ఇస్లామిక్ ఆన్ లైన్ యూనివర్శిటీ www.islamiconlineuniversity.com
విషయపు వివరణ
పేరు: ఇస్లామిక్ ఆన్ లైన్ యూనివర్శిటీ www.islamiconlineuniversity.com
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: http://www.islamiconlineuniversity.com
సంక్షిప్త వివరణ: డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ యొక్క సరికొత్త ఆలోచన ది ఇస్లామిక్ ఆన్ లైన్ యూనివర్శిటీ (The Islamic Online University - iou). ఎలాంటి బోధనా రుసుము లేకుండా ఉచితంగా ఆన్ లైనులో ఇంటెన్సివ్ (intensive), అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేటు ఇస్లామీయ కోర్సులను ప్రజలకు అందజేయాలనే ఆయన ప్రయత్నమే ఈ యూనివర్శిటీ. దీని ఫౌండర్ మరియు డీన్ డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్. ఇది 2007లో అసలు ఎలాంటి ఫీజులు చెల్లించే షరతు లేకుండా పూర్తి ఉచిత డిప్లొమా కోర్సులను అందజేస్తూ ఖతర్ దేశం నుండి ప్రారంభమైంది. అల్హందులిల్లాహ్ మేము 2007లో 1,500 విద్యార్థులతో ప్రారంభించినా, 2008 సంవత్సరం చివరికి 4,500 సంఖ్య చేరుకున్నారు. ఇప్పుడు ఇందులో అల్లాహ్ దయవలన 177 దేశాల నుండి దాదాపు 30,000 విద్యార్థులు ఉన్నారు. 2010లో ది ఇస్లామిక్ ఆన్ లైన్ యూనివర్శిటీ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఎలాంటి ట్యూషన్ ఫీజులు లేకుండా పూర్తి ఉచితంగా BAIS (Bachelor of Arts in Islamic Studies) కోర్సు ప్రారంభించింది. విద్యార్జనలో అన్ని ఆటంకాలు తొలగించే ఈ అద్భుత ప్రయత్నం, ప్రపంచ వ్యాప్తంగా ఉనికిలో ఉన్న ఇంటర్నెట్ మరియు అడ్యాన్సుడు ఓపెన్ సోర్సు ఆన్ లైన్ లెర్నింగ్ టెక్నాలజీలను వాడుకుంటూ తక్కువ ఖర్చుతో యూనివర్శిటీ స్థాయి ఇస్లామీయ విద్యను కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ సౌలభ్యం ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులోనికి తీసుకు వచ్చింది. ఆ విధంగా iou లో ఇప్పుడు రెండు వేర్వారు కాంపస్ లు ఉన్నాయి - డిగ్రీ కాంపస్ మరియు డిప్లొమా కాంపస్. ప్రతి కాంపస్ కు ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ సర్వర్ ఉన్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/639705