హదీథ్ శాస్త్రపరిచయం

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: హదీథ్ శాస్త్రపరిచయం
భాష: తెలుగు
సంక్షిప్త వివరణ: హదీథ్ అంటే ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లమ్)యొక్క ఆదేశాలు, ఆచరణలు, వారు అనుమతించిన పద్ధతులు మరియు వారి వ్యక్తిగత ప్రవర్తన కు సంబంధించిన విషయాలు.
చేర్చబడిన తేదీ: 2007-04-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/6508
వివరణాత్మక వర్ణన

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

హదీథ్  శాస్త్రపరిచయం - మొదటిభాగం
 



1. హదీథ్ నిర్వచనం

హదీథ్ అంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క ఆదేశాలు, ఆచరణలు, వారు అనుమతించిన పద్ధతులు మరియు వారి వ్యక్తిగత ప్రవర్తన కు సంబంధించిన విషయాలు.

నిర్వచనం యొక్క వివరణ

A) ఆదేశాలు- ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లమ్)తన మాటల ద్వారా ప్రజలను ఆజ్ఞాపించినవి.
ఉదాహరణ-ఉమర్ బిన్ ఖత్తాబ్(రదియల్లాహు అన్హు)ఇలా చెప్పారు - ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లమ్)ఇలా చెబుతుండగా నేను విన్నాను "చేసిన పనులకు లభించబోయే ప్రతిఫలం పూర్తిగా సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. మరియు ప్రతి మనిషి అతడి సంకల్పాన్ననుసరించి ప్రతిఫలం పొందుతాడు. కాబట్టి ఎవరైతే ప్రాపంచిక ప్రయోజనాల కోసం లేదా స్త్రీని పెళ్ళాడడం కోసం వలస వెళ్తారో అతడి వలస కేవలం దాని కోసమే అవుతుంది." ..............సహీబుఖారి హదీథ్ గ్రంథం

B) ఆచరణలు- ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)స్వయంగా అచరించి, ప్రజలకు చూపినవి.
ఉదాహరణ - ప్రవక్త భార్య ఆయేషా (రదియల్లాహు అన్ హా)ఇష్టానుసారంగా ఉండే నఫిల్ (తప్పనిసరి కాని) ఉపవాసాల ఆచరణ పద్ధతి గురించి వివరిస్తూ ఇలా చెప్పారు "ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఒక్కోసారి ఇక ఉపవాసాలు ఆపరు అనుకునేటంత తరచుగా ఉపవాసాలుండేవారు మరియు ఇంకోసారి ఇక ఉపవాసాలుండరు అనుకునేటంత ఎక్కువకాలం ఉపవాసం నిలిపేసేవారు" ........................సహీబుఖారి & సహీముస్లిం హదీథ్ గ్రంథాలు
C)అనుమతించిన పనులు- ప్రవక్త ముహమ్మద్ )సల్లల్లాహు అలైహి వసల్లం(ఆమోదించిన సహచరుల ఆచరణలు.
ఉదాహరణ-అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ )రదియల్లాహు అన్ హుమా(ఇలా తెలిపారు - "అల్ అహ్జాబ్ యుద్ధం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు బనుఖురైదా (మదీనా దగ్గరి ఒక ప్రాంతం) చేరుకుని మాత్రమే అసర్ నమాజ్ పూర్తిచేయమని ఆదేశించారు. కొంతమంది సహచరులు బనుఖురైదా లోనే అసర్ నమాజ్ పూర్తిచేసారు. కాని కొంతమంది నిర్ణీత సమయం దాటిపోతున్నదనే భయంతో బనుఖురైదా చేరక ముందే దారిలోనే అసర్ నమాజ్ పూర్తిచేసారు. ప్రవక్త ముహమ్మద్ )సల్లల్లాహు అలైహి వసల్లం( సహచరులు పాటించిన ఈ రెండు విభిన్న పద్ధతులలో దేనినీ తప్పు పట్టలేదు." ...సహీ బుఖారి & సహీ ముస్లిం హదీథ్ గ్రంథాలు

D)ప్రవర్తన- ప్రవక్త ముహమ్మద్సల్లల్లాహు అలైహి వసల్లంయొక్క భౌతికలక్షణాలు, గుణగణాలు మరియు వ్యక్తిగత స్వభావపు విషయాలు.
ఉదాహరణ - “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడు ఎక్కువగా దయ చూపేవారు మరియు రమదాన్ నెలలో వారిలో దయాగుణం మరీ ఎక్కువగా ఉండేది.” ............సహీ బుఖారి & సహీ ముస్లిం హదీథ్ గ్రంథాలు.

