ఖలీఫహ్ అత్తనీజీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: ఖలీఫహ్ అత్తనీజీ
సంక్షిప్త వివరణ: ఆయన పూర్తి పేరు ఖారీ ఖలీఫహ్ మిస్బహ్ అహ్మద్ అత్తనీజీ. మర్కజ్ అల్ జైద్ లి తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్లో 13 ఏళ్ళ వయస్సులో షేఖ్ గులామ్ హుస్సేన్ వద్ద ఖుర్ఆన్ కంఠస్థం చేసారు. తర్వాత మదీనా మునవ్వరహ్ లో మస్జిదె నబవీ ఇమాం అయిన షేఖ్ ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్ వద్ద హఫ్స్ అన్ ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పారాయణం నేర్చుకున్నారు. వర్ష్ మరియు ఖాలూన్ అన్ నాఫియి రివాయతులలో షేఖ్ డాక్టర్ ముహమ్మద్ అస్సామ్ అల్ ఖదాహ్ వద్ద ఖుర్ఆన్ పారాయణం నేర్చుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో ఆయన 2001లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూనివర్శిటీ నుండి పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం ఆయన యు.ఎ.ఇ లో పబ్లిక్ వర్క్స డిపార్ట్ మెంటులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. షారిఖహ్ లోని దాదాపు 9 వేల ఖుర్ఆన్ విద్యార్థినీ విద్యార్థులు ఉన్న ఖుర్ఆన్ మరియు సున్నతు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ మెంబరుగా ఉన్నారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731368
Go to the Top