అబ్దుర్రషీద్ సూఫీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: అబ్దుర్రషీద్ సూఫీ
సంక్షిప్త వివరణ: ఆయన పూర్తి పేరు - అబ్దుర్రషీద్ బిన్ షేఖ్ అలీ సూఫీ. సోమాలియాలో 1964లో జన్మించారు. ఆయన తండ్రి సుప్రసిద్ధ ఇస్లామీయ పండితులైన అల్ షేఖ్ అలీ బిన్ అబ్దుర్రహ్మాన్ సూఫీ, ముఫ్తీ అల్ సోమాలియా. తమ దేశంలో తజ్వీద్ విద్యను వ్యాపింపజేసిన మొట్టమొదటి ఇస్లామీయ పండితులు. ఆయన వద్ద అనేక మంది పండితులు విద్యాభ్యాసం చేసినారు. ఆయన అనేక ఖుర్ఆన్ పాఠశాలలను, కేంద్రాలను స్థాపించారు. చివరికి అల్ మగ్దీషూలో ప్రసిద్ధ మస్జిదుకు ఆయన పేరు పెట్టబడింది. అంత ప్రసిద్ధ చెందిన తండ్రి వద్దనే ఆయన ఖుర్ఆన్ విద్యాభ్యాసం చేసినారు. ఆరంభంలో రోజువారీ హలఖాలలో, తర్వాత మస్జిదులో ఖుర్ఆన్ నేర్చుకుంటూ, పదవ ఏట ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసారు. తర్వాత తండ్రి వద్ద తజ్వీద్ విద్యను మరియు హఫ్స్ అన్ ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనాన్ని నేర్చుకున్నారు. తర్వాత అష్షాతబీ పద్ధతిలో ఖిరాత్ అస్సాబిఅ నేర్చుకున్నారు. అష్షరహ్ అష్షాతబీ ను తల్లి వద్ద నేర్చుకుని, కంఠస్థం చేసారు. ఆమె అల్ ఇమాం వలియల్లాహ్ అల్ ఖాసిమ్ బిన్ మీరహ్ అష్షాతబీ రహిమహుల్లాహ్ పద్ధతిలో ఖసీదహ్ అల్ అమ్మియహ్ ఫీ అల్ ఖిరాత్ లో ప్రావీణ్యం సంపాదించింది. 599హి లో చనిపోయారు. 1173హి లో ఆయన ఇంటి నుండి ఆయన తయారు చేసిన ఈ సాహిత్యం లభించింది. తండ్రి వద్దనే ఆయన నహూ మరియు ఫిఖ్ అల్ షాఫియీ నేర్చుకున్నారు. ఖుర్ఆన్ విద్యలను మరింతగా నేర్చుకునేందుకు 1981వ సంవత్సరం అక్టోబరులో ఈజిప్టు చేరుకున్నారు. అక్కడ మఆహద్ అల్ ఖిరాత్ లో చేరి, ఖిరాత్నా అల్ అష్రహ్ లో ప్రావీణ్యం సంపాదించారు. అడ్మినిష్ట్రేషన్ స్టడీస్ కూడా పూర్తి చేసారు. సుప్రసిద్ధ ఖారీ షేఖ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ అల్ హంజానీ రహిమహుల్లాహ్ వద్ద జామియ అజ్ హర్ లో చదువుకున్నారు మరియు ఆయన నుండి రెండు విధాలుగా ఖుర్ఆన్ పఠించే అనుమతి పొందారు. మొదటిది అష్షాతబీ మరియు అద్దుర్రహ్ పద్దతిలో ఖిరాత్ అష్రహ్, రెండవది ఇమాం అల్ జజ్రీ యొక్క అత్తయ్యిబహ్ పద్దతిలో ఖిరాత్ అల్ అష్ర్. ఇంకా మరిన్ని ఖుర్ఆన్ అంశాల గురించి మరియు ధర్మప్రచారం గురించి నేర్చుకున్నారు. తర్వాత సోమాలియా తిరిగి వచ్చి, తన తండ్రి అనారోగ్యానికి గురి కావడం వలన, ఆయన మస్జిద్ లో ఉపాధ్యాయుడిగా మరియు ఇమాం గా పనిచేయసాగారు. తర్వాత అక్కడి జామియ అజ్ హర్ బ్రాంచి అయిన అద్దిరాసతుల్ ఇస్లామీయలో బోధించసాగారు. అల్లాహ్ యొక్క అనుగ్రహంతో సోమాలియా మరియు ఖతర్ లలో అనేక మంది ఆయన వద్ద ఖుర్ఆన్ పారాయణం నేర్చుకున్నారు. 1991లో ఖతర్ దేశానికి చేరుకున్నారు. ఖతర్ దేశ ఇస్లామీయ మంత్రిత్వశాఖకు చెందిన దోహాలోని సెంట్రల్ మార్కెట్ లో ఉన్న జామియ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు మస్జిద్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేయసాగారు. అక్కడ అనేక ధర్మప్రచార కార్యక్రమాలలో, ఇస్లామీయ సెమినార్లలో పాల్గొన్నారు మరియు అనేక ప్రసంగాలు చేసారు. అనేక యూరోపు దేశాలలో జరిగిన ఇస్లామీయ కాన్ఫరెన్సులలో పాల్గొన్నారు. రెండు సార్లు బహ్రెయిన్ దేశానికి వెళ్ళి ఖుర్ఆన్ పఠనం రికార్డింగు పూర్తి చేయగా అది అల్ ఫజ్ర్ ద్వారా ప్రసారమైంది. ఆయన స్వంత వెబ్సైట్ www.abdulrashid.net
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731370
సంబంధిత విషయాలు ( 7 )
Go to the Top