పోష్టర్లపై పునర్విమర్శ ( 51 - 75 మొత్తం నుండి: 77 )
ఫజ్ర్ మరియు అస్ర్ నమాజుల విలువ
(ఇంగ్లీష్)
2014-06-07
ఈ కరపత్రంలో ప్రజలు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్న ఫజ్ర్ మరియు అస్ర్ నమాజుల విలువ గురించి ప్రస్తావించబడింది.
మీ మనస్సులో ఒక్కసారి తొంగి చూసుకున్నారా ?
(ఇంగ్లీష్)
2014-06-07
మీ మానసిక పరిస్థితిని ఒక్కసారి స్వయంగా పరిశీలించుకున్నారా? దానిలోని మంచి - చెడులపై సమీక్ష చేసుకున్నారా ? దానిలోని ఏకదైవత్వం మరియు బహుదైవత్వాలపై ఎప్పుడైనా దృష్టి సారించారా ? దానిలోని కృతజ్ఞత మరియు కృతఘ్నతలు మీ దృష్టికి వచ్చాయా ? దానిలోని దైవ భయభక్తులు మరియు దైవ తిరస్కణలపై ఎప్పుడైనా ఆలోచించారా ? ఇంకా ఇలాంటి అనేక ఆత్మ పరిశీలన అంశాలు ఈ కరపత్రంలో ప్రస్తావించబడినాయి.
మంత్రవిద్యలు మరియు చేతబడులు
(ఇంగ్లీష్)
2014-06-07
జాదు, మంత్రవిద్యలు మరియు చేతబడులపై ఇస్లాం ధర్మాదేశాలు ఏమిటి అనే ప్రశ్నకు షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ ఇచ్చిన జవాబు ఈ కరపత్రంలో ఉన్నది.
ముస్లింలు ఈష్టర్ మరియు క్రిష్టమస్ పండుగలు జరుపుకుంటారా ?
(ఇంగ్లీష్)
2014-06-07
అనేకమంది ప్రజలు ఈనాటి హద్దులు దాటిన వేడుకలు, వినోదాలు మరియు అనవసరం ఖర్చుల కాలంలో, హాలిడే సీజన్లనే వ్యాపకంలో చాలా సులభంగా చిక్కిపోతున్నారు. వీటి ప్రాధాన్యతను గుర్తించి ఈ మితిమీరిన వినోద కార్యక్రమాలను కట్టడి చేసే ప్రయత్నం జరగటం లేదు. నేను ఇలా ఎందుకు చెబుతున్నానంటే హాలిడే అనే పదం అసలు హోలీ మరియు డే అనే రెండు పదాల కలయిక నుండి పుట్టింది. అయితే లోతుగా పరిశోధిస్తే యూద, క్రైస్తవ మరియు ఇస్లామీయ దృష్టికోణంలో, ఈ పర్వదినాలు చాలా పవిత్ర దినాలని గుర్తిస్తారు. ఈష్టర్, క్రిష్టమస్, ఆల్ సెయింట్స్ డే, హాల్లోయీన్ మొదలైన వాటి మూలాలు ప్రవక్తలకు విరుద్ధమైన బహుదైవారాధ సంప్రదాయాలలో కనబడతాయి. దీని సాక్ష్యాధారాలు పరిశీలిస్తే, చరిత్రలో ఎన్నడూ ఏ ప్రవక్తా తమ పుట్టినరోజు పండుగ జరుపుకోవడం, గ్రుడ్లను అలంకరించడం, చెట్లపై ఆభరణాలు ఉంచడం లేదా ఆకర్షణీయమైన దుస్తులలో అలంకరించుకోడం మొదలైనవి చేయలేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ హాలిడే కథలన్నీ ధర్మంలో చేర్చబడిన నూతన పోకడలు, కల్పితాలు తప్ప మరేమీ కావని తెలుస్తుంది. ఇలాంటి తప్పుడు సంప్రదాయాలలో మునిగి సర్వలోక సృష్టికర్త ఆగ్రహానికి గురి కావద్దని మరియు వాటి చెడు పర్యవసానాల నుండి కాపాడుకోమని ఈ చిరు కరపత్రం హెచ్చరిస్తున్నది.
అల్లాహ్ మీతో ఉన్నాడనే విషయం మరిచిపోయినప్పుడే మీపై ఒంటరితనం ఆవరిస్తుంది
(ఇంగ్లీష్)
2014-06-07
అల్లాహ్ ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఆయన మీరు చేసే ప్రతి పనీ కనిపెడుతున్నాడు అనే ఆలోచన ద్వారా మనం పాపాలకు దూరంగా ఉండి, నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా, ఆత్మహత్య చేసుకోకుండా అసలైన జీవితం గడపగలం.
నేనొక ముస్లింను - నేను జీసస్ మరియు ముహమ్మద్ లంటే నాకెంతో ప్రేమ
(ఇంగ్లీష్)
2014-06-07
నేనొక ముస్లింను - నేను జీసస్ (ఈసా అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలను ఎంతో ప్రేమిస్తాను, గౌరవిస్తాను, అభిమానిస్తాను.
ఇస్లాం గురించి - ఒక సంక్షిప్త పరిచయం
(ఇంగ్లీష్)
2014-06-07
ఇస్లాం ధర్మం గురించి పరిచయం చేస్తున్న ఒక సంక్షిప్త కరపత్రం ఇది. ఇస్లాం ధర్మ ఐదు మూలసిద్ధాంతాలు, ఇస్లాం ధర్మంలోని ఆరాధనలు మరియు వాటి అసలు ఉద్దేశం, ఇస్లాం ధర్మ విశ్వాసం యొక్క ఆరు మూలసిద్ధాంతాలు మొదలైన వాటిపై దృష్టి సారిస్తున్నది. చాలా సులభరీతిలో, చక్కటి పదాలలో పై విషయాలన్నీ దీనిలో ప్రస్తావించబడినాయి.
మరణం మరియు మరణానంతర జీవితం గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నది
(ఇంగ్లీష్)
2014-06-07
ఈ కరపత్రంలో మరణం మరియు మరణానంతర జీవితం గురించి చర్చించబడింది. స్వర్గనరకాల గురించి వివరిస్తున్న కొన్ని ఖుర్ఆన్ వచనాలను, ఈ ప్రాపంచిక జీవిత ముఖ్యోద్దేశం మరియు మరణం ఎంతో దూరం లేదు అనే యథార్థం విషయాలు ఇది ప్రస్తావిస్తున్నది. తీర్పుదినంనాడు తూచబడే పాపపుణ్యాల లెక్కల గురించి ధృవీకరిస్తున్నది.
ఇస్లాం ధర్మం ఒక తీవ్రవాద మతం కాదు
(ఇంగ్లీష్)
2014-06-07
ఇస్లాం ధర్మం దృష్టిలో తీవ్రవాదం అంటే ఏమిటి, ఎలా కొందరు ప్రజలు కొన్ని ఖుర్ఆన్ వచనాలను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మొదలైన విషయాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, యుద్ధం అనివార్యం అయ్యే పరిస్థితులు ఏమిటి అనే విషయం గురించి కూడా చర్చిస్తున్నది.
ఇస్లాం ధర్మం గురించిన కొన్ని ప్రశ్నోత్తరాలు
(ఇంగ్లీష్)
2014-06-07
ఇస్లాం ధర్మం ప్రకారం అతి చెడ్డ పాపకార్యం ఏది, ఇస్లాం ధర్మంలో స్త్రీల స్థానం ఏమిటి, జిహాద్ గురించి ఇస్లాం ఏమి చెబుతున్నది, తీవ్రవాదంపై ఇస్లాం అభిప్రాయం ఏమిటి, ఈ జీవిత పరమార్థం గురించి ఇస్లాం ధర్మం ఏమి స్పష్టం చేస్తున్నది, ఇస్లాం ధర్మంలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) మరియు ఇతర ప్రవక్తల యొక్క ఉన్నత స్థానం, మరణానంతర జీవితం ... మొదలైన విషయాల గురించి ఈ కరపత్రం స్పష్టం చేస్తున్నది.
