ఇస్లాం ధర్మం యొక్క పునాదులు మరియు మూలసిద్ధాంతాలు
విషయపు వివరణ
పేరు: ఇస్లాం ధర్మం యొక్క పునాదులు మరియు మూలసిద్ధాంతాలు
భాష: హిందీ
అనువాదకులు: అతావుర్రహ్మాన్ దియాఅల్లాహ్
సంక్షిప్త వివరణ: ఆరంభంలో రచయిత ఇలా పేర్కొన్నాడు, "ప్రజలను అల్లాహ్ యొక్క ధర్మం వైపు ఆహ్వానించాలనే ఉద్దేశ్యంతో నేను ఈ పుస్తకాన్ని వ్రాసాను... ఈ విశ్వప్రపంచం ఎలా సృష్టించబడింది, మానవుడు ఎలా సృష్టించబడినాడు, అతడి మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ తన ప్రవక్తలను పంపబడం ద్వారా అతడిపై ఎలా గొప్ప అనుగ్రహం చూపినాడు మరియు పూర్వ ధర్మాల పరిస్థితి ఏమిటి మొదలైన విషయాలను నేను ఇక్కడ క్లుప్తంగా వివరించాను. తర్వాత ఇస్లాం ధర్మాన్ని దాని అర్థం మరియు మూలసిద్ధాంతాల ఆధారంగా పరిచయం చేసాను. కాబట్టి ఎవరైనా సత్యాన్వేషణ చేయాలనుకుంటే, వారికి ఇక్కడ సరైన నిదర్శనాలతో సన్మార్గం లభిస్తుంది. ఎవరైతే మోక్షం, ముక్తి కొరకు అన్వేషిస్తున్నారో, వారికి అసలైన మోక్షమార్గం ఇక్కడ లభిస్తుంది. ఎవరైతే దైవప్రవక్తల, దైవసందేశహరుల మరియు సజ్జనుల మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నారో, అలాంటి వారి కొరకు ఆ సన్మార్గం ఇక్కడ వివరించబడింది. ఎవరైతే ఆ మహాపురుషుల మార్గాన్ని వదిలి పెట్టారో, అలాంటి వారు మూర్ఖులు తప్ప మరేమీ కాదు. అసలు అలాంటి వారే మార్గభ్రష్టులు. వాస్తవానికి ప్రతి ధర్మం, మతం, సిద్ధాంతం ప్రజలను తమ వైపుకే పిలుస్తున్నది. తమ వద్దే సత్యం ఉందని వాదిస్తుంది. అయితే ఇస్లాం ధర్మం స్వీకరించిన వేల, లక్షల మంది నిరూపిస్తున్నదేమిటంటే, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేటంత వరకు తమకు సత్యం అంటే ఏమిటో తెలియదనే వాస్తవాన్ని ఏకకంఠంతో స్వచ్ఛందంగా గొంతెత్తి చాటుతున్నారు మరియు ఇస్లాం ఛాయలో తప్ప తామెక్కడా మనశ్శాంతి, సంతోషం పొందలేదని సత్యం పలుకుతున్నారు. ప్రతి మానవుడు మనశ్శాంతి, సుఖసంతోషాల కోసం అన్వేషిస్తూ ఉంటాడనేది ఒక నగ్నసత్యం. అలాంటి వారి కోసమే నేనీ పుస్తకాన్ని తయారు చేసాను. నా యొక్క ఈ కృషి కేవలం అల్లాహ్ కోసం చేసిన కృషిగా మాత్రమే స్వీకరించబడాలని, ఇహపరలోకాలలో మంచి ప్రతిఫలం ప్రసాదించే పుణ్యకార్యంగా పరిగణించబడాలని నేను అల్లాహ్ వద్ద ప్రార్థిస్తున్నాను."
చేర్చబడిన తేదీ: 2014-10-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/732010
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
అనువాదాలు ( 10 )
ఇస్లాం ధర్మం యొక్క పునాదులు మరియు మూలసిద్ధాంతాలు ( ఇండొనేషియన్ )
ఇస్లాం ధర్మం యొక్క పునాదులు మరియు మూలసిద్ధాంతాలు ( ఇటాలియన్ )
ఇస్లాం ధర్మం యొక్క పునాదులు మరియు మూలసిద్ధాంతాలు ( కొరియన్ )