కపటుల లక్షణాలు
విషయపు వివరణ
పేరు: కపటుల లక్షణాలు
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: ఇబ్నె ఖయ్యుం అల్ జూజీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: అష్షంఖితి అనుబంధం (appendix) నుండి షేఖుల్ ఇస్లాం ఇబ్నె అల్ ఖయ్యిమ్ అల్ జౌజియ్యహ్ దీనిని తయారు చేసారు. అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో కపటుల కుతంత్రాలను స్పష్టంగా తెలిపినాడు. విశ్వాసులు కపటుల బారి పడకుండా తమను తాము కాపాడుకోవడానికి వారి కపట విశ్వాసాలు, వారి లక్షణాలు, వారి లక్ష్యాలను సవివరంగా పేర్కొన్నాడు. అల్లాహ్ సూరహ్ అల్ బఖరహ్ లో మానవజాతిని మూడు భాగాలలో విభజించినాడు: విశ్వాసులు, అవిశ్వాసులు మరియు కపటులు. విశ్వాసుల గురించి నాలుగు వచనాలలో, అవిశ్వాసుల గురించి రెండు వచనాలలో మరియు కపటుల గురించి పదమూడు వచనాలలో వివరించినాడు. దీని ద్వారా కపటులు ఇస్లాం ధర్మానికి ఎంత తీవ్రమైన హాని కలుగుజేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారో అర్థం అవుతున్నది. వారి ద్వారా జరిగే హాని చాలా తీవ్రమైంది ఎందుకంటే వారు ముస్లింల వలే ప్రవర్తిస్తూ, ఇస్లాం ధర్మానికి సహాయపడుతున్నట్లుగా మరియు సమర్ధిస్తున్నట్లుగా నటిస్తారు. వాస్తవానికి వారు ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువులు మరియు దానిని సర్వనాశనం చేసే అవకాశం కోసం కాచుకుని కూర్చుని ఉంటారు. లోలోపల ఇస్లామీయ సమాజంలో అరాచకత్వాన్ని మరియు అజ్ఞానాన్ని వ్యాపింపజేస్తూ ఉంటారు. వారు పాటిస్తున్నదే సరైన ఇస్లాం ధర్మమని అమాయకులను మోసగిస్తూ, దారి తప్పించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/645940
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది