అల్ హుస్సైనీ అల్ అజాజీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: అల్ హుస్సైనీ అల్ అజాజీ
సంక్షిప్త వివరణ: ఆయన పూర్తి పేరు అల్ హుస్సైనీ అల్ సయ్యద్ అలీ అబ్దుల్ గనీ అల్ అజాజీ. ఈజిప్టు దేశస్థులు. 1956వ సంవత్సరం డిసెంబరు 5వ తేదీన జన్మించారు. 1986 - 1987 వ సంవత్సరంలో జామియ అజ్ హర్ అష్షరీఫ్ నుండి ఖిరాత్ విభాగంలో ఖిరాత్ స్పెషలైజేషన్ తో ఉన్నత విద్యాఖ్యాసం పూర్తి చేసారు. అష్షాతబీ పద్ధతిలో ఖిరఆత్ అల్ అష్రరహ్ లో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అష్షాతబీ పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అత్తయ్యబహ్ (అల్ ఖస్ర్ ఫీ అల్ ముంఫసల్) పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో కూడా యోగ్యులయ్యారు. చిన్న పిల్లలకు ఖుర్ఆన్ బోధించే ఉపాధ్యాయుల కోసం మంచి పుస్తకం వ్రాసినారు. ముస్హఫ్ మురత్తిల్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ బిల్ తూసత్ ఫీ అల్ ముంఫసల్ రచించారు. వర్ష్ అన్ నాఫియీ పద్ధతిలో ముస్హఫ్ రచించారు. మజ్ద్ ఛానెల్ కోసం ఖుర్ఆన్ సిడీ తయారు చేసారు. ఖుర్ఆన్ కరీమ్ ఎలా బోదించాలి అనే అంశంపై పుస్తకం వ్రాసినారు. తిలావత్ నియమ నిబంధనల గురించి పుస్తకం వ్రాసారు. అలాగే తజ్వీద్ నియమనిబంధనల గురించి కూడా పుస్తకం వ్రాసినారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731369
Go to the Top