసుకుంటున్న ఇస్లాం ధర్మం గురించి చర్చించారు - అసలు అల్లాహ్ ఎవరు, ఇస్లాం ధర్మం అంటే ఏమిటి, ముహమ్మద్ ఎవరు ... మొదలైన విషయాలను ఆయన చాలా చక్కగా వివరించారు. ముగింపులో ఆయన శ్రోతల ప్రశ్నలకు జవాబు ఇచ్చినారు.
ఇస్లాం మరియు ప్రస్తుత సంక్షభం
2014-08-07
ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు ఉన్న సంక్షోభ పరిస్థితి గురించి షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఈ ఉపన్యాసంలో చర్చించారు.
పాశ్చాత్య దేశాలలో జీవించడం
2014-08-07
ఈ ఉపన్యాసంలో అబ్దుల్ రహీం గ్రీన్ పాశ్చాత్య దేశాలలో ఎలా జీవించాలనే అంశంపై చర్చించారు.
ఇస్లాం ధర్మంలోని అద్బుతాలు మరియు సౌందర్యాలు
2014-08-07
మీ ధర్మప్రచార అమ్ముల పొదిలో చేరగలిగే అర్హత గల మరో మంచి బాణం. ముస్లిమేతరుల సమావేశంలో అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇస్లాం ధర్మంలోని సౌందర్యం మరియు అద్భుతాల గురించి చాలా చక్కగా వివరించారు.
తరుచుగా నిర్లక్ష్యం చేయబడే ఘోరపాపాలు
2014-08-07
మనమందరమూ పాపాలు చేస్తూనే ఉంటాము. అయితే తమకు తెలియకుండా ఘోరమైన పాపాలు చేసేవారు ఎందరు ? ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ కొన్ని ఘోరపాపాల గురించి మనకు వివరిస్తున్నారు. వాటిలో సరైన జ్ఞానం లేకుండా అల్లాహ్ గురించి మరియు ఆయన ధర్మం గురించి మాట్లాడటం కూడా ఒకటి. ఇది షిర్క్ కంటే ఘోరమైన పాపమని కొందరు పండితుల అభిప్రాయం. ఈ అభిప్రాయం వెనుకనున్న కారణాలను షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ చర్చించారు. తరుచుగా నిర్లక్ష్యం చేయబడే ఇతర ఘోరపాపాలలో అహంకారం, గర్వం, దైవవిశ్వాసులకు విరుద్ధంగా అవిశ్వాసులకు సహాయం చేయడం, మ్యాజిక్ మరియు భవిష్యత్ గురించి జాతకం, సోది వంటివి చెప్పడం, షో ఆఫ్ మరియు ధర్మంలో నూతన కల్పితాలు మొదలైనవి కూడా ఉన్నాయి.
మర్యం కుమారుడైన జీసస్ అలైహిస్సలాం యొక్క స్వభావం
2014-08-07
పౌరాణిక మరియు చారిత్రక జీసస్ అలైహిస్సలాం గురించి అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇచ్చిన ఒక అద్భుత ఉపన్యాసం. ఎలా పౌరాణిక, కల్పిత జీసస్, ట్రినిటీ సిద్ధాంతాలు, ఒరిజినల్ పాపం మొదలైన విషయాలు ప్రచారంలోనికి వచ్చాయి మరియు తొలికాలపు క్రైస్తవులు ఎలా జీసస్ యొక్క మరణం మరియు పునరుత్థానం గురించి పట్టించుకోలేదు అనే వాటి గురించి కూడా వివరించారు. ఈ ఉపన్యాసంలో పేర్కొన్న సమాచారం ఎక్కువగా క్రైస్తవ పండితుల నుండి మరియు చరిత్రకారుల నుండి సేకరించబడింది.
జీసస్ గురించిన సత్యం
2014-08-07
ముస్లింలు మరియు క్రైస్తవులు ఎంతో గౌరవించే మహాపురుషుడు జీసస్. షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ అనేక సంవత్సరాలుగా జీసస్ గురించి అసలు సత్యం ఏమిటి అనే విషయంపై క్షుణ్ణంగా పరిశోధించారు. ఈ ప్రజెంటేషన్ లో ఆయన చాలా చక్కగా జీసస్ గురించి ప్రచారంలో ఉన్న అనేక అపోహలను, అపార్థాలను స్పష్టంగా వివరించారు.
ముస్లింల సామర్ధ్యం
2014-08-07
ముస్లింల సామర్ధ్యం గురించి చక్కగా వివరించబడింది.
అల్బేనియన్ మరియు బోస్నియన్ ముస్లింలు ప్రజలను ఇస్లాం వైపు పిలుస్తున్నారు
2014-08-06
దీన్ షో నుండి ఒక ఆసక్తికరమైన కార్యక్రమం. దీనిలో అల్బేనియన్లు మరియు బోస్నియన్లు తెలుసుకోవలసిన కొన్ని ధర్మప్రచార పాఠాలను షేఖ్ ష్పెండిమ్ నద్జాకూ పేర్కొన్నారు. నేషనాలిటీ లేదా ధర్మానికి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదని ఆయన స్పష్టం చేసినారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ధర్మప్రచారంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆయన స్పష్టం చేసినారు.
