ఒకచోట చేరి సామూహికంగా ఖుర్ఆన్ పఠనం చేయడం, మరణించిన వారికి దాని పుణ్యం అందజేయమని ప్రార్థించడం మరియు మీలాదున్నబీ పండుగ జరుపుకోవడం

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: ఒకచోట చేరి సామూహికంగా ఖుర్ఆన్ పఠనం చేయడం, మరణించిన వారికి దాని పుణ్యం అందజేయమని ప్రార్థించడం మరియు మీలాదున్నబీ పండుగ జరుపుకోవడం
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు మా పరిచయంలోని దాదాపు 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట చేరి, ప్రతి ఒక్కరూ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖుర్ఆన్ భాగాలు పఠిస్తూ, మొత్తం ఖుర్ఆన్ పఠనాన్ని ఒకటిన్నర లేదా రెండు గంటలలో పూర్తి చేస్తాము. తద్వారా మాలోని ప్రతి ఒక్కరూ ఇన్ షాఅ అల్లాహ్ ఒకసారి మొత్తం ఖుర్ఆన్ పఠనం పూర్తి చేసినట్లవుతుందని చెప్పబడింది. అది కరక్టేనా ? ఆ తర్వాత మేమందరూ సామూహికంగా దుఆ చేస్తాము మరియు చనిపోయిన మరియు జీవించిన ఉన్న విశ్వాసులందరికీ దాని పుణ్యాలు ప్రసాదించమని మేము అల్లాహ్ ను వేడుకుంటాము. అయితే ఆ పుణ్యాలు చనిపోయిన వారికి అందుతాయా ? అందుతాయనే వాదనకు ఆధారంగా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ పలుకులను ప్రస్తావిస్తారు, "ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత, మూడు మార్గాలలో తప్ప అతడికి చేరే పుణ్యాలన్నీ ఆగిపోతాయి - కొనసాగుతున్న అతడి దానధర్మాలు, ప్రయోజనకరమైన జ్ఞానం మరియు అతడి కోసం ప్రార్థించే మంచి సంతానం." మీలాదున్నబీ దినమున వారు రిబాత్ అంటే జాగరణ చేస్తారు. అది ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 3 గంటల వరకు సాగుతుంది. తమను క్షమించమని అల్లాహ్ ను ప్రార్థిస్తారు, అల్లాహ్ ను స్తుతిస్తారు, తస్బీహ్ మరియు తక్బీర్ ధ్యానం చేస్తారు, నిశ్శబ్దంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక దరూద్ లు పంపుతారు, ఖుర్ఆన్ పఠిస్తారు, కొందరు మహిళలు ఆరోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ ఆరాధనలన్నింటి కోసం ఆ రోజును ప్రత్యేకించడం బిదఅ అంటే నూతన కల్పితం క్రిందికి పరిగణించబడదా ? కొందరు ప్రజలు సుహూర్ సమయంలో చేసే సుదీర్ఘమైన దుఆలు కూడా చేస్తారు. దానిని దుఆ అల్ రాబితహ్ అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడంతో మొదలై, ఆయన సహచరులపై మరియు ఇతర ప్రవక్తలపై, ఆయన భార్యలపై, ఆయన మహిళా సహచరులపై, ఖుల్ఫాయే రాషిదీన్ పై, తాబయీన్ లపై మరియు ఔలియాలపై పేరు పేరునా దీవెనలు పంపడంతో అది పూర్తవుతుంది. ఇలా చేయడం ద్వారా మా దుఆలు మేము పేర్కొంటున వారందరికీ పేరు పేరునా చేరతాయా ? ఇలా దుఆ చేయడం బిదఅ అంటే నూతన కల్పితం కాదా ? నాకు అది బిదఅ చర్య అనిపిస్తున్నది. అయితే, చాలా మంది సోదరీమణులు నాతో ఏకీభవించుట లేదు. ఒకవేళ నా అభిప్రాయం తప్పైతే, అల్లాహ్ నన్ను శిక్షిస్తాడా ? ఒకవేళ నా అభిప్రాయం సరైనదైతే, నేను వారిని ఎలా ఒప్పించాలి ? ఈ ఆలోచన నన్ను నిద్రపోనివ్వడం లేదు. ధర్మంలో కనపెట్టబడే ప్రతి నూతన కల్పితం మార్గభ్రష్టత్వం వైపుకు తీసుకు పోతుంది, ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్ని వైపుకు తీసుకుపోతుంది అనే హదీథు పలుకులు జ్ఞాపకం రాగానే నా బాధ మరింతగా పెరిగి పోతున్నది.
చేర్చబడిన తేదీ: 2014-08-09
షార్ట్ లింకు: http://IslamHouse.com/722318
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Reading Qur’aan together, giving good deeds to the dead, and al-Mawlid al-Nabawi (celebrating the birthday of the Prophet (peace and blessings of Allaah be upon him))
223.3 KB
: Reading Qur’aan together, giving good deeds to the dead, and al-Mawlid al-Nabawi (celebrating the birthday of the Prophet (peace and blessings of Allaah be upon him)).pdf
2.
Reading Qur’aan together, giving good deeds to the dead, and al-Mawlid al-Nabawi (celebrating the birthday of the Prophet (peace and blessings of Allaah be upon him))
2.1 MB
: Reading Qur’aan together, giving good deeds to the dead, and al-Mawlid al-Nabawi (celebrating the birthday of the Prophet (peace and blessings of Allaah be upon him)).doc
Go to the Top