2. హదీథ్మరియుసున్నత్లమధ్యఉన్నభేదం.
శాస్త్రీయపరంగా హదీథ్ మరియు సున్నత్ ల మధ్య ఎటువంటి తేడా లేదు. కాని తర్కశాస్త్రనియమాలు మరియుసిద్ధాంతాల (ఫిఖ్) దృష్టిలో మాత్రమే అవి వేర్వేరుగా నిర్వచించబడినాయి. కాబట్టి తర్కశాస్త్రనియమాల ప్రకారం హదీథ్అంటేప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలు, ఆచరణలు మరియు వారి అనుమతులు మాత్రమే. మరియు సున్నత్ అంటేముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క ఆదేశాలు, ఆచరణలు, అనుమతులతో పాటు వారి భౌతికలక్షణాలు & శీలస్వభావం నిర్వచనంలో ఉంటాయి
సున్నత్ లను కూడా అనుసరించిన వారికి ఎక్కవ పుణ్యం లభిస్తుంది. ఒకవేళ ఏదైనా కారణం వలన సున్నత్ లను ఆచరించకపోతే ఎటువంటి శిక్ష పడదు.
3. ఇస్లాంధర్మసూత్రాలకు 2వమూలంహదీథ్&సున్నత్లు.

ఇస్లాం ధర్మసూత్రాల మొదటిమూలం దివ్యఖుర్ఆన్. హదీథ్ & సున్నత్ లు ధర్మసూత్రాలకు 2వమూలం. అంతే కాకుండా దివ్యఖుర్ఆన్ కు వివరణ కూడా.
అల్లాహ్ ఆజ్ఞలు దివ్యఖుర్ఆన్ లో కొన్నచోట్ల సామాన్య విషయాలుగా కనబడవచ్చు (ఉదాహరణ-"మరియు క్రమబద్ధంగా నమాజును స్థాపించండి") నమాజును క్రమబద్ధంగా ఎలా పాటించాలి? అనే విషయం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) జీవనవిధానాన్ని గమనిస్తేనే మనకు తెలుస్తుంది. ప్రతి ముస్లిం నియమిత సమయాలలో ప్రతిరోజూ ఐదు సార్లు క్రమపద్ధతిలో నమాజు చేయాలనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి, దివ్యఖుర్ఆన్ లోని నమాజును స్థాపించండి అనే అల్లాహ్ ఆజ్ఞను పూర్తిచేసే పద్ధతి చూపెట్టినారు. అంటే ఖుర్ఆన్ లోని ఆదేశాల స్పష్టమైన వివరణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితవిధానం నుండి లభిస్తుంది.


4. దివ్యఖుర్ఆన్ & సున్నత్ ల నుండి సాక్ష్యం.

దివ్యఖుర్ఆన్ 5:92 లోఅల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు "..అల్లాహ్ మాటను మరియు ఆయన (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్) మాటను వినండి. వాటిని (సారాయి, జూదం, దైవేతరమందిరాలు, పాచికల ద్వారా జోస్యం) మానుకోండి. కాని మీరు గనుక ఆజ్ఞలను పాలించకపోతే, బాగా తెలుసుకోండి, మా ప్రవక్తపై ఉన్న బాధ్యత కేవలం ఆజ్ఞలను స్పష్టంగా అందచేయటమే"

మరోచోట దివ్యఖుర్ఆన్ 16:44 లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు - "....పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. ఇప్పుడు ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్)ను నీ(ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్)పై అవతరింప జేశాము, ప్రజల ముందు వారికోసం అవరింపజేయబడిన ఉపదేశాన్ని నీవు స్పష్టంగా వివరించటానికి, (స్వయంగా) ప్రజలు కూడా ఆలోచించటానికి"


ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా ప్రకటించారు -
"నా పద్ధతిని మరియు సరైన దారిచూపబడిన, వివేకవంతమైన ఖలీఫాల (ప్రవక్త తర్వాత వచ్చిన సహచర నాయకులు) పద్ధతిని అనుసరించండి.గట్టిగా పట్టుకోండి మరియు పళ్ళతో నొక్కి పట్టుకోండి, మరియు (ఇస్లాంలో) క్రొత్తపద్ధతులను బహిష్కరించండి. ఎందుకంటే ప్రతి క్రొత్తపద్ధతి (ఇస్లాంలో) నూతన కల్పనలకు దారితీస్తుంది మరియు ప్రతి కల్పిత విషయం (ఇస్లాం నుండి) పెడదారి పట్టిస్తుంది" .......అబుదావూద్ & తిర్మిజీ హదీథ్ గ్రంథాలు

ఇంకోసారి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లమ్) ఇలా ప్రకటించారు- "అత్యంత ఉత్తమమైన వచనాలు - అల్లాహ్ యొక్క వచనాలు (దివ్యఖుర్ఆన్) మరియు అత్యంత ఉత్తమమైన ఆచరణ మార్గం - ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క మార్గం మరియు అత్యంత చెడ్డవిషయాలు క్రొత్త పద్ధతులు అంటే (ఇస్లాంలో) నూతన కల్పితాలు కనుక్కోవటం"
సహీ ముస్లిం హదీథ్ గ్రంథం

5. హదీథ్ విజ్ఞానశాస్త్రం (హదీథ్ ముస్తలహ్)

అస్సనద్(ఉల్లేఖకుల పరంపర) మరియు అల్ మతన్(అసలు విషయం) ను గుర్తించడానికి అవసరమైన నియమనిబంధనలున్న శాస్త్రాన్నే హదీథ్ ముస్తలహ్ అంటే హదీథ్ విజ్ఞానశాస్త్రం అంటారు.