ఇస్లాం గురించి ప్రజలలో ఉన్న కొన్ని అపార్థాలు
(ఇంగ్లీష్)
2014-06-07
ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న కొన్ని అపార్థాలు మరియు వాటి సమాధానాలు ఈ కరపత్రంలో ఉన్నాయి. అవి ఏమిటంటే - ముస్లింలు ఒక క్రొత్త దైవాన్ని ఆరాధిస్తారు లేదా ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను దైవంగా ఆరాధిస్తారు, ఇస్లాం ధర్మం ఒక తీవ్రవాద ధర్మం, ముస్లింల స్త్రీలను హిజాబ్ కట్టుబాటు అణగద్రొక్కుతున్నది, తమకు ఇష్టం లేని వారితో పెళ్ళి చేసుకునేలా ఇస్లాం ధర్మం ముస్లిం స్త్రీలను బలవంతం చేస్తుంది, ప్రజలు ముస్లింలుగా మారాలని ఇస్లాం ధర్మం బలవంత పెడుతున్నది ....
ప్రవక్త ముహమ్మద్ - మీరు తప్పకుండా తెలుసుకోవలసిన మహాపురుషుడు
(ఇంగ్లీష్)
2014-06-07
అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రజలు తప్పకుండా తెలుసుకోవలసిన కొన్ని ప్రత్యేక గుణగణాలను ఈ కరపత్రం తెలుపుతున్నది. ఉదాహరణకు, ఆయన యొక్క దయాగుణం, సచ్ఛీలత, సహనం, క్షమాగుణం, అణుకువ, నమ్రత మరియు హుందాతనం.
ఇస్లాం ధర్మంలో ప్రవక్తత్వం
(ఇంగ్లీష్)
2014-06-07
అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.
ఇస్లాం ధర్మంలో సైన్సు
(ఇంగ్లీష్)
2014-06-07
అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ లో 1400 సంవత్సరాలకు పూర్వమే పేర్కొనబడిన కొన్ని సైంటిఫిక్ వాస్తవాల ద్వారా ఇస్లాం ధర్మం ఒక సత్యమైన ధర్మమని ఈ కరపత్రం నిరూపిస్తున్నది. వాటిలో కొన్ని - జీవితం ఎక్కడ మొదలైంది, మానవ పిండోత్పత్తి ప్రక్రియ, విశ్వం వ్యాపించడం మరియు భూమండలం బయటి నుండి ఇనుమును భూమిపైకి పంపడం మొదలైనవి.
బురఖా మరియు నిఖాబ్
(ఇంగ్లీష్)
2014-06-07
ప్రజలు బురఖా అంటే ఎందుకు భయపడతారు, ధర్మాచరణలు పాటించే స్వేచ్ఛ మరియు దానిని మాటలలో వ్యక్త పరచే స్వేచ్ఛ, వేర్వేరు ఇస్లామీయ దుస్తులు ... మొదలైన విషయాలను ఈ కరపత్రం స్పష్టంగా చర్చిస్తున్నది. అంతేగాక బురఖా మరియు నిఖాబ్ ల గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపార్థాలను కూడా ఖండిస్తున్నది.
ఇస్లాం ధర్మంలో దైవభావన
(ఇంగ్లీష్)
2014-06-06
ఇస్లాం ధర్మంలోని దైవభావన, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, ఆయనను డైరక్టుగా లేకుండా ఆరాధించాలి, మధ్యలో ఎలాంటి పూజారులు, ముజావర్లు ఉండరాదు, ప్రవక్తలందరూ కేవలం ఆయనను మాత్రమే ఆరాధించమని పిలిచారు, ఈ ప్రాపంచిక జీవిత పరమార్థం కేవలం అల్లాహ్ ను ఆరాధించబడమే, మొదలైన ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. ఇంకా, అసలు దేవుడు ఉన్నాడా మరియు ఆయన దేవుడు ఎవరు ? రెండు ముఖ్య ప్రశ్నలకు కూడా జవాబిస్తున్నది.
వడ్డీ వలన కలిగే అపాయాలు
(ఇంగ్లీష్)
2014-06-06
వడ్డీ కారణంగా మనపై వచ్చి పడే కొన్ని ఘోర కష్టాలు, వడ్డీ నిర్వచనం, ఇస్లాం ధర్మంలో వడ్డీ ఎందుకు నిషేధించబడింది, వడ్డీ నుండి ఎలా తప్పించుకోగలం, తద్వారా ఇహపరలోకాలలో ఎలా సాఫల్యం సాధించాలని - అనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది.