జీసస్ అలైహిస్సలాంను తప్పుగా ప్రస్తావించుట
2014-08-06
దివ్యగ్రంథాలనే మార్చివేసిన పాపాత్ములు - పాఠకులు ఎన్నడూ దానిని తెలుసుకోలేరు
ఒకవేళ మీ ఉద్దేశ్యాన్ని లేబుల్ ప్రదర్శిస్తున్నట్లయితే, దానిని ధరించండి
2014-08-06
ఈ భాగంలో డాక్టర్ జాకిర్ నాయక్ ఒకవేళ లేబుల్ మీ ఉద్దేశ్యాన్ని చూపుతున్నట్లయితే, దానిని ధరించండి అనే అంశంపై చర్చిస్తూ, ముస్లింలు తమ ధర్మాచరణలు వీలయినంత ఉత్తమంగా ఆచరించాలనే పిలుపు ఇచ్చారు.
వివిధ ధార్మిక గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన
2014-08-06
బైబిల్, తౌరాహ్ మొదలైన వివిధ ప్రపంచ ధర్మ గ్రంథాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏమంటున్నాయి ? - ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి హిందూ ధర్మ గ్రంథాలలో ప్రస్తావించబడిందా ? బైబిల్ లో ఎక్కడ ముహమ్మద్ పేరు ఉన్నది ? ఈ ప్రశ్నలకు డాక్టర్ జాకిర్ నాయక్ గారి ఈ ప్రసంగంలో జవాబు లభిస్తుంది. వివిధ ప్రపంచ మత గ్రంథాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన గురించి ఆయన ఇక్కడ వివరంగా చర్చించారు.
ఇస్లాం ధర్మం పరిష్కారమే గాని సమస్య కాదు
2014-08-06
ఈ భాగంలో డాక్టర్ జాకిర్ నాయక్ ఇస్లాం ధర్మం పరిష్కరిస్తుందే గానీ సమస్యలను పెంచదు అనే ముఖ్య విషయాన్ని వివరించారు. దీనిలో ఆయన ఇస్లాం నిర్వచనం మరియు బోధనలు, సన్మార్గంలో నడిచిన పుణ్యపురుషుల మార్గంలో నడవమని ముస్లింల కొరకు మరియు ముస్లిమేతరుల కొరకు సందేశం .
సైన్సు వెలుగులో ఖుర్ఆన్ మరియు బైబిల్
2014-08-06
ఈ భాగంలో డాక్టర్ జాకిర్ నాయక్ మరియు ఇతర ఇస్లామీయ పండితులు సైన్సు వెలుగులో ఖుర్ఆన్ మరియు బైబిలు గురించి వివరించారు. పఠనం, చరిత్ర, అర్థం చేసుకోవడం మరియు ఆచరరించడం మొదలైన వాటితో సంబంధం ఉన్న విద్య ఉలూమ్ అల్ ఖుర్ఆన్ అంటే ఖుర్ఆన్ విజ్ఞాన శాస్త్రం. ఇస్లామీయ విద్య చాలా విస్తారమైనది. ఎవరైనా దాని ప్రాధాన్యత గుర్తించగలరు.
ముస్లిం మహిళలకు సలహాలు
2014-08-05
షేఖ్ ఖాలిద్ యాసిన్ ఇచ్చిన చాలా ఆసక్తికరమైన ఉపన్యాసం. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఆయన ముస్లిం మహిళలకు అనేక సలహాలు ఇచ్చినారు.
పాశ్చాత్య దేశాలలో ఇస్లామీయ ధర్మప్రచారం
2014-08-05
పాశ్చాత్య దేశాలలో నివశించే ముస్లింల కోసం ఈరోజుల్లో ధర్మప్రచారం యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకీ పెరిగి పోతున్నది. ఇస్లాం మరియు ముస్లింలపై జరుగుతున్న అసత్య ప్రచారంలోని వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి, మన ఇస్లామీయ జ్ఞానం పెంచుకోవలసిన సమయం వచ్చేసింది. తద్వారా ప్రజలలోని అపోహలను, అపార్థాలను దూరం చేసేందుకు ప్రయత్నించగలం - వారు మన ఇరుగు పొరుగు వారైనా, సహోద్యుగులైనా లేక తోటి విద్యార్థులైనా. ఈ ఉపన్యాసంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ ధర్మప్రచారంలోని అనేక ముఖ్యాంశాలు మరియు ధర్మప్రచారంలో ఎదురయ్యే వివిధ సందర్భాల గురించి చర్చించారు.
Go to the Top