حول الموقع

ذيل الصفحات البطاقة التعريفية
العنوان: حول الموقع
اللغة: تلغو
تأريخ الإضافة: 2011-06-25
الرابط المختصر: http://IslamHouse.com/354732
- هذه البطاقة مترجمة باللغات التالية: تلغو
نبذة موسعة

ప్రాథమిక సమాచారం

 

స్థాపితం

1422-02-01 || 2001-04-24

స్థానం

Riyadh, Saudi Arabia పోస్టు బాక్సు నెం: 29465, రియాద్ 11457

వివరం

80 కంటే ఎక్కువ భాషలలో ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేస్తున్న దారుస్సలాం బృందం యొక్క వెబ్ సైటు IslamHouse.com

సంస్థ గురించి స్థూలంగా

రబ్వహ్ జాలియాత్, రియాద్ లోని ధర్మ ప్రచార కార్యక్రమాలలో దారుస్సలాంకు చెందిన IslamHouse.com వెబ్ సైటు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించినది. ఈ కార్యాలయం సజ్జనుల స్వచ్ఛమైన ప్రయత్నాలు మరియు శ్రమలతో నిండిన దానధర్మాలపై ఆధారపడి ఉంది. ఈ కార్యాలయాన్ని 28/8/1414h తేదీన గౌరవనీయులైన సౌదీ అరేబియా మాజీ ప్రధాన న్యాయమూర్తి షేఖ్ అల్లామహ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్, రహిమహుల్లాహ్ ప్రారంభించారు. ఇస్లామీయ ధార్మిక విషయం, ధర్మాదాయం మరియు ధర్మప్రచారాల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో ఈ కార్యాలయం నడుస్తున్నది.

సాధారణ సమాచారం

ప్రధాన లక్ష్యం:
IslamHouse.com
వెబ్ సైటు ముఖ్యలక్ష్యం - వివిధ భాషలలో ముస్లిమేతరులకు ఇస్లాం మరియు దాని ఔన్నత్యాలను పరిచయం చేయటం, ఇస్లాం గురించి ప్రజలలో ఉన్న అపార్థాలను, అపోహలను తొలగించటం మరియు ఇస్లాం గురించి ప్రజలలో ఉన్న అనుమానాలను సుస్పష్టమైన నిదర్శనాలతో దూరం చేయటం.
ఇంకా తమ విశ్వాసంలో మరియు ఆరాధనలలో ఖుర్ఆన్ మరియు సున్నతులను, సహాబాల (అల్లాహ్ వారిని ఇష్టపడు గాక) మరియు ముందుతరం ఉత్తముల నుండి లభించిన స్వచ్ఛమైన ధర్మజ్ఞానాన్ని అనుసరించ వలసిన ఆవశ్యకతను ముస్లింలకు తెలియజేయటం.

ఈ లక్ష్యాన్ని ఎలా సాధించాలి:
[1]
వివిధ భాషలలో సముచితమైన ధర్మజ్ఞాన అంశాలను ఎంచుకోవటం మరియు వాటిని తయారు చేయటం.
[2]
వివిధ భాషలలో IslamHouse.com వెబ్ సైటు కొరకు ప్రత్యేక విషయాల తయారీ ప్రణాళికలు వేయటం, రూపొందించటం మరియు నిరంతరం వాటిని అభివృద్ధి చేయటం.
[3]
ఇస్లామీయ పుస్తకాలు రచించడం మరియు అరబీ నుండి ఇస్లాంహౌస్ వెబ్సైటులోని ఇతర భాషలలోనికి ఇస్లామీయ విషయాలను అనువదించటం దీని కొరకు ఆయా భాగాల బాధ్యతలు చూస్తున్నవారిని సంప్రదించటం.

మా ఆశయాలు:
1 –
ఇంటర్నెట్ సౌకర్యాన్ని అత్యుత్తమంగా వాడుకుంటూ, ఇతరులను ఇస్లాం వైపు ఆహ్వానించటం మరియు మొత్తం ప్రపంచంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న భాషలన్నింటిలో ఇస్లామీయ సందేశాన్ని మానవులందరికీ అందజేయటం.
2 –
ఇస్లాం యొక్క స్పష్టమైన మరియు నిజమైన సందేశాన్ని అందజేయటం. ఇస్లాం అంటే గిట్టని వారు, ఇస్లాంకు వ్యతిరేకంగా చేస్తున్న అసత్య ప్రచారాలను సరిదిద్ది, ప్రజలలో వ్యాపింపజేస్తున్న అపోహలను దూరం చేయటం.
3 –
ముస్లిం సమాజ పరిచయ కార్యాలయాల కృషి సౌదీ అరేబియా పరిధి లోపలే పరిమితం కాకుండా, ప్రపంచ నలుమూలలలో వ్యాపించేటట్లు చేయటం.
4 –
సౌదీ అరేబియాలోని ఇస్లామీయ ధర్మప్రచార కార్యాలయాలన్నింటి మధ్య, క్రింద పేర్కొనబడిన వివిధ ధర్మప్రచార కార్యక్రమాలలో సహకారాన్ని పెంపొందించటం.
ఇస్లామీయ అంశాల అనువాదం.
భాషాపరంగా మరియు ప్రామాణికత పరంగా ఇస్లామీయ పుస్తకాల విషయాలను సరిదిద్దడం.
పునరావృత్తి జరగకుండా ఆపడానికి, తప్పులను కనిపెట్టడానికి మరియు సరిదిద్దడానికి భాషలన్నింటిలో ప్రస్తుతం జరుగుతున్న పనిని నిశితంగా పరిశీలించడం.
5 –
సముచితమైన ఇస్లామీయ విషయాలను, రాబోయే తరాల కొరకు ఇన్షా అల్లాహ్ ఇంటర్నెట్ పై వ్యాపింపజేయటం మరియు కాపాడటం కొరకు ధర్మప్రచార కేంద్రాల ప్రచురణలను, ఆడియో మరియు వీడియోలను పున:పరిశీలించటం.

అవార్డులు

తన గమనంలో ఇప్పటి వరకు ఇస్లాం హౌస్ బృందానికి అల్లాహ్ దయ వలన నాలుగు బహుమానాలు లభించినవి, అవి:
1
మరియు 2: వరుసగా 2006 మరియు 2007 సంవత్సరాలలో రెండు సార్లు, సౌదీ అరేబియాలోని మినిష్టిరీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని ఎలక్ట్రానిక్ కల్చర్ విభాగం నుండి డిజిటల్ ఎక్సలెన్సు అవార్డు లభించింది.
3 – 2007
వ సంత్సరంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ సమ్మిట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ నుండి ఎలక్ట్రానిక్ కల్చర్ విభాగంలో వరల్డ్ సమ్మిట్ అవార్డుల నుండి అరబ్ కంట్రీస్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల స్థాయిలో, అథ్ థికర్ అల్ ఖాస్ అవార్డు లభించింది.
4 –
షరిఅహ్ మరియు ఇస్లామీయ ధర్మం గురించి తను చేసిన వలంటరీ పనికి గాను 2010లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్సులో షార్జా అవార్డు లభించింది.

Go to the Top