ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్
సంక్షిప్త వివరణ: ఆయన పూర్తి పేరు ఇబ్రాహీమ్ బిన్ అల్ అఖ్దర్ అల ఖయ్యిమ్. సుప్రసిద్ధ ఖారీ మరియు ఇమాం. సౌదీ అరేబియా దేశస్థులు. మదీనా నగరంలో 1364హి సంవత్సరంలో జన్మించారు. దారుల్ హదీథ్, అన్నజాహ్ మొదలైన పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. తర్వాత మఆహద్ అల్ ఇల్మీ, అస్సనాయియహ్ మద్రసా లలో చదువు పూర్తి చేసారు. సుప్రసిద్ధ ఇస్లామీయ పండితుల వద్ద షేఖ్ ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్ ఖుర్ఆన్ పారాయణం నేర్చుకున్నారు - వారిలో కొందరు ఉమర్ అల్ హైదరీ, అహ్మద్ అల్ జియాత్, అబ్దుల్లాహ్ అల్ గనీమీ మొదలైన ఉపాధ్యాయుల వద్ద ఆయన ఖుర్ఆన్, ఫిఖ్, అఖీదహ్, షరిఅహ్ మరియు అరబీ భాషల విద్యాభ్యాసం చేసినారు. ఆ తర్వాత ఆయన ఇస్లామీయ స్టడీస్ ఉపాధ్యాయుడిగా అస్సనాయియహ్ లో, ఖుర్ఆన్ బోధకుడిగా మద్రసా అబీ బిన్ కఆబ్ లో, ఉప అధ్యాపకుడిగా జామియ ఇస్లామీయలో పని చేసారు. 1406హి సంవత్సరం నుండి దాదాపు 9 సంవత్సరాల పాటు ఆయన మస్జిదె నబవీలో ఇమాంగా సేవలందించారు. అంతేగాక అనేక తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ సంస్థలలో సభ్యుడిగా ఉన్నారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731253
సంబంధిత విషయాలు ( 9 )
Go to the Top