అబ్దుర్రహ్మాన్ బిన్ ముహమ్మద్ బిన్ ఖాసిమ్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: అబ్దుర్రహ్మాన్ బిన్ ముహమ్మద్ బిన్ ఖాసిమ్
సంక్షిప్త వివరణ: షేఖ్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఖాసిమ్ బిన్ ముహమ్మద్ బిన్ ఖాసిమ్ ఆశిమీ అనే ఈ ఇస్లామీయ పండితుడు నజ్ద్ ప్రాంతపు (నేటి రియాద్) ప్రఖ్యాత ఫహ్తాన్ తెగలోని ఆశిమ్ వంశానికి చెందిన వారు. వీరు 1312హిజ్రీ సంవత్సరం లో ఉత్తర రియాద్ లోని అల్ బీర్ అల్ గరియ అనే ప్రసిద్ధ ఊరిలో జన్మించారు. చిన్నతనంలోనే ఖుర్ఆన్ కంఠస్థం చేయటం మొదలుపెట్టి, అతి త్వరగా దానిని పూర్తి చేసినారు. దగ్గరలోని ఇస్లామీయ పండితుల దగ్గర విద్యనభ్యసిస్తూ, చివరికి రియాద్ పట్టణానికి చేరుకున్నారు. ఆ కాలంలో రియాద్ పట్టణంలో అనేక మంది విద్వాంసులు ఉండేవారు. అటువంటి ఉద్దంఢుల సమక్షంలో, ఆయన పూర్తి ఏకాగ్రతతో మరియు బాగా కష్టపడి విద్యనార్జించటం మొదలు పెట్టినారు. ఇంకా విద్యాభ్యాసంలోని మాధుర్యాన్ని మరియు తీపిదనాన్ని ఆస్వాదించసాగారు. పాఠాలను చదవటంలో, కంఠస్థం చేయటంలో, గ్రహించటంలో పూర్తిగా నిమగ్నమైపోయి, తన తోటి విద్యార్థులలో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉండేవారు. వారి ఉపాధ్యాయులలో ప్రఖ్యాతి చెందినవారు – షేఖ్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్లతీఫ్, షేఖ్ ఇబ్రాహీం బిన్ అబ్దుల్లతీఫ్, షేఖ్ హమద్ బిన్ ఫారిస్, షేఖ్ సఆద్ బిన్ హమద్ బిన్ అతీఖ్, షేఖ్ అబ్దుల్లాహ్ అంగరీ, షేఖ్ ముహమ్మద్ బిన్ ఇబ్రాహీం, షేఖ్ ముహమ్మద్ బిన్ మానె మరియు ఆ కాలపు ప్రసిద్ధ ఇస్లామీయ పండితులు.
చేర్చబడిన తేదీ: 2008-09-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/174627
సంబంధిత విషయాలు ( 0 )
Go to the Top