ఇస్లాం ధర్మం యొక్క ఐదు మూల సిద్ధాంతాలు
(ఇంగ్లీష్)
2014-06-06
సాక్ష్యప్రకటన, నమాజు, జకాతు, రమదాన్ పవిత్ర మాస ఉపవాసాలు మరియు హజ్ యాత్ర మొదలైన ఇస్లాం ధర్మం యొక్క ఐదు ప్రధాన మూల సిద్ధాంతాల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది.
హిజాబ్ - పరదా
(ఇంగ్లీష్)
2014-06-06
హిజాబ్ అనేది అల్లాహ్ కు చూపే విధేయతకు చిహ్నం, హిజాబ్ సిగ్గు, లజ్జ, సచ్ఛీలతలకు చిహ్నం, హిజాబ్ చెడు నుండి కాపాడే రక్షణ కవచం, హిజాబ్ హుందాతనం, హిజాబ్ గౌరవం మరియు హిజాబ్ ఆత్మవిశ్వాసం - మొదలైన ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది.
నమాజు ప్రాధాన్యత
(ఇంగ్లీష్)
2014-06-06
నమాజు యొక్క ప్రాధాన్యత, దాని ప్రయోజనాలు, ఇస్లాం ధర్మ మూలస్థంభం, దానిని నిర్లక్ష్యం చేసిన వారికి పడే కఠిన శిక్ష, ప్రజలు చూపే కొన్ని మామూలు సాకుల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది.
అల్లాహ్ యొక్క అనంత కారుణ్యం
(ఇంగ్లీష్)
2014-06-06
అల్లాహ్ యొక్క అనంత కారుణ్యం గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది. అల్లాహ్ యొక్క కారుణ్యానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు, సృష్టిపై ఆయన యొక్క దయాదాక్షిణ్యాలు మరియు మనపై అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఎలా పెంచుకోగలం అనే కొన్ని ముఖ్యాంశాల గురించి ఇది ప్రస్తావించింది.
ఖుర్ఆన్ - మానవజాతి కొరకు పంపబడిన అంతిమ దివ్యసందేశం
(ఇంగ్లీష్)
2014-06-06
ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.
జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించిన సత్యం
(ఇంగ్లీష్)
2014-06-06
ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించిన సత్యం ఏమిటి అనే ముఖ్యాంశాన్ని ఈ కరపత్రం చర్చిస్తున్నది. అనేక మంది ప్రజలు చెబుతున్నట్లుగా ఆయన దేవుడు కాడని, ఆయన అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త అని స్పష్టం చేస్తున్నది. ఆయన చూపిన కొన్ని మహిమలను పేర్కొంటూ, సిలువ పైకి ఎక్కిండంలో సత్యాసత్యాల గురించి ప్రస్తావించింది. చివరిగా ఆయన పునరాగమనం గురించి తెలుపుతున్నది.
షైతాను కుతంత్రాలు
(ఇంగ్లీష్)
2014-06-06
అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించకుండా దారి తప్పించే షైతాను పన్నాగాలు, ధర్మంలో నూతన కల్పితాలు, పాపకార్యాలు ఆకర్షణీయంగా కనబడేలా చేయడం మొదలైన షైతాను యొక్క కొన్ని ముఖ్య కుతంత్రాల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది. చివరిగా మనం షైతానును ఎలా ఓడించాలో సూచిస్తున్నది.
పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మన జీవిత పరమార్థం ఏమిటి ?
(ఇంగ్లీష్)
2014-06-06
మానవ జీవితపు కొన్ని పరమార్థాలను ఈ కరపత్రం చక్కగా వివరిస్తున్నది. ప్రారంభంలో, అల్లాహ్ నే ఎందుకు సర్వలోక సృష్టికర్త అని విశ్వసించాలనే దానికి కొన్ని జవాబులు ప్రస్తావించింది. తర్వాత, ఈ ప్రాపంచిక జీవితపు కొన్ని ముఖ్యోద్దేశాలన ప్రస్తావించింది.
Go to the Top