ఇస్లామిక్ ఫైండర్ వెబ్సైటు - www.islamicfinder.com
విషయపు వివరణ
పేరు: ఇస్లామిక్ ఫైండర్ వెబ్సైటు - www.islamicfinder.com
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: http://www.islamicfinder.com
సంక్షిప్త వివరణ: ఇది ఇంటర్నెట్ ద్వారా ఇస్లాం ధర్మానికి సేవలు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్న ఒక NGO సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో ఉన్న మస్జిదుల, ఇస్లామీయ సంస్థల, ఇస్లామీయ కేంద్రాల మరియు ముస్లింల వ్యాపారాల సమాచారాన్ని ఈ వెబ్సైటు ప్రజలకు అందజేస్తున్నది. ఒకవేళ మీ ప్రాంతంలోని పై సంస్థల సమాచారం వెబ్సైటులో లేకపోతే, మీరు దానిని వెబ్సైటుకు పంపగలరు. అంతేగాక ఈ వెబ్సైటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 మిలియన్ల పట్టణాల నమాజు సమయాలను, అక్కడి నుండి ఖిబ్లా దిశను, కాబాగృహం దూరాన్ని, లాంగిట్యూడ్ మరియు లాటిట్యూడులను ఖచ్చితంగా తెలుపుతున్నది. అంతేగాక ఖుర్ఆన్, హదీథ్, ఫిఖ్ మరియు ఫత్వాలు, విద్య, ముస్లిం కుటుంబం, ఇస్లామీయ చరిత్ర మరియు బయోగ్రఫీ, ఆరోగ్యం మరియు ఇస్లామీయ ఔషధం, ఆర్థిక వ్యవస్థ మరియు వ్యాపార లావాదేవీలు మొదలైన ఇస్లాం ధర్మ ఆవశ్యక విషయాలన్నీ తెలిపే ఒక ఇస్లామీయ వెబ్ డైరక్టరీ కూడా ఇందులో ఉన్నది. ఈ వెబ్సైటు అందిస్తున్న మరో గొప్ప సేవ ఏమిటంటే అది హిజ్రీ క్యాలెండరు మరియు గ్రిగోరియన్ - హిజ్రీ తేదీల మార్పు. ఈ వెబ్సైటు ముస్లిం సమాజానికి అందజేస్తున్న మరో గొప్ప సేవ ఏమిటంటే మీ కంప్యూటర్ ద్వారా ప్రతి రోజూ ఐదు సార్లు అదాన్ పలుకులు వినిపింపజేసే అదాన్ సాప్ట్ వేర్. పైన పేర్కొన్న ఉచిత సేవలతో పాటు, వివిధ అంశాలపై వ్యాసాలు, వేల కొద్దీ ఫోటీలు కలిగిన ఇస్లామీయ ఫోటో గ్యాలరీ, చిత్రాలు, ఈద్ కార్డులు ఇక్కడ ఉన్నాయి. వీటిని సందర్శకులు ఇతరులకు కూడా పంపవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజానికి ఉపయోగపడే వివిధ వెబ్సైట్లు తయారు చేసే ఆలోచనతో ఉన్న వసత్ అల్ నసీజ్ ఇన్సిష్టిట్యూషన్ (Wasat Alnaseej Institution) వారిచే ఇది తయారు చేయబడింది.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/641993