అస్సనద్(ఉల్లేఖకుల పరంపర): హదీథ్ ను రికార్డు చేసిన గ్రంథకర్త (బుఖారీ, ముస్లిం, తిర్మీజీ, అబుదావుద్..) నుండి క్రమపద్ధతిలో ఒక్కొక్కరిగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) వరకు హదీథ్ ను ఉల్లేఖించిన వారందరి పేర్లు (వారి వివరాలు& నిబంధనలు)

అల్ మతన్: హదీథ్ లోని అసలు విషయం.

ఉదాహరణ: సహీముస్లిం హదీథ్ గ్రంథంలోని ఒక హదీథ్ లో ఇలా రికార్డు చేయబడినది - ముహమ్మద్ బిన్ ఉబైద్ మాకు తెలిపారు, అబు అవానాహ్ మాకు తెలిపారు , అబి హుసైన్ ద్వారా, అబి సాలెహ్ ద్వారా, అబిహురైరా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు - ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఒకసారి ఇలా ప్రకటించారు "ఎవరైతే కావాలని నాకు అవిధేయుడిగా ఉంటాడో, అతడి స్థానం నరకాగ్నియే"

పై హదీథ్ లోని అల్ మతన్ - "ఎవరైతే కావాలని నాకు అవిధేయుడిగా ఉంటాడో, అతడి స్థానం నరకాగ్నియే"

పై హదీథ్ లోని సనద్-
సహీ ముస్లిం అనే సుప్రసిద్ధ హదీథ్ గ్రంథం
ముహమ్మద్ బిన్ ఉబైద్
అబుఅవానాహ్
అబిహుసైన్
అబి సాలెహ్
అబి హురైరా(రదియల్లాహు అన్హు)
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్)


6. హదీథ్ విజ్ఞానశాస్త్ర ముఖ్యలక్ష్యం
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) హదీథ్ లను అసలైన రూపంలో ఎటువంటి కల్పితాలకు, (మార్పులు/చేర్పులకు) తావివ్వకుండా భద్రపరచడం.

7. హదీథ్ విజ్ఞానశాస్త్రం కేవలం ముస్లింల ప్రత్యేకత
హదీథ్ ఉల్లేఖనల ప్రామాణికత ఒకరి తర్వాత మరొకరుగా, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) వరకు చేరటం, అంతే కాకుండా ఉల్లేఖించిన వారి గుణశీలాల గురించిన విశ్వసనీయమైన సమాచారం కూడా భద్రపరచటమనేది ముస్లింలలో తప్ప మరే జాతిలోనూ, ఏ కాలంలోనూ, ఏ ఇతర మతాల మూల ప్రతులలో మరియు గ్రంథాలలో కనబడని ఒక ప్రత్యేకమైన విజ్ఞానశాస్త్రం. ఇంకా సనద్ అంటే ఉల్లేఖకుల పరంపర గురించి ప్రశ్నించటం గాని, వారి గుణశీలాల గురించి పరిశీలించటం మరియు పరిశోధించడం గాని చేయకుండానే ఇతర మతగ్రంథాలు మరియు చారిత్రక గ్రంథాలు తిన్నగా కేవలం ఉల్లేఖకుల ప్రకటనల పైనే ఆధారపడి ఉన్నాయి,


ప్రశ్నలు
1.హదీథ్ అంటే ఏమిటో ఉదాహరణలతో నిర్వచించండి
2.ఇస్లాం ధర్మసూత్రాలకు మొదటి మాలం ఏది?
3.ఇస్లాం ధర్మసూత్రాలకు రెండవ మాలం ఏది? దాని ప్రాముఖ్యతను వివరించండి.
4.అల్లాహ్ మాటను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటను మాత్రమే అనుసరించాలని మరియు సరైన దారిలో నడపబడిన ఖలీఫాల పద్ధతినే పాటించాలనే ఆజ్ఞలను నిరూపించండి?
5.అత్యంత ఉత్తమమైన వచనాలు, అత్యంత ఉత్తమమైన ఆచరణ మార్గం మరియు అత్యంత చెడ్డ విషయాలేవి?
6.హదీథ్ విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి? హదీథ్ విజ్ఞానశాస్త్రపు లక్ష్యం ఏమిటి?
7.అస్సనద్ మరియు అల్ మతన్ అంటే ఏమిటి?ఉదాహరణతో వ్రాయండి
8.హదీథ్ విజ్ఞానశాస్త్రం కేవలం ముస్లింల ప్రత్యేకత - వివరించండి
9.సహాబాలంటే ఎవరు? వారి పేరు వచ్చినప్పుడు ఏమని పలకాలి? ఎవరైనా ఐదుగురు సహాబాల పేర్లు వ్రాయండి.

Go to the Top