నవముస్లిం మార్గదర్శిని
విషయపు వివరణ
పేరు: నవముస్లిం మార్గదర్శిని
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: అల్లాహ్ వద్దకు చేర్చే సన్మార్గం కనుగొన్న ప్రతి నవముస్లిం కొరకు ఇది ఒక గొప్ప కానుక. వారి విశ్వాసాన్ని మరింత బలర్చుకోవడానికి మరియు భద్రంగా కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆడియోలలో ముస్లింగా మారటం వలన లభించే ప్రతిఫలం, ఇస్లాం ధర్మం యొక్క ఉత్తమమైన విశేషతలు మరియు ఇస్లాం ధర్మంలోని ముఖ్యమైన విషయాన్నింటినీ షేఖ్ ఫహద్ సాలెమ్ బహమ్మమ్ ఇక్కడ చర్చించారు. ఒకరి దైవవిశ్వాసం ఆధారంగా చేసుకోవలసిన అర్కాన్ అల్ ఈమాన్ అంటే దైవ విశ్వాసపు మూలసిద్ధాంతాలు మరియు అవయవాల ఉత్తమమైన ఆచరణలు (ఆరాధనలు) మరియు హృదయాల ఉత్తమమైన ఆచరణలు (తౌహీద్ అనే ఏకదైవత్వ సిద్ధాంతం) కలిగి ఉన్న అర్కాన్ అల్ ఇస్లాం అంటే ఇస్లాం మూల సిద్ధాంతాలను ఆయన చక్కగా వివరించారు. ఇస్లాం ధర్మం ఒక సామాజిక ధర్మం అయినందున, చిన్నా లేక పెద్ద, ముస్లిం లేక ముస్లిమేతరులు మొదలైన సమాజంలోని ప్రతి ఒక్కరితో ఒక ముస్లిం ఎలా ప్రవర్తించాలి, షేఖ్ ఫహద్ వివరించారు. తర్వాత ఆయన అనుమతించబడిన మరియు నిషేధించబడిన కొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. అలాగే ఒకరి ఈమాన్ అంటే దైవవిశ్వాసాన్ని పెంచే మరియు అల్లాహ్ ఆజ్ఞలను పాటించడంలో సహాయపడే అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. అల్లాహ్ మార్గంలో అడ్డుపడే (కామం, అత్యాశ, దురాశ, అపోహలు మరియు అజ్ఞానం వంటి) కొన్ని ఆటంకాలను కూడా ఆయన పేర్కొన్నారు. అంతేగాక ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఒక వ్యక్తి తన సృష్టికర్త వద్ద మనస్పూర్తిగా పశ్చాత్తాప పడేందుకు అవసరమైన వాటిని చూపారు. చివరిగా, నవముస్లిం కొరకు ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు.
చేర్చబడిన తేదీ: 2014-07-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/716768
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది